| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 085. జోల పాట |
|
ఏమే ఓ చిట్టీ ఎందుకే చేరొట్టెముక్క విరచిపెట్టి నిన్ను పాడుచు జోగొట్టి అదిగో బూచాడు మన అటకమీదున్నాడు ఏడుస్తే వస్తాడూ నిను ఎత్తుకు పోతాడు మిట్లగుడ్ల వాడూ పొణకంత పొట్టివాడు ఏడుస్తే వస్తాడూ నిను ఎత్తుకుపోతాడు ఊషు కాకి రావే పెదశేషిని ఎత్తుకు పోవే హరిరంగా దాసూ నేలిన హరిరంగని విడువాబోకు |