| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పురిట పదిరోజులూ - ఆ పురిటిగదిలో ఎన్నెమ్మ వుంటుందిట అది ఒక నమ్మకం - ఆ ఎన్నెమ్మను సాగనంపి - బాలలను గావమనే మాతృహృదయం - పాట) |
| 067. ఎన్నెమ్మ పాట |
|
ఏలా కోటెమ్మ మా బాలల్ని గాయీ ఒకటోనాడు ఎన్నెమ్మ ఓరుస్తుందే ఎన్నెమ్మ రెండో నాడూ ఎన్నెమ్మ రెక్కలు కట్టుకు ఎన్నెమ్మ మూడోనాడు ఎన్నెమ్మ మువ్వలు కట్టుకు ఎన్నెమ్మ నాలుగో నాడూ ఎన్నెమ్మ నాట్యంచేసీ ఎన్నెమ్మ ఐదో నాడూ ఎన్నెమ్మ ఆడుతు పాడుతు ఎన్నెమ్మ ఆరో నాడూ ఎన్నెమ్మ అరుస్తూను ఎన్నెమ్మ ఏడో నాడూ ఎన్నెమ్మ ఏడుస్తూనూ ఎన్నెమ్మ ఎనిమిదో నాడు ఎన్నెమ్మ ఏరుదాటే ఎన్నెమ్మ తొమ్మిదో నాడూ ఎన్నెమ్మ తోరణందూరే ఎన్నెమ్మ పదవనాడూ ఎన్నెమ్మ పట్నందాటే ఎన్నెమ్మ బ్రాహ్మడి కూతురు మాలాడి పెళ్లీ. |