ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
శ్రీరామాదులు చిత్రకూటమునఁ బర్ణశాలలో నుండుట
గని యెక్కి యందున్న ఘనమునీశ్వరులఁ
గని మ్రొక్కి300ప్రీతి సత్కారముల్‌ వడసి
యమ్మునీంద్రులచేత ననుమతిఁజెంది
తమ్ముఁడుఁదాను నత్తఱి మహీజముల
కొమ్మలు రెమ్మలు గొట్టి వింతగను
సమ్మదమ్మునఁబర్ణశాలఁగావించి
కృష్ణసారముఁజంపి గృహశాంతిహోమ
ముష్ణాంశుకులుఁడు శాస్త్రోక్తిమైఁజేసి
యందుఁబ్రవేశించి యా పర్ణశాల
చందంబు మెచ్చుచు సాధ్వియుఁదాను
మునులసేవించుచు మునులెల్లఁబొగడ
301మునిచరిత్రంబుల మోదించు చుం302

  1. మిగుల
  2. ననుపమ వైఖానసాచార నియతి- తనరార నిష్ఠతోఁదద్దయు నొప్పి - ముని…
  3. డె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )