| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
184. బ్రహ్మముగారి దర్శనము
| నే జూచినానే - బ్రహ్మమునాలో - నేజూచినానే సద్గురు నాలో - నే జూచినానే నే జూచినానమ్మ నెలతరొ తారక రాజయోగము నందు రంజిలు నాగురుని | ॥నే॥ |
| కన్నూల నడుమాను సన్నంపు దిడ్డినా తిన్నాగ వెలిగేటి పున్నమ చంద్రుని | ॥నే॥ |
| ఫాలభాగము నందు నీలజ్యోతుల నడుమ వోలలాడుచునున్న పరలింగమూర్తిని | ॥నే॥ |
| చూపుల లోపల పాపల నడుమను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతినీ | ॥నే॥ |
| చక్షురాగ్రము నందు పశ్చిమ వీధిని నిక్షేపమయి వెలుగు సాక్షిభూతుని నాలో | ॥నే॥ |
| చందమామకు నడుమ కుండలాకృతి యని ఆనందముగ నేడు హరి పోతులూరయ్య | ॥నే॥ |