ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
జటాయు దర్శనము
నడుత్రోవ నొకపక్షినాథుని ఱెక్క
లుడివోని కులగిరియో యనుదానిఁ
గని దైత్యుఁడనుబుద్ధిఁగదిసి:“నీవెవ్వ?”
డనుటయు ముదమందియా పక్షి వలికె:
“గరుడాగ్రజాతుండు కశ్యపతనయుఁ
డరుణసారథియైన యరుణుండు ఘనుఁడు
మా తండ్రి;మఱియు సంపాతి మాయన్న;
మీ తండ్రిసఖుఁడఁ జుమీ యేను రామ!
యితరుఁడఁగాను; మీ హితకార్యపరుఁడ
నతులసాహసుఁడ, జటాయువన్వాఁడ;
నీ వనంబును నసురేంద్రసేవితము;
కావున వైదేహిఁ గావు; మేమఱకు.”
మనవుడు దశరథునట్లకా నతని
మనమున యోజించి మైత్రిఁబూజించి

AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )