| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
నపు డకంపనుఁడు రయప్రకంపనుఁడు విపులార్తి లంకకు వేగంబ పోయి[వా.రా. సర్గ 31] యా రావణునిఁగాంచి:“యసురాధినాథ! వీరులు పదునాల్గువేల రాక్షసులు ఖరదూషణాదులు కాకుత్స్థరాము శరవహ్ని 196నీఱైరి; సత్యం.”బటన్న నక్కజంబునఁబొంది యయ్యకంపనుని దిక్కు చిక్కని రోషదృష్టిఁజూచుచును:197 198“ఏమిరా! యోరి?యెట్టెట్టురా,యోరి? రాముఁడెవ్వడు?రాజరాజొ?స్వారాజొ? యమధర్మరాజొ? వారైనను గూడి యమర మా ఖరదూషణాదులగెల్వఁ జాల; రట్టిప్రతాపశాలుల నొక్కఁ డే లీల 199గెలిచె? మా కెఱిఁగింపు తెలియ; నిదె యభయంబు నీ కిచ్చితి.”ననినఁ బదరక మఱి యకంపనుఁడు రాఘవుని చరితంబు ధైర్యంబు శౌర్యంబు నతఁడు ఖరదూషణాదులఖండించుటయును సౌమిత్రిచందంబు జానకి చంద మా మూలముగఁదెల్ప నతఁడు రోషించి యుద్ధంబుసేయ నుద్యోగించుటయును బద్ధమైత్రిని నకంపనుఁడిట్టులనియె. “రాక్షసేశ్వర! విను రఘురాముగెల్వఁ బక్షివాహన,శూలపాణులవశమె? మాటమాత్రంబున మహియు నాకసము మీటను200నూఁట నమ్మేటియే నేర్చుఁ; గార్చిచ్చునైనను గరువలినైన నార్చను నూర్చను నాతఁడె నేర్చు; భువనంబులన్నియు బూది గావింప నవి ప్రోదిగావింప నాతఁడె నేర్చుఁ; బాల్పడి బ్రహ్మాండభాండంబునైన నిల్పఁబగుల్ప నా నిపుణుఁడె నేర్చు; జలరాసులన్నియుఁజల్లి యింకింప నలవడ నిండింప నాతఁడే నేర్చు; గ్రహతారకావళిఁగడువడితోడ మహి రాల్ప నవి నిల్ప మహిపతి నేర్చు;201 నదిగాన యొకయుపాయంబు సెప్పెదను. కదనంబు వలవ దా కాకుత్స్థరాము దేవి లావణ్యవార్ధినిఁ దెచ్చితేని నా వియోగాగ్నిచే హతుఁడగు నతఁడు.’ నా విని రాక్షసనాయకుండదియ భావించి యాతనిఁబదినోళ్లఁబొగడి హాటకరథమెక్కి యపు డబ్ధిదాటి తాటకేయుని మంత్రిధౌరేయుఁజేరి యతనితో ఖరదూషణాదిరాక్షసులు హతులౌటయును దాను నా రాముదేవి |