| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (విందులకు సంబంధించినదే యీపాట) |
| 035. విందు పాట |
|
ఈతాకుల యిల్లుకట్టీ మొగలాకుల పందిళ్లేసి చేశారే మామగారూ తమకూతురు పెళ్లి ... మూడేళ్లా నాటీవీ ముక్కా బియ్యము తెచ్చీ ముద్దరాలు అత్తగారూ మూలే బోసిందీ ... కన్న నాటీనుండీ కందుల బేరముచేసీ కలుగున్నా మామగారూ పప్పే వండరుగా ... పౌరోహిత్యుడు వచ్చీ తాంబూలా మివమన్నా దడిచాటున అత్తగారూ దడదడళ్లాడిందీ ... |