ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
మారీచ హితబోధ
సీతఁదెచ్చుటకు నాశించి వచ్చుటయుఁ
బ్రీతిఁజెప్పుటయు మారీచుఁడిట్లనియె:
“నిది యేమి రావణ!యెల్లభోగములు
కొదలేనిసుఖమునఁగుడిచికూర్చుండి
యిట్టిదుర్బుద్ధి నీ కెట్లొకో పుట్టె?
నెట్టి దుర్మంత్రి నీ కీ బుద్ధి సెప్పె?
వాని నీ వటు పగవానిఁగాఁజూడు;
మే నీకుఁబోరానిహితమంత్రిఁగాని
యితరుఁడఁగాను; నీకిది బుద్ధిగాదు.
క్షితిఁబతివ్రతలఁనాశించుట దగదు.
ఆశించి తేని నీ యన్వయంబెల్ల
నాశిల్లుఁ; గాన దానవనాథ! మఱలి
చనుము లంకకు; సుప్రసన్నుండ వగుము.
కనుము సౌఖ్యము నీదుకాంతలవలన.”
ననిన మారీచువాక్యంబు లప్పటికి
విని లంక కేతెంచె వింశతిభుజుఁడు.

AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )