ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
సుమంత్రుఁడు రాము సన్నిధి కేఁగుట
శీతపటీరాంబుసిక్తాంగణంబుఁ
గేతనాన్వితము నికేతనాంచితముఁ
జందనాగురుధూప సౌరభాన్వితము
మందానిలాలోల మాలికాయుతముఁ
బ్రతిగృహద్వారరంభాస్తంభవర్గ
మతులితమణి తోరణాభిరామంబుఁ
బౌర82జానపద సంభ్రమనిసర్గంబు
నౌరాజమార్గ మొయ్యనఁగనుంగొనుచు
నింద్రుగేహము హసియించి, యాకిన్న
రేంద్రు మందిరముతో నీడుజోడగుచు
సాంద్రవైభవరమాసహితమౌ రామ
చంద్రునినగరికిఁజనుదెంచి లోనఁ
జనవరులైయున్న జనులచే వేగ
తనరాక యెఱిఁగించి తదనుజ్ఞ వడసి[వా.రా. సర్గ 16]
చిత్రాఖ్యతారతో సిరులుల్లసిల్ల
మైత్రి83నొప్పెడు చందమామచందమున
సీతాసమేతుఁడై చెలువొందు రామ
భూతలనాథునిఁబొడఁగాంచి మ్రొక్కి:
“రా,దేవ!మిము దశరథచక్రవర్తి
యా దేవి కైకగృహంబున నుండి

  1. జనాదిసంభ్రమ దుర్గమంబు
  2. నుండెడు, యొప్పెడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )