| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
185. ఒరే ఒరే
| చిల్లర రాళ్ళకు మొక్కుచునుంటే చిత్తము చెడిపో నొరే ఒరే చిత్తము నందున చిన్మయరూపుని చూచుచునుండుట సరే సరే ఒక్కపొద్దులని యెండుచునుంటే ఒనరుగ చెడుదువు ఒరే ఒరే ఏకమైన యా వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే నీళ్లలో మునిగీ గొణుగుచునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే నీళ్లలో వుండే నిర్మలజ్యోతిని చూచుచునుండుట సరే సరే బాధ గురువుల పంచను చేరితె భావము చెడునుర ఒరే ఒరే భావమందునా బ్రహ్మశాంతినీ చూచుచునుండుట సరే సరే భూములు అడవులు తిరుగుచునుంటే బుద్ధులు చెడునుర ఒరే ఒరే బుద్ధిలో వుండే పున్నమ చంద్రుని చూచుచునుండుట సరే సరే |