| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
తే,నారచీరలు దేవి! నా.”కనిన నా నాతి నిర్లజ్జయై తానె యపుడు నారచీరలు దెచ్చి: “నరనాథపుత్త్ర! గారవంబున నీవు గట్టుకొ.”మ్మనుచుఁ బేరెలుంగునఁబల్కఁబ్రియముతో రాముఁ డా రాజసభయును నా రాజు నడల నా తల్లిచే నున్న యవి పుచ్చుకొనుచు భాతిగా మున్నున్నపటములు విడిచి యారంగ ధరియించె. నట లక్ష్మణుండు వారక యా రామువలెనె ధరించె. సీతకు నా నారచీరలు రెండు చేతి కిచ్చినఁగొని చిత్తంబులోనఁ గలఁగి రామునిఁజూచి: “కాంతారవాసు లెలమిమై నీ చీరలెట్లు కట్టుదురొ? మును.”లంచు నొక్కటి మూపుపై వైచి తనరార నొక్కటి దనకేలఁ దాల్చి కట్టనేరకయున్నఁగని రాముఁడతివ యట్టిచందముఁగాంచి యా పూవుఁబోఁడి ఘననితంబునఁబొంకము మీఱఁగట్టఁ గని రాజసతులు రాఘవుని వీక్షించి “నారచీరలు గట్టి నరనాథపుత్త్ర! యీ రాజవరపుత్త్రి నీ సీత నిట్లు దారుణగతి మీఱ తాపసిఁబోలె ఘోరాటవికి నీవు గొనిపోవ224 వలదు. మా మాట మన్నించి మా యొద్దనునిచి సౌమిత్రియును నీవుఁ225జనుఁడు కానలకు.’ |