| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
యనురాగ మొందుచు నంత రాఘవుఁడు దన నగరికి వచ్చి తగవొప్ప 157మఱియు నంతిపురంబున కరుగుచో సీత యింతులుఁదానును నెదురేఁగుదెంచి తనుఁజూచి మది విన్నఁదనము గైకొన్న ఘనుని రాఘవుఁజూచి కడుఁజిన్నవోయి: “యిదియేమి నా ప్రాణహృదయేశ! నీదు వదనాంబుజము గడువాడువాఱినది? గట్టిగాఁబుష్యయోగము దప్పకుండఁ బట్టంబుఁగట్టెనే పార్థివేశ్వరుఁడు? సోమమండలముతో జోడగునట్టి నీ మోముఁదమ్మికి నీడ158 రాదేల? చామరద్వయము పార్శ్వంబుల నెవ్వి? యేమొకో159మును పట్టపేనుంగు రాదు? శ్రీరామ నీ మౌళి సేసఁబ్రా లెవ్వి? పౌరులు నినుఁగొల్చి బలసిరా రేల? దుందుభిపటహాది తూర్యఘోషములు వందిమాగధుల కైవారంబు లెవ్వి? సౌమిత్రి మోమునఁ జాలదుల్లాస మేమిచందమొ! నాకు నెఱిఁగింపు మధిప!” యనిపల్కుసీతముగ్ధాలాపములకు మనమునఁగుంది, యమ్మానినిఁజూచి: “మునులకు నృపచిహ్నములగొడవేల? విను మది యెట్లన్న వివరింతు నీకుఁ : గైక మా తండ్రిచేఁ గరమొప్పఁదొల్లి గైకొన్నవరములు గాంక్షించి నేఁడు కొడుకు పట్టముఁగట్టుకొని రాజ్యమేల, నడవుల నన్నుండ నడిగెఁ గావునను బనివడి వనములఁబదునాలుగేండ్లు జనకుశాసనమునఁజరియింపవలసెఁ. దల్లిదండ్రులమాట దాటక చేయు బల్లిదులకును సంపదలుఁ, గీర్తియును, నాక లోకాది నానావిధ పుణ్య లోకంబు లరచేతిలో నుండుఁగాన యే నరణ్యములకు నేఁగెద.” ననిన జానకి రఘురామచంద్రునిఁజూచి కదిరిన భీతిమై గాలికిఁ గదలు కదళిచందంబున గడగడ వడఁకి బెదరి డగ్గుత్తికవెట్టి 160పెన్వగలఁ జెదరి యంతంతకుఁజెలు వేది పలికె: |