| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
187. చందమామ
| చందమామ చందమామ చందమామ ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ జంట నాగస్వరములూది చందమామ పాముని పాదు పెకలించాలి చందమామ తొమ్మిది వాకిళ్లు మూసి చందమామ పాముని పట్టవలెను చందమామ కాయమనే పుట్టలోను చందమామ మాయగానె మెలగియుండు చందమామ భక్తియనే కట్టు కట్టి చందమామ యుక్తి చేత పట్టవలెను చందమామ దేహి దేహముల సందు చందమామ తెలియకుండ చుట్టుకుంది చందమామ ఆ జపమంత్ర ధ్యానము చేత చందమామ అఖండ కళలతొ వెలుగుచుండు చందమామ పాము పట్టే జోగి యెవరె చందమామ అతని పేరు సిద్ధగురుడె చందమామ |