| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
186. సిద్ధప్ప కులము
| ఏ కులమని నను వివరమడిగితే ఏమని చెప్పుదు లోకులకు లోకులకూ పలు గాకులకు దు ర్మార్గులకూ ఈ దుష్టులకు ॥ ఫాల భాగమున యాలలు పాడుచు భావము గన్నది నా కులము ముట్టున బుట్టిందీ కులమూ ము ట్టంటున పెరిగినదీ కులము ముట్టులొ హరుడు ముట్టులొ శివుడును ముట్టులొ బ్రహ్మం ముగ్గురు మూర్తుల మూలము దెలిసిందీ కులము ఇంటిలోపలను యిల్లు గట్టుకుని మంటలోపల రాట్నం బెట్టుక కంటిలోపల కదురు పెట్టుకొని ముక్కు లోపల యేకు బెట్టుకొని చెవిలో బాకా చేతికి తీసుక నారాయణ యను నరము తీసుకొని అష్టాక్షరి యను తడికె వేసుకొని పంచాక్షరి యను పంచ దీసుకుని తధిమి తధిమి గుబ దెబ గుబ దెబ గుబ ఏకిన కులమే మా కులము ॥ |