| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 066. మాధవా |
|
వెన్నముద్ద మాధవా చిన్న చేత తిందువా? వున్నమాయ పలుకవా గున్నవలె కూర్చుందువా? ముద్దుకృష్ణ పలకవా వద్దనెపుడు నిలువవా? గానమురళి యూదవా గ్రక్కున ననుబ్రోవవా? జున్ను పాలు పోసెద\న్ వెన్ననోట పెట్టెదన్ ఆపదాలు అణచవా రూపునాకు చూపవా? నందపుత్ర గావవా బంధమణిచి బ్రోవవా? |