| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
నంత వేగుటయుఁదూర్యములు ఘోషింప నంతంత వందిజనావళి వొగడఁ గల74గొనఁగర్పూరగంధముల్ సల్లు జలముల జలకంబు సదురొప్ప నాడి పరగ దివ్యాంబరాభరణముల్ వూని చిరకీర్తి రాముఁడు సీతతోఁగూడి తెఱఁగొప్ప శచితోడ దేవేంద్రుఁ డొప్పు తెఱఁగున సంపూర్ణతేజుఁడై యొప్పె. మఱియంత నభిషేకమంటపంబునకు నెఱి వసిష్ఠాదులు నిండ నేతెంచి యా యరుంధతి మొదలగుపుణ్యసతుల నాయతమతులగు నమ్మంత్రివరులఁ, దగనొప్పుమకుటవర్ధన చక్రవర్తు లగు మహారాజుల నపుడు రప్పించి పంచపల్లవములుఁబంచవల్కములుఁ బంచామృతంబులుఁ బట్టపేనుంగు నెనమండ్రుకన్యలు హేమవృషంబు నొనర నౌదుంబర యోగ్యపీఠంబు గంగాదితీర్థోదకము లాదిగాఁగ మాంగల్యవస్తుసామగ్రిఁ దెప్పించి, వరరత్నభూషణావళులుఁ దెప్పించి, తరమిడి వేదోక్తదానముల్ సేయ నొకలక్షకన్యలు నొక లక్షగోవు లొక లక్ష75యుక్షంబు లొప్పఁదెప్పించి, జపములు సేయించి శాంతి సేయించి విపులహోమంబులు వేడ్కఁ జేయించి |