| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
శ్రీ కామినీనాధు జితదైత్యయూధు లోకరక్షణకృత్యు లోకైకనిత్యు నిత్యచిదానంద నిర్వాణకృత్యుఁ గృత్యవిదూరు నకృత్రిమాధారు నాధారకమలమధ్యామోదభేద సాధనక్రమసమాచరణషట్చరణు1 సింధురవరదు నాశ్రితలోకబంధు బంధమోచను బలిబంధనోదగ్రు 2నారూఢ పంచాశదక్షరప్రసవ పారిజాతాకారుఁబ్రణవానుకారు నగ్రామ్య గోపికాభ్యంతరవ్యగ్రు నగ్రేసరాకారు నాకారరహితు యోగిమానస లసదోంకార 3దీప్త యోగసందర్శనాభ్యుదయప్రచారు శ్రుతిశిరోభాగ విశుద్ధచైతన్యు నతిలోకు సర్వలోకాశ్రయశ్లోకు నఖిలాండమౌక్తికాయతనిత్యసూత్రు నఖిలతత్త్వాతీతు నాద్యంతరహితు నమలాత్ము నక్షరు నామ్నాయకమల కమలాప్తు నక్షీణకల్యాణసదను శంకావినిర్ముక్తసద్భక్తవర్య కైంకర్యవత్సలుఁగారుణ్యశీలు బోధకుండై వచ్చి బోధ్యుఁడై తోచి బోధమై దీపించు పూర్ణస్వరూపు నాది తత్త్వముఁ ‘దత్త్వమ’ స్యాదివాక్య 4భేదాతిరూపు నభే 5ద్యప్రతాపుఁ గడుకొని నియతులై కర్మబంధములు గడచి యేకతమునఁగదలక నిలిచి యరుదార నింద్రియ 6వ్యాప్తుల నణఁచి పరిచితాసనములఁ బదిలులై 7యుండి వెలయు డెబ్బదిరెండువేల నాళములు గలయ 8నాలోకించి కసటువోఁదుడిచి కవరెండు 9ద్రోవలఁగైకొని 10మేఁగు పవనుని 11రోధించి పశ్చిమవీథిఁ జొనిపి 12కోణత్రయశుద్ధి గావించి 13మనసుతోడనె కూడ14మరగించి తెచ్చి కుండలి నిజశక్తిఁగూర్చి సంప్రీతి నొండొండ కమలంబులొగి నాఱుఁగడచి అట చంద్రమండలి 15యవ్వలఁబేర్చి యట పరమవ్యోమమై తమ్ము మఱచు పరమయోగీంద్రులభావంబుకీలు పరికింపఁ దానయౌబ్రహ్మస్వరూపు మొగిరెంటఁ బొరయక మూఁట నేర్పడక 16తగ నాలుగింటను దావు గైకోక యైదింట 17నెయిదిపై నాఱింటఁ గడచి యాదికి నాదియై యమరినదేవుఁ దనుతరనిర్మలాంతర్నాడి యూప, మనురూపమగు మనం బా బద్ధపశువు, నిష్ఠాభిరతి వేది, నిఖిలేంద్రియములు గాష్ఠముల్, బోధ మఖండపావకుఁడు, యోగామృతముఘృత, ముజ్జ్వలానంద యోగంబు ఫలము, గానొగిఁ 18జెల్లుచున్న యభిమతాంతర్యజనానూనకర్మ విభవంబు కడపట విలసిల్లు పరముఁ బరమాత్ము నవ్యయుఁబరమకల్యాణుఁ బరపక్షు నపరోక్షుఁ బ్రక్షీణకర్ము మా దేవుఁగమలాక్షు మమ్మేలువేల్పు నాదినారాయణు నఖిలలోకేశు భావించి కీర్తించి ప్రార్థించి మ్రొక్కి సేవించి యభిమతసిద్ధిఁ 19బాటించి, హారకర్పూర నీహార గోక్షీర తారకాకృతి శారదాదేవిఁ గొలిచి, చారురామాయణచంద్రాబ్ధి 20యగుచు వారక విలసిల్లు వాల్మీకిఁదెలిచి, భారతమంజరీపారిజాతంబు సారమానసుఁ బరాశరసూనుఁదలఁచి యతని తనూభవు నా శుకయోగి నతిభక్తియుక్తిమై నభినుతి సేసి, యే కథ సెప్పిన నెల్లసజ్జనులు 21సేకొని కీర్తనల్ సేయుచునుందు? రే కథ సెప్పిన నిహపరోన్నతులు ప్రాకటంబుగఁబేర్చి ఫలియించు 22నుర్వి? నే కథ సెప్పిన నీప్సితార్థములు గైకొని పుణ్యముల్ 23గడఁగి 24కావించు? ననువిచారములు నా యంతరంగమునఁ గొనకొని కృతిసేయఁగోరుచున్నంత: 25శ్రీరమణీయమౌసృష్టి నుత్తములు గోరి వర్ణనసేయు గోనవంశమున ఫలిత సదాచార భానుఁడై పొడమి కలికాల దోషాంధకారంబు దోలి గురుబుధ 26పదములకొలఁదులు దెలిసి 27పరరాజనక్షత్రపంక్తుల నణఁచి నిత్యపుణ్యోదయ నియతిఁబెంపొందు నత్యున్నతప్రతాపాభిరామునకుఁ గర 28దీప్తనిజఖడ్గగంగాంబుధారఁ బరధరణీపాలఫాలాక్షరములఁ గలపూర్వగర్వపంకము లొప్పఁగడుగు నలవుమై 29నసహాయుఁడగు శౌర్యనిధికి శరణార్థి రాజన్యషట్పదాధార కరపద్మునకు గోన కాటభూపతికి నయనయోదయ దయాయతనిత్యమతికిఁ బ్రియతనూజన్ముఁడై పృథివిఁ బెంపొందు రుద్రప్రతాపుండు రుద్రనిర్మలుఁడు రుద్రాత్ముఁడగు గోన రుద్రనరేంద్రు పౌత్రుఁడభంగుఁ డప్రతిమవర్తనుఁడు గోత్రధీరుఁడు కులగోత్రవర్ధనుఁడు దివిజేంద్రవిభవుండు 30ధీరసన్నుతుఁడు భువనవిఖ్యాతుఁడౌ బుద్ధభూవిభుని తనుజన్ముఁ డక్షీణదాక్షిణ్య 31ధనుఁడు ధనధాన్యధనదుండు ధర్మధర్మజుఁడు 32అతిపుణ్యసౌజన్యుఁ డరిభీమజన్యుఁ డతిశౌర్యశరజన్ముఁ డా జన్మశుభుఁడు కామినీకాముఁ డఖండవిక్రముఁడు రామత్రయోదార రణవిశారదుఁడు చందనమందార చంద్రికాహీర కందళకుందేందు ఘనకీర్తిధనుఁడు పరగు గోనాన్వయపారిజాతమునఁ బరిపక్వఫలభాతిఁ బరగినవాఁడు పొలుచు గోనాన్వయపూర్వాద్రియందు వెలయు భానుఁడువోలె విలసిల్లువాఁడు దొరయు గోనాన్వయదుగ్ధాంబురాశిఁ బరిపూర్ణచంద్రుఁడై భాసిల్లువాఁడు నిక్కి యంతంతకు నిర్మలుండగుచు దిక్కులఁ దన పేర్మి దీపించువాఁడు దానధర్మక్రియా తాత్పర్యకేళిఁ దానయై వినుతులఁ దనరారువాఁడు మగఁటిమి నసమానమహిమ దీపింపఁ బగతుఱ ననిలోన భంజించువాఁడు బలవదుగ్రారాతి బలపయోరాశిఁ గలఁచుచో మంథాద్రిగతిఁబేర్చువాఁడు విమతోగ్రరాజన్య 33విపులాంధకార కమలాప్తబింబఖడ్గప్రభావిభవ విలసితామర వధూవిమలాస్యకమల ముల వీరమధుకరంబులఁ గూర్చువాఁడు అరినృపప్రాణానిలాహారభుజగ వరభుజస్థాపితావని నేలువాఁడు కురు 34కుంతళావంతి గూర్జర ద్రవిళ నరనాథసభల వర్ణన కెక్కువాఁడు ఆతతసామభేదాదుల నొప్పు నీతిక్రమంబున నెగడెడువాఁడు రమణమై నాదిమ రాజన్యరీతి నమితవైభవముల నలరెడువాఁడు వినయ 35నయోదయవిభవసుస్థిరుఁడు మనుమూర్తి విట్ఠలక్ష్మాపాలవిభుఁడు రాజసర్వజ్ఞుండు రాజసింహుండు రాజశిరోమణి రాజపూజితుఁడు సకలజగద్ధితచాతుర్యధుర్యుఁ డొకనాఁడు గొలువున 36నున్నతోన్నతిని బహుపురాణజ్ఞులు బహుశాస్త్రవిదులు బహుకావ్యనాటక ప్రౌఢమానసులు హితులు మంత్రులు పురోహితులు నాశ్రితులు సుతులు రాజులు బహుశ్రుతులునుగొల్వ దీపించు భూలోకదేవేంద్రు పగిది 37నేపారియున్నచో నింపు వుట్టించి రసికులు భారతరామాయణాది రసగోష్ఠి 38ప్రకటింప రసికశేఖరుఁడు రామకథాసుధా 39రసరక్తుఁడగుచు నా మహాసభలోన నందఱఁజూచి “రమణమైఁదెనుఁగున రామాయణంబు క్రమమొప్పఁ 40జెప్పెడు ఘనకావ్యశక్తి గల కవులెవ్వరుగలరుర్వి” 41ననినఁ దలపోసి విట్ఠలధరణిపాలునకు నున్నతమూర్తికి నురుయశోనిధికి విన్నవించిరి వ్రీతి విబుధపుంగవులు “నీ తనూజన్ముండు నిపుణమానసుఁడు ధూతకల్మషుఁడు బంధుర 42నీతిధనుఁడు సర్వజ్ఞుఁడనఘుండు చతుర 43వర్తనుఁడు సర్వ 44పురాణ విచారతత్పరుఁడు కమనీయబహుకళాగమవిచక్షణుఁడు సుమనీషిపోషణోత్సుక సుఖోన్నతుఁడు కవిసార్వభౌముండు కవికల్పతరువు కవి 45లోకభోజుండు కవిపురందరుఁడు ప్రత్యర్థి రాజన్యబలవజ్రపాణి ప్రత్యర్థినృపదావపావకోజ్జ్వలుఁడు భీకర నిజఖడ్గ బింబిత స్వర్గ లోకానురక్తారి లోకదుర్దముఁడు సరసార్థిజలజాత జలజాతహితుఁడు పురుషచింతామణి 46బుద్ధయాహ్వయుఁడు నీ కతిభక్తుండు నిఖిలశబ్దార్థ పాకజ్ఞుఁడత్యంత పాండిత్యఘనుఁడు మఱియు రామాయణమర్మమాతండ యెఱుఁగు నాతనిఁబంపు47మీ కథఁజెప్ప” ననిన మజ్జనకుఁ48డుదాత్తవర్తనుఁడు నను నర్థిఁబిలిపించి నను గారవించి “భూమిఁగవీంద్రులు బుధులును మెచ్చ రామాయణంబు పురాణమార్గమునఁ దప్పక నా పేరఁదగ నంధ్రభాషఁ జెప్పి ప్రఖ్యాతంబు సేయింపు ముర్వి” నని యానతిచ్చిన నా మృదూక్తులకు ననయంబు హర్షించి యట్ల కావింపఁ బనిపూని యరిగండభైరవుపేర ఘనుపేర మీసరగండనిపేర లలితనిర్మలగుణాలంకారు పేర నలఘు నిశ్చలదయాయతబుద్ధిపేర నాతతకృతిపేర నతిపుణ్యుపేర మా తండ్రి విట్ఠలక్ష్మాపాలుపేర రాజులు బుధులును రసికులు సుకవి రాజులు 49సుఖగోష్ఠి రాజిల్లి పొగడఁ బదము లర్థంబులు భావముల్ గతులు పదశయ్య లర్థసౌభాగ్యముల్ 50యతులు రసములు గుంభనల్ 51ప్రాససంగతులు నసమాన 52రీతుల నన్నియుఁగలుగ నాదికవీశ్వరుఁడైన వాల్మీకి యాదరంబునఁ 53బుణ్యులందఱు మెచ్చఁ జెప్పిన 54తెఱఁగున శ్రీరాముచరిత మొప్పఁ జెప్పెదఁగథాభ్యుదయ మెట్లనిన: |