| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
యాదటఁబిలిచితెమ్మని పంచె.”ననుడు మోదించి చిఱునవ్వుమొలకలు నిగుడ ధరణిజ నట84యుంచి తాను లక్ష్మణుఁడుఁ గరమర్థి రథమెక్కి కడఁకతో 85వెడలి చతురంగబలము లసంఖ్యముల్ గొలువ నతులవాద్యములు మిన్నంది ఘోషింప[వా.రా. సర్గ 17] వందిబృందంబు గైవారంబు సేయఁ జెందిపుణ్యాంగనల్ సేసలు సల్లఁ బురజను లానందమున జయవెట్ట నరనాథునగరి కున్నతగతి వచ్చి యరదంబు డిగి రాముఁడర్థిఁ గైకేయి వరమందిరముఁజొచ్చి వలనొప్ప86నచట[వా.రా. సర్గ 18] వదనంబు వాంచి వైవర్ణ్యంబు మించి పెదవులు దడుపుచుఁ బెంపెల్ల నుడిగి 87యుడుగక కన్నీళు లొలుక శోకాగ్నిఁ బడి88కాలు దశరథపతిఁ జేరఁబోయి కరము భీతిలి మ్రొక్కి కైకకు మ్రొక్కి కరములు ముకుళించి కడు89విస్మయంబు వెఱవెఱపాటును విహ్వలత్వంబు వెఱపును మఱపును వీడుజోడాడ: “నో దేవి! యిది యేమి యుర్వీశ్వరుండు నా దెసఁజూడఁడు? నా తప్పులేమి? ఈ విన్నదనమును నిట్టిదుఃఖంబు నీ విచారము రాజు కే వెంటఁగలిగె?” ననవుడుఁగైకేయి:“యధిపుచందంబు వినుపింతు నీవు గావించెదవేని.” నని90పల్క రఘురాముఁ“డది యేమితెఱఁగు వినుపింపుమో యమ్మ! విశదంబుగాఁగఁ; దండ్రివాక్యములకై దారుణశిఖల వేండ్రమౌనగ్నిలో విషధిలోనైనఁ బడియెద; విషమైన భక్షించువాఁడ; జడియక వినుపింపు; సత్యమీ91పలుకు.” అనవుడుఁగైకేయి యా రాముఁజూచి మనమునఁగృపమాలి మఱి సెప్పఁదొడఁగెఁ: |