| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
288భవభంగ ధవళాంగ భవమౌళిసంగ నవనిజ యా గంగ నర్థిఁబ్రార్థింప గుహుఁడు వెట్టినయోడఁగొమరొప్ప నెక్కి యహిమాంశుకులు లంత నట గంగదాటి గుహునిసంభావించి గుహువీడుకొల్పి గుహుఁడుసెప్పినత్రోవ289ఁగొమరొప్పఁబ్రీతి. ముందఱఁ గూర్మితమ్ముఁడు వెన్కఁదాను సుందరి నడుచక్కిఁజూపట్టఁగదలి చనిచని మూఁడుయోజనములు 290గడచి చని291సుదర్శన మనుసరసి నాఁడుండి యా రాత్రి భూపుత్త్రి యతిమృదుగాత్రి కారడవిని నొంటిగా శయనించి యున్నచందంబుఁ,దానున్న చందంబుఁ, గన్నతల్లులకైన కడిఁదిశోకంబుఁ గైకేయికోర్కులు గడముట్టుటయును, భూకాంతుసత్యంబు, భూపుత్త్రివగపుఁ, గన్నీరు దొరుగ రాఘవుఁడు లక్ష్మణున కన్నియుఁజెప్పఁగా నట వేగెఁబ్రొద్దు. మనువంశతిలకంబు మఱునాఁడు గదలి మునుమిడి యోజనంబులు మూఁడుగడచి 292యనఘ గంగానది యమునయుఁగూడి 293కన నొప్పు నా ప్రయాగకుఁబోయి యందు మునిలోకనుతుఁడైన మునిభరద్వాజుఁ గని నమస్కారముల్ గావించి తనదు వృత్తాంతమంతయు విన్నవించుటయు; నత్తపోధనముఖ్యుఁడా రాఘవులను దీవించి రఘురామదేవు294వర్తనము భావించి యచ్చెరుపడి తత్త్వమెఱిఁగి కందమూలఫలాదికంబుల వారిఁ బొందుగా సంతుష్టిఁబొందించి ప్రేమ నమ్ముని పూజింప నా రాత్రియందు నెమ్మి దీపింపంగ నిల్చి మర్నాఁడు ఘననిష్ఠ సంధ్యాదికర్మముల్ దీర్చి మునులయాశీర్వాదములు సాలఁబడసి యరుదైనచిత్రకూటాద్రికిఁదెరువు వరపుణ్యుఁడగు భరద్వాజుచే నెఱిఁగి[వా.రా. సర్గ 55, 56] యరుగుచో రాముఁడయ్యడవులనడుమ 295నురుచాపరవమున కులుకుచుఁబాఱు మృగములఁజూపుచు మేదినీసుతకు నగవుఁబుట్టించుచు నడతెంచునెడల నలసి296డస్సినచోట నవనీతనూజ నిలిచినచోటను నిలిచి తోడ్కొనుచుఁ గరమర్థిఁ297జనిచని కాళింది దాటి వరపుణ్యులట సిద్ధవటము నీక్షించి 298యా రాత్రి యందుండి యమ్మఱునాఁడు ఘోరాటవులు సొచ్చి కుశలమార్గమున వలనొప్పఁజని మాల్యవతి299సుట్టి పాఱి, యలఘుసంయములకు నాటపట్టగుచు సలలితతరులతా సానుకూటములు సెలువు దీపించిన చిత్రకూటాద్రిఁ |