| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
ఆ సమయంబున నా రామవిభుఁడు కౌసల్యయింటికిఁగడఁకతో వచ్చె. నటమున్న తొడరి యా యభిషేకమునకుఁ బటువిఘ్న మొరులు సంపాదింపకుండ జపములు శాంతులు 106సకలహోమములు విపులై కనిష్ఠఁగావింపుచుఁబ్రేమఁ గరమర్థి నేమముల్ గైకొని భక్తి పరత107జనార్దనుఁ బ్రార్థింపుచున్న కౌసల్య రామురాకకు సంతసిల్లి భాసిల్లువరపుణ్యభామలుఁ దాను నెలమి సేసలు గొంచు నెదురుగా వచ్చి వెలయ శుభాచార విధులాచరించె. నంత నా కౌసల్య యడుగుల కెఱఁగ సంతోషమున రామచంద్రుని నెత్తి యాలింగనము సేసి:“యాయువు యశము భూలాభమును బొందు పుత్త్ర,నీ.”వనుచు, దీవించుతమతల్లి తెఱఁగొప్ప రామ దేవుఁడు వీక్షించి 108ధీరుఁడై పలికె: నీ కార్యమును దల్లి! యెఱుఁగరు మీరు. మీకు సుమిత్రకు మిథిలేంద్రసుతకుఁ గడుభీతిఁబుట్టించుకార్యంబు109వుట్టె. విడువక ధృతిఁబూని వినుఁడు సెప్పెదను: వసుధేశుచే రెండువరములు దొల్లి యసమాన110గతిఁ గైక యాజిలోఁబడసెఁ; గొడుకుఁబట్టముగట్టఁగోరె నొక్కటికి; నడవికి ననుఁబంప నడిగె నొక్కటికి. నడిగిన దశరథుండధికశోకమునఁ 111బడుటయు మా తండ్రిపలుకు రక్షింప. నడవులఁ బదునాలుగబ్దంబులుండఁ గడఁగి వచ్చితి.”నన్నఁగౌసల్యమదిని గలఁగి నివ్వెఱఁగంది కడుఁజిన్నవోయి పలుకనేరక మ్రానుపడి యుస్సురనుచు ముడిగొన్నవగలతో మొదలంటఁద్రెవ్వి పడియున్నలతవోలెఁ112బడిమూర్భవోయె. నడలుచు రఘురాముఁడప్పు డాతల్లి నెడపని భక్తితో నెత్తి నెమ్మేనఁ గమియనంటినధూళిఁగరములఁదుడిచి కొమ113రారుగద్దియఁగూర్చుండఁ114బెట్టి శ్రమము దీరంగ లక్ష్మణుఁడును దాను సముచితగతి నుపచారముల్ సేయ నొదవిన వగలతో నొయ్యనఁ115దెలిసి పెదవులు దడుపుచు బింబోష్ఠి వలికె: ‘ననఘ!రాఘవ! నిన్ను నడవులనుండు.’ మనుపల్కువిననెందు నరిది వీనులకుఁ బెలుచనక్కట నిన్నుఁబిలిపించి యిట్లు పలుక నెమ్మెయిఁజాలెఁబార్థివేశ్వరుఁడు? ధరణికంతటికిని దనమాఱు గాఁగ భరతుఁబట్టముగట్టి పతిసేయుఁగాక; కడుఁగృపాశూన్యుఁడై కాకుత్స్థతిలకుఁ డడవికి నిన్నుఁబొమ్మనకున్న నేమి? యవివేకిఁగాఁ;డొండె; యధముఁడుఁగాడు; సవతిమాటలు వినఁజనునయ్య,తనకు? ‘నిదిధర్మ; మిదికార్య;మిదిలెస్స.’యనుచు మదికెక్క హితులైన మఱి మంత్రులైనఁ గులగురుండైన లోకులు మెచ్చ నతనిఁ దెలుపలేరై రె నీ దెస మైత్రి గలిగి? యింత పాపముసేసెనే నేఁడు కైక? యింత నేరమి సేసెనే నేఁడు నాథుఁ? ‘డడవులనుండు పొ.’మ్మని నిన్నుఁజూచి నొడువఁగఁగైకకు నో రెట్టులాడె ననుపునఁజేరి ప్రాణములైన నడుగ జననాథు116నకుఁదాను చనవురాలైన గైకకుఁబుట్టి లోకము లేల కీవు నా కేలపుట్టితి నా రామచంద్ర!? యీవు నా కడుపున నిటు పుట్టకున్న నీ విషాదము నాకు నేల వాటిల్లుఁ? గొడుకులు లేని యా గొడ్రాలికంటెఁ గడలేని శోకంబు గలిగె నా కకట! నరనాథనందన! ననుడించి నీవు కరము తెంపున ఘోరకాంతారములకు నరిగినప్పుడె నాకు నారసిచూడ మరణంబు 117దప్పించి మఱియొండు లేదు. నన్నెట్లు డించి కాన కేఁగె118దింక? నన్న,నే నేమిట నడ లార్చుకొందుఁ? బెక్కుదానంబులుఁ బెక్కుధర్మములుఁ బెక్కు వ్రతంబులుఁ బెక్కువఁజేసి పెద్దగాలమునకు బిడ్డలు లేక తద్దయు119వేడ్క నిన్ దనయుఁగాఁగాంచి యూఱడియున్నచో నుండ120రాదయ్యె. నాఱడిఁజెడిపోయె నకట! నా తపము! ఎలమిమై 121నిరువదియేనువత్సరము లలరి పెంచితి నిన్ను నఖిలంబు 122నెఱుఁగ నిట్టి నన్నిట డించి 123యెట్లు పోయెదవు? పట్టి! నీ కొఱకునై124పాటించినట్టి వివిధవ్రతంబులు వివిధదానములు చవుట విత్తనములు సల్లినట్లయ్యె. భరతుఁడు రాజైనఁ125బరిచారజనము కరుణమాలినయట్టి కైకకు వెఱచి ననుఁగొల్వవత్తురే? నరనాథునందుఁ జనవులేకుండెడు చందంబుఁగాంచి. వాసియు వన్నెయు వైభవం బెడలి యీ సవతులలోన నెట్లు వర్తింతుఁ? గైక రాజసము లే కరణి సైరింతు? నీ కార్యమిట్లౌట యెఱుఁగలేనైతి? వీనుల నీ వార్త 126వినుటకుమున్నె యే నేలచా127నైతి? నినవంశతిలక! కడఁగి యీ రాజ్యంబుఁగైకొని కైక కొడుకుఁబట్టముగట్టుకొని యేలుఁగాక, భూరిదుర్గములకుఁబోవ నేమిటికి? నూరక నాయొద్ద నుండు మో తండ్రి! యా వసిష్ఠాదిసంయములు బాల్యమున భావించి 128నీ పాణిపాదపద్మముల జలజాతహలకులిశధ్వజకలశ ములు మొదలగుచిహ్నములు విలోకించి ‘యీ విశ్వమంతయు నితఁడేలు’ననిరి; యా వార్త కైక నేఁ డనృతంబు సేసె.” |