| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (కన్నతల్లి కూతురుని అత్తవారింటికి పంపుతూ - అప్పగింతలు పెడుతూంది) |
| 036. అప్పగింత పాట |
|
వదినరో నాపుత్రి ఇది వప్పగింత పదిలంబుగా దీని బాగా చూడమ్మా ... పాలు కాచగలేదు బాల మావదినారో భాగ్యంబు తానీపె బాగా చూడమ్మారొ ... నేకౌ తానే రాదు నెలతసుమి వదినరో నేర్పుగ చెప్పుకో నెలత మీసుతనూ ... ఆకలైన గాని అన్న మడగని బాలా దానినంపిన నేను తాళలేనమ్మారో ... ఎదురింటి భాగ్యమే ఏమిసేయుదు తల్లీ ఎన్నగ అత్తింట పుట్టినింటికి నీవు కీర్తిగా మెలుగుమా ... |