| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
యనుకూలమతియైన యాతనిచేతఁ దనపురోహితుని నుత్తమగుణాన్వితుని నా వసిష్ఠునిపుత్త్రుఁడైన సుయజ్ఞు రావించి బహురత్నరాజిఁ బూజించి హారకుండలవలయాంగద174కటక చారుకోటీరాది సకలభూషలను మాతులుండొసగినమదగజేంద్రంబు ఖ్యాతశత్రుంజయాఖ్యము మొదలైన కరిసహస్రంబును గమనీయ వస్త్ర సురుచిరదివ్యవస్తువులెల్ల నొసగి, పసిఁడి యేర్పడఁ బుచ్చి పదికోటు లొసగి యసమానవస్తువు లర్థితో నిచ్చి, చెలిమి నగస్త్యకౌశికు లనువారి కిల రత్నరాసు లనేకంబు లొసగి, మొగి వసిష్ఠాదిసన్మునిజనంబులకుఁ దగుతాపసులకు నర్థము లొప్ప నొసగిఁ పేదసాదులకును బృథ్విదేవతల కాదట బంధుమిత్రాశ్రిత తతికి వందిమాగధులకు వరదాన175యుక్తి నెందును బొగడొంద నిలుసూర176లిచ్చె. నా యరుంధతికి సుయజ్ఞునిసతికి నాయతంబగుభక్తి నప్పుడు సీత తనభూషణము లిచ్చి తన యర్థమిచ్చి తన యింటఁగలపదార్థములెల్ల నిచ్చె. 177నత్తఱి సౌమిత్రి యాత్మీయమైన విత్తమంతయు178వేదవిదులకు నొసగె. నా వేళఁ ద్రిజటాఖ్యుఁడను ధరామరుని దేవి రాముని యీవి తెఱఁగెల్లఁదెలిసి పతిఁజూచి:“దారిద్ర్యభరముచే నేల యతిదుఃఖములఁబొందె? దదెరామవిభుఁడు నివ్వటిల్లెడు వేడ్క నిఖిలవస్తువులు నెవ్వరేమడిగిన నిచ్చుచున్నాఁడు. నీ కుటుంబముఁజెప్పి నీ179లేమిఁజెప్పి కైకొమ్ము రాముచేఁగామితార్థముల.” ననిన నా భూసురుండారాముకడకుఁ జనుదెంచి దీవించి:“జనలోకనాథ! సమ్ముదంబుగ నర్థిజనులకు నెల్లఁ గొమ్మని వస్తువుల్ గోరినవెల్లఁ దనియంగ నిత్తు వెంతయుసంతసమున నని యేను మీకడ కరుదెంచినాఁడ. బేదను;బిడ్డలు వెక్కండ్రు గలరు; ఏదైన నొకదాన మిమ్ము నా.”కనిన: “నావులమంద180లయ్యా! యున్న విపుడు; నీవు నీచేయష్టి నిజశక్తి మెఱసి యెందాఁక నేసితి వీలోనిపసుల మంద181లు నీ.”వన్న మది సంతసిల్లి యఱ182వి దోవతి 183మొదలంటంగ బిగిచి కుఱుచైన సిగముడిగొని యౌడు గఱచి నరము184లుఁబ్రాణముల్ నలి నంటఁ185బట్టి బిరబిరఁదనయష్టి బెట్టుగాఁ ద్రిప్పి యురమున జందెంబులుఱ్ఱూఁతలూఁగ సరయువుదాఁక విచ్చలవిడి నేసి ‘బ్రదుకు జీవమ’యని బ్రాహ్మణుండట్టి మొదవులుగొన్న రాముఁడు చోద్యమంది: “186యనఘ!మీ సత్త్వమే నరయుట కిట్లు పనిచితి.”నని చాలఁబ్రార్థింప నలరి సంతోషమున నట సనెఁద్రిజటుండు. నంత నా రఘురాముఁడనురాగ మెసగఁ గృతకృత్యుఁడైవచ్చి గృహదేవతలకుఁ జతురుఁడై మునులకు సద్భక్తి మ్రొక్కి |