| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 055. తిరుగలి పాట |
|
పుణ్యవంతులమ్మ ఈ యింటివారు అన్నలని పిలిచితివి తమ్ములని పిలిచితివి నన్నేల పిలువవే ఓ చిన్ని మరదలా ఏమని పిలుచుదును ఓ ఎర్రి శివుడా నీళ్ళ బాణము తొడిగి నరలోకమేలేనే నా పుణ్య పురుషుండు పువ్వులాబాణం తొడిగి కప్పరథమెక్కే పురుషుడు భూలోక మేలినాడని చెప్పు వచ్చేటి పొయ్యేటి దారి గలదు శివునికి శివపూజ కోరినానని చెప్పు. |