| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
నంత నీహారధరాక్రాంత దశ ది శాంతమై హేమంత మవనిఁబర్వుటయు[వా.రా. సర్గ 16] వేకువ నొకనాఁడు వెలఁదియుఁదానుఁ దేకువ గౌతమిఁ దీర్థమాడంగఁ 71జనుచోట రాముఁడు సౌమిత్రిఁజూచి: “కనుఁగొంటివే శీతకాలంబు మహిమ! దెసలెల్లఁజలికి భీతిలి వెలిపట్టు ముసుఁగు వెట్టినయట్లు ముంచె హిమంబు. హేమంత మనుమేఘ మెల్లెడఁ72బర్వి 73వ్రామిగా వడగండ్లు వర్షించె ననఁగఁ గురిసిన పెనుమంచు గుంభిని యెల్ల నెరసి యొప్పారె ఘనీభవించుచును. ఉర్విపై నా మంచు నొక్కొకచోట దూర్వాంకురంబులతుదలఁజూచితివె? పచ్చ74మిన్నసలాకపౌజుపై వేడ్కఁ గ్రుచ్చినముత్యాల 75క్రోవలై యొప్పెఁ. గాముసమ్మోహన కాండంబు లనఁగ, హైమంతవాయువు 76లలవుమై సోఁక వెఱపున వణఁకెడు విరహిణు లనఁగఁ దెఱఁగొప్పఁగదలు పూఁదీగ లీక్షింపు. మంచునఁదారుతామరలు కన్నీరు ముంచినవిరహులమోములఁగేరుఁ. బొదిగొన్నయకరువుల్ పొట్టుగా మీఁదఁ గదలు తేఁటులు పొగల్‌గాఁ జలిగొన్న కొలనుదేవతలకుఁగుంపట్లువోలె విలసిల్లుకెందమ్మివిరులఁజూచితివె? అడవియేనుఁగులు నీ రాన నీ నదికి దుడిదుడి వచ్చి తత్తోయంబుఁదొడికి నడిఁకి గిఱ్ఱనుచుఁ దుండములు వేవేగ ముడిచి పాఱెడిని తమ్ముఁడ! విలోకింపు. మిట్టికాలంబున నే నున్నయట్లు పట్టంబు నా మీఁది భక్తిమై మాని నారచీరలు జడల్ నవ77యుచుఁదాల్చి నా రాకఁగోరుచున్న మహామహుండు పరమపావనుఁడు సౌభ్రాత్రభావనుఁడు వరపితృవాక్య మద్వాక్య తత్పరుఁడు చిరకీర్తినిరతుఁడాశ్రిత 78లాభరతుఁడు భరతుఁడు షఃకాలపరిచితి నెట్లు స్నానంబుసేయునో సరయువులోన? మౌనియై యెట్లొకో మహిఁబవ్వళించు? నా తండ్రిసత్యంబు నా పూన్కి యతని చేత నెంతయుఁబ్రకాశించె లోకముల. నే తల్లిపంపున నెల్ల సంయముల చేత దీవనలు గాంచితి నేను వేడ్క నట్టికైకను నొవ్వనాడునో తెలియ! దట్టేల గావించు ననఘాత్ముఁడతఁడు పట్టంబుఁదొలఁగి తాపసినైతి నేను; పట్టంబు గలిగి తాపసి యయ్యె నతఁడు అన్నదమ్ములపాడి యా పుణ్యుఁజూచి యెన్న నెవ్వరికైన నిఁక నేర్వవలయు. నట్టి యా భరతుని ననుఁగుఁదల్లులను జుట్టాల నెన్నఁడు సూతుమో? మనము” అని వారిఁదలఁపుచు ననివారితముగఁ దని వారునిష్ఠ గౌతమివారిఁ గ్రుంకి యినునకు నర్ఘ్యంబు లెత్తి గాయత్రి పనుగొని యజియించి బ్రహ్మయజ్ఞంబు తమ్ముఁడుఁదాను సీతయుఁ బర్ణశాల కిమ్మెయిఁ జనుదెంచి హితగోష్ఠినుండె. |