ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
సుమంత్రుఁడు కైక నగరి కేఁగుట
యనుపమంబగు లగ్న మాసన్నమైన
మనుజేంద్రుఁబిలువ సుమంత్రునిఁబనుపఁ
గైకేయినగరికిఁ76గడఁకతోఁ బోయి
వాకిట నిలుచుండి వలనొప్ప77ఁబలికె:
“దేవ! సూర్యుఁడు వొడతెంచుచున్నాఁడు;
వేవేగ మీ78రట79 విచ్చేయవలయు;
శ్రీరాముపట్టాభిషేకంబు సేయ
నారూఢమగు లగ్న మాసన్నమయ్యె;
మనుజేశ! యభిషేక80మంటపంబునకు
మునులు రాజులు మహాత్ములు వచ్చినారు
పౌరులు బంధులు భటు లెల్లవారు
మీ రాకఁగోరి యిమ్మెయి నున్నవార.”
లని విని దశరథుఁ డా వార్తలెల్లఁ
దనకుఁగేవల 81ము సంతాపంబు సేయ
వినియు నిద్రించిన విధమున నుండె
వనట“నీవును నొంపవచ్చితే!”యనుచు.
నా సమయంబున ననియెఁగైకేయి:
“యోసుమంత్రుఁడ! వేగ యుర్వీశుకడకు
రామునిఁదోడ్తెమ్ము రాజుపం.”పనుడు
నా మాట విని యతఁడప్పుడే పోయి

  1. గడువేగపో
  2. నతఁడు
  3. రిటు
  4. వేంచేయ
  5. మహిమ వీక్షింప
  6. మనస్తాపంబు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )