| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
శృంగిబేరం బేలు చిరపుణ్యశాలి గంగాతటమున రాఘవుఁడుండుటెఱిఁగి చనుదెంచి రామలక్ష్మణులకు మ్రొక్కి కనకాంబరాదులు కానుకలిచ్చి యచ్చెరువగురామునాకృతిఁజూచి యిచ్చలో వెఱఁగంది:“యిదియేమి దేవ!? నీ వరణ్యములకు272నిఖిలంబు విడిచి యీ విధి విచ్చేయు టేమికారణము? నలినాప్తకులనాథ!నా యట్టిబంటు గలుగ నీ273వేషంబు 274గలిగెనే నీకుఁ. 275జెనసి 276నీ కింత సేసిన నీచమతుల ననిఁబట్టి చంపెద.”ననిన రాఘవుఁడు నతని సద్భక్తికి నతని శక్తికిని నతని ధీరోక్తుల 277కాత్మలో మెచ్చి యతనిఁగౌఁగిటఁజేర్చి యాదరంబెసగ నతనితోఁదనదు వృత్తాంతంబు దెలుప నంతయు విని గుహుండాత్మలోఁబెద్ద చింతించి కైకేయి చేఁతకు వగచి దశరథునేరమిఁ దలపోసి 278రోసి దశరథాత్మజుల దుర్దశకు శోకింప రాముఁడప్పుడు దయారసమగ్నుఁడగుచు సౌమిత్రియును దాను సముచితఫణితి గుహుశోకముడుప నర్కుఁడుగ్రుంకుటయును విహితసంధ్యాకాలవిధు లొప్పఁదీర్చి గంగోదకముల నాఁకలి దీర్చి సూత శృంగిబేరాధిపుల్ సేరి సేవింప ధరణీతనూజయుఁదాను రాఘవుఁడు ధరణిపైఁదృణశయ్యఁదగ విశ్రమింప శరచాపహస్తుఁడై సౌమిత్రి యంతఁ గరమొప్పఁదమయన్నఁగాతు నన్‌బుద్ధిఁ బదునాలుగేండ్లును బగలును రేయు నిదుర వోవకయుండ నియమంబుసేసి తమయన్న సెజ్జకు దవ్వుల నిలిచి యమలమానసుఁ279డునై యటు గొల్చియుండి సుకుమారతారుణ్య 280శోభనాకృతులు ప్రకటితధైర్యసంపన్నులైయున్న[వా.రా. సర్గ 51-53] యా రామసీత లత్యంతదుఃఖములఁ గూరెడు281తెఱఁగెల్ల గుహునకుఁ282జెప్పి యడరి కౌసల్యయు నా సుమిత్రయును బడియెడుపాటులు పలుమాఱుఁజెప్పి సొరిది నిద్దఱు283ఁగూడి శోకించుచుండ నరుణోదయంబయ్యె. నంత రాఘవుఁడు |