ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
అమృతమథన కథ
“నే రాజు వాలించు నీ రాజధాని
నా రాజునెఱిఁగింపు మనఘాత్మ! నాకు.”
ననుడు విశ్వామిత్రుఁడా రాముఁజూచి:
“వినుమింద్రు కడమున్ను విన్నాఁడ నేను:
ప్రథమయుగంబున బల్లిదుల్‌ దితికిఁ
గథితోరువిక్రముల్‌ గలరు నందనులు;
అదితికి ధర్మాత్ములగుచున్న తనయు
లుదయించి యమరత్వ మొందఁజింతించి
యోలి రసంబులు నోషధుల్‌ నించి
పాలసముద్రంబు బలువిడిఁ ద్రచ్చి
యా పయోనిధిఁ బుట్టినట్టి సారములు
రూపింప నమరత్వరుచిరకాంతులును
కడునొప్ప నిమ్ములఁ గైకొందమనుచుఁ
438గడఁక మందరగిరిఁ గవ్వంబు సేసి
వాసుకిఁద్రాడుగా వడిఁ 439జుట్టి తరువ
నా సమయంబున నా సముద్రమున
440వంచన మన్మథవార్ధి లోకముల
ముంచియెత్తగఁజాలుమురిపంబులమరఁ
గాంచీఝణత్కార ఘననితంబములు
నించుక 441నడుములు నిఱియుచన్గవలుఁ
గోమల భ్రూలతా కోదండుఁడైన
కామునివిలువిద్యగతిఁ జూడ నొప్పు
కడకంటిచూపులుఁ గక్షదీధితులు
వెడలించు భుజలతా విక్షేపణములు
442నమర నూతనయౌవనాభిరామముల
నమరు నర్వదికోట్లయప్సరస్‌ స్త్రీలు
నొగిఁబుట్ట, మఱియు నయ్యుత్పలాక్షులకు
నగవులు మురిపెంపునటనలు గలుగు
పరిచారికలు నందె ప్రభవించి రెలమి
నరుదార లెక్కింప నలవిగాకుండ;
లీల నయ్యచ్చర లేమలనెల్ల
నోలి దేవతలు దైత్యులును గైకొనిరి;
వారు సాధారణ వనితలై రపుడు;
వారక మదిలోన వరుణతనూజ
వరుని నపేక్షింప వారుణిఁజూచి
వరియింపనొల్లనివారు గావునను
దితి సుతులసురాభిధేయులై; రదితి
సుతులు వరించుట సురనాములైరి;
అంత నుచ్చైశ్శ్రవ మనుతురంగమముఁ,
గాంతిమించిన మణికౌస్తుభాఖ్యమును,
నమృతంబుఁబుట్టెను; నమృతంబువెనుక
నమరుసుధాపూర్ణమగు కమండలము
443వెలుఁగ ధన్వంతరి 444వేడ్కతోఁ బుట్టె;
వెలయంగ మఱిపుట్టె విషముగ్రమగుచుఁ
బరుషరోషానల 445భావమై యున్న
హరుఁడదియును మ్రింగె నద్భుతంబుగను.
అంత సురాసురు లమృతంబు కొఱకు
నెంతయుఁదమలోన నేచి దర్పమున
ననుపమస్థితిఁబోర, నసురుల సురలఁ
గనుఁగొని సురలపైఁగరుణించి యపుడు
మానిని రూపమై మధుమర్దనుండు
తా నమృతముఁబంచి తగనిచ్చె సురల;
కరయ నా దితిసూనులడ్డమేతెంచి
సురలచేఁజచ్చిరి; సురపతి యంత
నరినాశమొనరించి యధికతేజమున
సరసిజాక్షుని కృప సంపదల్‌ గలిగి
సకలలోకంబులు సంతోషమంద
సకలంకముగ రాజ్యమనుభవింపఁగను;
సుతులీల్గుటయు దితి శోకంబు నొంది
పతి కశ్యపునిఁజూచి పలికె దైన్యమున:[వా.రా. సర్గ 46]

  1. ↑గడఁగి
  2. ↑జేసి
  3. ↑పంచిన
  4. ↑కౌనులు నిఱి చన్నుగవలు
  5. ↑కమనీయభూషణ కాంతి ధామములు
  6. ↑కలిగి… కరమొప్ప
  7. ↑వెలయంగ
  8. ↑భావంబు (భయదంబు)లైన - యురగముల్‌ ధ(వ)రియించె నోలి నవ్విషము - నంత
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )