ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రాముఁడు సీతాలక్ష్మణులతో దశరథు దర్శింప నేఁగుట
187మును జనకునియజ్ఞమున వరుణుండు
తన కొసగిన తనుత్రాణ కోదండ[వా.రా. సర్గ 33]
ఘనతరతూణీర ఖడ్గాయుధములు
తన కులగురునింట దాచుటఁజేసి
యనుజచేఁదెప్పించి యవి ధరియించి
జనకజాలక్ష్మణసహితుఁడై తనదు
నగరంత వెడలి నానా ప్రకారములఁ
బొగులుచుఁ దనుఁజూచి పురజనులెల్ల
రాజవీథులనుండి రచ్చలనుండి
రాజితోన్నత సౌధరాజిపై నుండి
పుట్టినశోకాగ్నిఁ188బొగులుచుఁ,గొంద
“ఱిట్టిదుర్దశ కర్హుఁడే?రాముఁ.”డనుచు,
“నెందు రాముఁడు189వోయెనింకనందఱము
నందెపోద190ముఁగాక.”యని కొందఱనుచుఁ
గొంద“ఱీ రాజన్యకుంజరువెనుక
మందిరంబులు డించి మనమెల్లఁజనఁగ
నే పాఱి పెంపెల్ల నెడ191లి పాడైన
యీ పట్టణముఁగైక యేలుఁగా.”కనుచుఁ,
బరికిం192పఁగొందఱుప్రజ“లీ పురంబు
పొరిఁబొరి నెలుఁగులుఁబులులు సింగములు
నక్కలు వఱళులు నలిఁబిశాచములుఁ
బెక్కు భూతంబులుఁబ్రేతసంఘములుఁ
బాయనియడవియై, పతిరాముఁడున్న
యా యరణ్యమెపురంబగు.”193నంచుఁబలుకఁ
గ్రందయ్యె బహువిధాక్రందనరవము.
లందంద యవి వించు నధికధైర్యమున
జగతీశునగరికిఁజనుదెంచి మఱియుఁ
దగ సుమంత్రునిఁగాంచి ధరణీసుతుఁడు:
“వినుపింపు మా రాక విభునితో.”ననినఁ
జని శోకమునఁ జాలసంతాప మందు[వా.రా. సర్గ 34]
రాజేంద్రుఁ194గనుఁగొని“రామలక్ష్మణులుఁ
బూజితచరితయౌ భూతనూజయును
వచ్చినా.”రని చెప్పవడి మూర్ఛవోయి
195చెచ్చెరఁ దెలివొంది చెందినవగల
నల్లన గద్దియ నాసీనుఁడగుచు
నుల్లంబులో ధైర్యమొక్కింత నిలిపి:
“వత్తురుగాక నా వనిత లందఱును
196నిత్తఱి రఘురాము నెలమితోఁజూడ.”
ననుచు197గద్గదికతో నల్లనఁబలుక
విని యా సుమంత్రుండు 198వినయంబుతోడ
నంతఃపురంబున కరిగి యా రాజు
నింతుల మున్నూట యేఁబండ్రఁదెచ్చి
మఱిపోయి 199రామలక్ష్మణుల నా సీతఁ
దెఱఁగొప్పఁ దోడ్కొనితేర వీక్షించి
యాలింగనముసేయ నర్థితో లేచి
యా లోన రాలేక200యవశుఁడై పడియె.
నంత నా శ్రీరాముఁ డా రాజుఁబట్టి
యెంతయు 201సంభ్రమంబెసగంగఁదిగిచి
తొడలపై నిడుకొని దుఃఖింపఁగొంత
వడికిఁజైతన్యంబు వచ్చి కూర్చుండి
తనుఁజూచుచున్న యా తండ్రినిఁజూచి
జననుతుండగు రామచంద్రుండు వలికె:
“ననఘాత్మ! నీదుసత్యము నిల్ప నేను
వనభూములకుఁబోవువాఁడనౌ టెఱిఁగి
యీ సాధ్వి జనకమహీపాలసుతయు
నీ సుమిత్రాపుత్త్రుఁడిద్దఱు మిగుల
వలదని యే నెంతవారింప వినక
నలరి తామును బైనమై యున్నవారు;
గాన వీరును నేనుఁగానల కేఁగ
నానతి యి.”మ్మన్న నా నరేశ్వరుఁడు:
“మదిఁదూలి కైకేయిమాటకు నిన్ను
నదయతఁ202బొమ్మంటి నకట! కానలకుఁ
జేకొని నా మాట సేయంగనేల
నీ కిట్లు నందన!? 203నీవు నీ యంతఁ
జెన్నొంద రాజ్యంబు సేయుదుగాక.”
యన్న నా మాటకు హస్తముల్‌ మోడ్చి:
“తలపోయ గురుఁడవు; ధారుణీపతివి;
యెలమిమై రక్షింప నిష్టబంధుఁడవు;
నటుగాన నీ వాక్యమర్థితోఁజేయ
నిట నాకు నానతి యిచ్చి 204నన్ననుపు.
సత్యసంధుండవై జనలోకనాథ!
నిత్యంబుగా నేలు నిఖిలలోకములు.”
205ననిన దీర్ఘాయువు నత్యంతయశము
వినుత206బలంబును విమలవిక్రమము
నకలంకధర్మంబు నమరంగఁబొందు;
మొకబాధయునులేక యుండు మో పుత్త్ర!
యారంగ నన్నును నలయు మీ తల్లి
నీ రాత్రి యూరార్చి యెల్లి పొ.”మ్మనిన
“నేఁడేమి? యెల్లేమి?నిలువరా దిచట,
నేఁడె పోయెద; నన్ను నెమ్మివీడ్కొలుపు.
నరనాథ! నీ207యీగి నా తమ్ముఁడైన
భరతుఁడీ వసుమతిఁబాలింపనిమ్ము;
వగపు నీ కిటమీఁద వల.”దన్న రాము
తెగువకు దశరథాధిపుఁడు శోకించి:
“నీవంటి సత్పుత్త్రు నిష్ఠురాటవుల
208కే వెంటఁబొమ్మ209ందు? నెట్లునోరాడుఁ?
గైకేయి210మాయలఁగడు మోసమాయెఁ
గా,కటకట!”యని కరుణ రా నేడ్వ,
నంతఃపురాంగన లందఱు నడల,
నంతఁగౌసల్యయు నా సుమిత్రయును
వంతల వాలుచు వగలఁదూలుచును
వింతగా విభుఁజేరి విలపించుచుండ;
211నపుడు సుమంత్రుఁడాయతివలయేడ్పు,
212నృపుశోకమునుజూచి నిట్టూర్పువుచ్చి[వా.రా. సర్గ 35]
ఘనతరశోకసంకలితుఁడై కైకఁ
గనుఁగొని పలికె నుత్కటకోపుఁడగుచు:
“నీ యత్నమునఁగదా నృపునకు మాకు
నీ యవస్థలు వచ్చె; నేమనఁగలదు?
పతిహితంబేమియుఁబరికింప213వెట్టి
సతివైతి? వకట!రాక్షసి214వి నీ వరయ!
నీ తల్లియట్లనే నీవు ప్రాణేశ
ఘాతిని; వది యెట్టిగతియన్న వినుము:
సకలభాషలు నీదు జనకుఁడెఱుంగు.
నొకనాఁడు మీ తల్లియును దానుశయ్య
నొఱపుగాఁబవళించి యొకకీటవార్త
లెఱిఁగి యాతఁడు215నవ్వ నెద సంశయించి
“యిదియేల నవ్వితి వెఱిఁగింపు.”మనిన:
216“నది సెప్పినను బ్రాణహానియౌ నిప్పు.”
డనవుడు:“నీ ప్రాణహాని కే వెఱవ;
వినుపింపు.” మనిన వివేకించి యతఁడు
నదయతఁబురి వెళ్ళనడచె మీ తల్లి.
నది గాన యా217జంత కాత్మజవైన
నీ కేలకల్గు మానితపతిహితము
నో కైక!?”యనిన నా యువిద యెంతయును
దలవాంచి కొండొకతడవు సింతించి
పలికె నా దశరథపతిఁజూచి యపుడు:
“మున్ను మీ కులమున ముఖ్యుఁడై సగరుఁ
డున్నత కీర్తియై యుర్వియేలుచును
అసమంజసునిఁ దన యగ్రనందనునిఁ
గొసరక పురి వెళ్లఁగొట్టంగ లేదె?
రామచంద్రుని నీ వరణ్యభూములకుఁ
దామసింపక పంపు; తప్పేమి దీన.”
నన విని దశరథుఁ డధికశోకాబ్ధి
మునిఁగి ప్రత్యుత్తరంబున కోపకున్న
నపుడు సిద్ధార్థకుండను మంత్రివరుఁడు
కపటాత్మురాలైన కైక కిట్లనియె:
218నసమంజసుఁడు గ్రొవ్వి యఖిలబాలకుల
వెస సరయువులోన వేయు నిచ్చలును.
నీ రామునందొక్క యెగ్గైనఁగలదె?
చారువర్తన 219గణ్యసౌజన్యుఁడితఁడు.”
నావుడు:“సత్యంబు నాతోడఁబలికెఁ
గావునఁదండ్రివాక్యము సేసి సుకృతి
యగుఁగాక రఘురాముఁ.”డనవుడుఁగైక
తెగువకు దశరథాధిపుఁడు 220శోకించి
చాల సంతాపించి జడిగొన్న వగలఁ
దూలుచు నా సుమంత్రునిఁజూచి పలికె:
ధనముల మణుల గోధనముల బంధు
జనముల నవరోధజనముల హితుల
గజముల రథముల ఘనతురంగములఁ
బ్రజల మంత్రుల రామభద్రునివెనుక
వెడలింపు; మీ రిత్తవీడు గైకేయి
కొడుకుఁబట్టము గట్టుకొని యేలుఁగాక!”
యని యిట్లు దశరథుఁడాడువాక్యములు
విని కైక గోపించి విభుఁదూఱఁబలికె:
221సౌమిత్రియును దాను జనకనందనయు
రాముఁడు నారచీరలు ప్రీతిఁ గట్టి
యేను జూచుచునుండ నెల్లభోగములు
మాని దుర్గములఁగ్రుమ్మరఁ బోకయున్నఁ
బొసగదు నీ యీగి; బొంకు నీ పలుకు;
వసుధేశ! నీ యిచ్చువరము లే నొల్లఁ.
దప్పితి వీ.”వన్న దశరథాధీశుఁ
డప్పుడు మూర్ఛిల్లి యవనిపైఁద్రెళ్లె.
ధరణిపైఁబడియున్న తండ్రినిఁజూచి
పరితాపమందుచుఁబలికె రాఘవుఁడు:
“ఏలమ్మ! కైకేయి! యిమ్మహారాజుఁ
222దూలిపోఁబలుమాఱుఁ223దూలనాడెదవు?
గురుఁడును రాజును గూరిమి తండ్రి
పరమదైవం బిట్టిపతి నన్నుఁబనుప
విషమైన మ్రింగుదు, విషమాగ్నినైన
విషధియైనను జొత్తు వేడ్కతో ననిన
వనముల మునులతో వర్తింపుమన్న
ననుమతించుట నాకు నది యెంతవెద్ద?

  1. ధరణిజఁదోడ్కొని తాను లక్ష్మణుఁడు - శరచాప తూణీరసహితులైవెడలి, రాజునొద్దకు నేఁగ రాజచిహ్నంబు - లోజఁగానక పౌరులుల్లంబు లరయ?
  2. బొక్కుచు
  3. వోవు
  4. మటంచునని కొందఱనఁగ
  5. సి,రి
  6. ంచి కొం
  7. ఁగాకయనినఁ
  8. గని దేవ
  9. నొచ్చినచిత్తంబు నూల్కొనఁదెలిసి
  10. వత్తురుగాక నావరపుత్త్రుఁజూడ
  11. డగ్గుత్తిక
  12. వెసభయంబు నను
  13. యా రాము మహనీయతేజు
  14. యవనిపైఁ బ
  15. ఁబ్రేమచే సె
  16. బొమ్మన్న
  17. నీకు
  18. పొమ్మనుము
  19. నని పల్కి యా
  20. ప్రశస్తియు
  21. యాజ్ఞ
  22. కీ
  23. మాటల
  24. అంత…
  25. నెంతయునృపుశోకమేర్పడఁజూచి
  26. నట్టి
  27. వైతివరయ
  28. నవ్వుడెద
  29. నదియ చెప్పిన
  30. చండి, కాంత
  31. అసమంజసుండు దర్పాతిరేకమున-నెసగ బట్టణములో నెల్లబాలురను, సరిపట్టికట్టి యా సరయువులోనఁ-బరువడి వైవంగఁబౌరు లందఱును, సగరునితోఁజెప్ప జనహితంబునకుఁ (గనుఁ)- దగవు చింతించి యా తనయుఁబోనడిచె
  32. గుణ
  33. కోపించి, కోపమున
  34. రాజపుంగవ! నీవు రామచంద్రునకు- రాజిల్లు నీ సర్వరాజ్య సంపదలు, నిచ్చి పాడైయున్న యీ పురంబేల - యిచ్చెదు భరతున కీ పల్కులేల? సౌమిత్రియును
  35. దూలఁబో
  36. దూఱ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )