| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 042. తలుపు దగ్గర పాట |
|
వాకిలి తీయవె భామినీ సకలాత్ముడనే కోమలీ చాలుచాలు పోరా శ్రీధరా చులకన ఏలా భూధరా కోరి దరిజేరితి భరియింప మదిగోరి నారి సుకుమారి వయ్యారి సుకుమారి ... అందముగా నారవిందాక్షితో పొందు అందామానంద మకరందామగు కుందా .. వింతాగ నింతింత వింతావేళా కాంతీ యింతీ చేమంతి పూబంతి మరుదొంతి .. పోడేమి నేడేల నాడే పీతోటాడి పాడి మది వేడి ముద్దాడి రతికూడి ... సుదతీరో కాదాని భేదా లెంచాక వాదా మరియాదా దయారాదా నామీదా .. మాధావా నీబాధ సాధానా వినారాదా రాధా దుర్బోధకృత బాధాలగు మేధ .. ఈమారు బావీకీ వేమారు నేసోము భామాలలామ కరుణా మాదెంచుమా వాకిలీ తీసితి మాధావ .. |