ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
పంచవటీ ప్రవేశము
యట పంచవటి కేఁగి యందున్న మునులఁ
బటుతపోధనుల సంభావించి మ్రొక్కి[వా.రా. సర్గ 15]
కరమర్థి వారు సత్కారముల్‌ సేయ
ధరణీతనయఁజూచి తమ్మునిఁజూచి:
“పొలుపొంద నెందును బుణ్యాశ్రమములు
గలయఁబెక్కులు వొడఁగందుముగాని
యీ గౌతమీగంగ యీ సరోవరము
లీ గిరు లీ తరు లీ యాశ్రమములు
నెందునుఁబొడఁగంటిమే;67యిట68మీఁద
నిందుండుదము మన69మింపొంద.”ననుచు
నానందమునఁబొంది యందున్నమునుల
యానతి గైకొని యా ప్రొద్దె కడఁగి
తాను సౌమిత్రియుఁ70 దగఁబర్ణశాల
నూనినక్రమముతో నొప్పారఁగట్టి
తమ్ముఁడుఁదానును దానిఁబూజించి
యమ్మహీసుతఁగూడి యనురాగ మెసగ
నా పర్ణశాలయం దాఱుమాసములు
దీపించుపేర్మి వర్తింపుచు నుండె.

  1. యిలమీఁద
  2. గ్రింద
  3. మీ పొంత
  4. తగుపర్ణ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )