| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 056. లాలి పాట |
|
లాలీ బాలకృష్ణా లాలీ లాలీయనుచు బంగారుయ్యల నీకు వేసిరి వయ్యారముగాను గొల్ల తొయ్యలెల్లాను చేదారయ్యా కృష్ణయ్య ముద్దులయ్యా నెయ్యాములారా ॥లాలీ॥ నీటుగలతొట్టీ బాలుడాటమాని నిదురాపోర సాటీలేనిమాట నేలా కోటిరత్నాలా మూట ॥లాలీ॥ తెల్లవార గొల్లపిల్లలెల్ల నిన్నల్లు కొనచు నుల్ల మొల్ల సిల్లూనటా నెల్లా సేవింతుగాని ॥లాలీ॥ లేచీ నిదురా పోవాకున్నా బూచీ వారలొచ్చి నిన్నూ దోచూకొన బోదురు నే నోచీన నోమూలపంట ॥లాలీ॥ భామలే మొదలే లేమల మీ మదినికోరి నార రామలలామలను ప్రేమదీర పెండ్లిచేయ ॥లాలీ॥ వాశిమీర బొబ్బిలి పురవాసా శ్రీ శ్రీనివాస శ్రీశా శ్రీ శివరామదాసా మనోల్లాసా ॥లాలీ॥ |