| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
నని పెక్కుభంగుల నడలుకౌసల్యఁ గనిలక్ష్మణుండు శోకముఁగోప మెసగ[వా.రా. సర్గ 22, 23] ముడిపడుబొమలతో మొగము గంపింప నుడుగక రోషాగ్ను లొగిఁ బర్వుచుండ రాము 129మాతనుజూచి రామునిఁజూచి సౌమిత్రి యడిదంబు జళిపించిపలికె: “మగఁటిమి దిగ130నాడి మానంబు131విడిచి తగ నుత్తమక్షత్త్ర ధర్మంబు వదలి వాలినతేజంబు వమ్ముగాఁ జేసి యేల యీ దీనోక్తులిట్లాడ నీకు? నక్కటా! నీతిజ్ఞుఁడగు తండ్రిపనుపు స్రుక్కక ధిక్కరించుట 132గాదుకాక; కామాతురుఁడు133వృద్ధు గడుఁబాపకర్ముఁ డేమిటి కీ రాజు నింత వాటింపఁ? గైకేయి కిచ్చి ‘బొంకఁగనేర’ననుచు నీ కిచ్చి యోడక నేఁ134డెట్లు బొంకె? నడరి వసిష్ఠాదు లందఱు వినఁగఁ గడఁగి నిన్ ‘బట్టంబు గట్టెద’ ననిన పలుకు సత్యంబుగాఁబాటింప వలదె? తలపోయ నిది యసత్యముగాదె తొలుత! నెక్కడిదశరథుం? డెక్కడివరము? లెక్కడిభరతుం135డు? నెక్కడి కైక? విను మేను నిజముగా విల్లెక్కువెట్టి కొనియున్న నన్ను మార్కొన నెవ్వఁడోపు? భరతుండు మొదలుగాఁబగవారిఁజంపి నెరసి యీ పురమెల్ల నీఱుగా136వింతు. హరిహరబ్రహ్మాదు లడ్డమైరేనిఁ 137దరమిడి తోలి తొప్పరలాడువాఁడ. నాలికై సుతుఁబాఱనడఁచు నా ధరణి పాలునిఁదునిమినఁబాపంబు లేదు. తగవును ధర్మంబుఁదప్పినమీఁదఁ దగఁజూచి గురునైన దండింపవలయు. నృపసూనుఁ డీ మాట నిరసించి పుచ్చి విపినభూమికిఁజన్న, వెనుకన చనుదు. వనవహ్నిఁజొచ్చిన, వారక మ్రోయు వనధిఁజొచ్చినఁదోన వడిఁజొచ్చువాఁడ. జనని!నీవును రామచంద్రుండు నాదు ఘనపరాక్రమలీలఁగనుఁగొనుఁ.”డనిన నిడుదఱెప్పలఁగన్ను నీ రప్పళించి కడుదైన్యమున రాముఁగౌసల్య సూచి: “తనయ! నీ కూరిమితమ్ముండు గాఁడె; చనవిచ్చి వినవయ్య! సౌమిత్రిమాట. శౌర్యంబు సేపట్టి జనులెల్లఁ బొగడ నార్యసమ్మతముగా నవనిఁబాలింపు. సవతిమాటలకు రాజ్యము మాని యడవి నివసింపఁ బోవుట నీకు ధర్మంబె? నా యింట నుండుము; నాకు శుశ్రూష సేయు; మింతటికంటె క్షితి ధర్మమెద్ది? జనకువాక్యము సేయఁజాలిన నీకు జననివాక్యంబెన్న సన్నమే? యన్న!” యని పెక్కు తెఱఁగుల నడలుచునున్న తనతల్లి నూరార్చి తగవెల్లఁదెలిపి “యేమిటి కీ మాట? లింతశోకింప నేమిటి?”కని రాముఁడేర్పడఁబలికె: |