ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
సగర వృత్తాంతము
ననినఁగౌశికుఁజూచి339 యా రాముఁడనియె:
మునినాథ! మా వంశమున వారి కథలు[వా.రా. సర్గ 39]
విన 340వేడుకయ్యెడు వివరింపు మాకు.”
ననినఁవిశ్వామిత్రుఁడనియె రామునకు:
“విడువక హిమశైలవింధ్యశైలముల
నడుమ నా సగరుజన్నంబు వర్తింప
యాగంబుచేరువ నంశుమంతుండు
రాగిల్లి యశ్వంబు రక్షించుచుండ
ననిమిషపతి దైత్యుఁడై మ్రుచ్చిలించి
కొనిపోయి పాతాళకుహరంబు సొచ్చి
కపిలసంయమివెన్కఁ గడఁకతోఁగట్టి
యపరిమితానందుఁడై యేఁగె దివికి.
భూపాలుఁడశ్వంబుఁ బొడఁగాన 341కిచ్చఁ
గోపించి మండుచుఁగొడుకులఁబిలిచి:
“యిట గాన మశ్వంబు; నెవ్వఁడోకాని
కుటిలుఁడై మ్రుచ్చిలి కొనిపోయినాఁడు.
మూఁడులోకంబులు మునుమిడి వెదకి
వాఁడెవ్వఁడైనను వాని 342వధించి
తెండు గుఱ్ఱము 343నిట తెగువమై; 344మీరు
పొం.”డన్న సగరులు భుజశక్తిమెఱసి
నెఱసి బ్రహ్మాండంబు నిండ గర్జించి
యఱువదివేవురు నాప్రొద్దె కదలి
యానాక 345లోకంబు నవనియు వెదకి
కానక ధరణి వ్రక్కలు సేయఁగడఁగి
“యొక్కొక్కఁడొక్కొక్క యోజనంబుర్వి
నక్కజంబుగఁద్రవ్వుఁ”డని 346యేరుపఱచి
“పరువడిఁబూర్వదిగ్భాగంబుఁ347దొడఁగి
ధరఁబ్రదక్షిణముగాఁద్రవ్వుద”మనుచుఁ.
బొరిఁ348బొరిఁగుద్దాలభూరిశూలములు
ధర రసాతలము349 నందాఁకఁ ద్రవ్వుచును
బాతాళవాసులఁబ్రకటసత్త్వముల
భూతసంతతులఁజంపుచుఁ జెలంగుచును
వెస నప్పుడఱువదివేల యోజనము
లసమునఁద్రవ్వి రా యసమానబలులు.
భూరిసత్త్వమున జంబూద్వీప మిట్లు
వారిక తిరిగిరా వడిఁద్రవ్వు టెఱిఁగి
యమరగంధర్వసిద్ధాదులు బెదరి
కమల 350సంభవుఁడున్న కడకుఁ దా రేఁగి:
“వనపర్వతద్వీపవతియైన భూమి
351చనఁద్రవ్వుచున్నారు సగరనందనులు;
బలువడి సత్త్వసంపన్నంబులైన
జలచరంబులఁబట్టి చంపుచు మఱియు
‘వీఁడు యజ్ఞమునకు విఘ్నంబు 352సేసె;
‘వీఁడశ్వహరుఁ;’డంచు353వీఁడువాఁడనక
354బలియులై తమదృష్టిఁ బడువారినెల్ల
జలజసంభవ! 355పట్టి చంపుచున్నారు;
తలఁచి నీ విది సమాధానంబుసేయ356వలయు
357నన్నను బ్రహ్మవారితోననియెఁ:[వా.రా. సర్గ 40]
“గపిలమునీంద్రుఁడై కైకొన్నవాఁడు
తపము నవ్యయుఁడైన దామోదరుండు;
అమ్మునికోపాగ్ని యందంద వారిఁ
గ్రమ్మిన భస్మంబు గాఁగలవార.”
లని పల్క సురలెల్ల “నౌఁగాక” యనుచుఁ
జని. రంత నక్కడ సగరనందనులు
పిడుగులఁ బోలెడి భీకరధ్వనులు
కెడమ్రోయ నిలఁబ్రదక్షిణముగాఁగలయఁ
జుట్టును ద్రవ్వి యెచ్చోట ఘోటకము
పట్టుగానక తండ్రిపాలి కేతెంచి:
“యశ్వంబుఁబొడగాన; మఖిలంబు వెదకి
యశ్వచోరకుఁగానమైతి 358మెక్కడను;
నే మేమిసేయుదు మిటమీఁద?” ననిన
భూమీశుఁడలిగి యా పుత్త్రుల కనియె:
“విశ్వంబు 359గలయంగ వెదకి నా యెదుటి
కశ్వంబుఁదేక మీ రరుదేర వలవ.”
దని పల్క “నౌఁగాక”యనుచు నా సగర
తనయు లుద్ధతి రసాతలమున కరిగి360
దొరకొని యందఱుఁదూర్పుదిక్కెల్ల
నరసి గుఱ్ఱముఁగాన కచ్చోట సకల
ధారుణీమండలోద్ధరణముకుంద
చారుభుజాదండసమదంతకాండ
చతురగ్రముల ధరాచక్రంబు మోవఁ
జతురతగల శుభ్రసామజేంద్రంబు,
కమలాప్తవంశసాగరసుధాకిరణ!
కమలజనిభనేత్ర! కాకుత్స్థతిలక!
పరువడి నొక మహాపర్వకాలమున
ధరణిభారంబు నెంతయు సహింపమికి
నెలమి శిరఃకంప మెద్ది గావింపఁ
దలకొన నందంద ధరణి గంపించు
నా కుంజరము విరూపాక్ష మన్‌దానిఁ
బాకశాసను దిశాభాగంబునందుఁ
బొడఁగాంచి 361వలగొని పూజించి యచటఁ
దడయక మఱి బృహద్భానుదిక్కునకుఁ
బోయి నానా విధంబుల నందు వెదకి
యా యశ్వరత్నంబు నరయఁజొప్పడక
సతతదానచ్ఛటా సమ్మదామోద
భృతశిలీముఖపుండరీకాఖ్యగజముఁ
362గనుఁగొని పూజించి కడువేడ్కతోడ
వినుతించి యవ్వల వెదకుచు యామ్య
భాగంబునకు నేఁగి పరికించి హయము
లా గొకయింతయు లక్షింపలేక
ఘనతరత్వము ద్రివిక్రము నాక్రమించు
నన మించువామనంబనుదంతిఁ గాంచి
యర్చించి యవ్వలి కరిగి నైరృతిని
జర్చించి యందు నశ్వముఁ గానలేక
కుముదమార్దవమునఁగుముదవర్ణమునఁ
గుముదంబునా 363నొప్పు కుంజరేంద్రంబుఁ
గని నమస్కారంబు గావించి యవలఁ
జనిచని పశ్చిమాశాప్రదేశమున
శోధించి తురగంబుచొప్పింతయైన
సాధింపలేక యంజనశైల మనఁగ
రంజితమదనిర్జరంబులు గలిగి
యంజనంబను గజంబచ్చోటఁగాంచి
వివిధసత్కృతులు గావించి యా మీఁదఁ
బవమానుదెస కేఁగి బహువిధంబులను
నెమకి యశ్వముఁగాననేరక యచట
నముచి 364హరప్రహణప్రతిమాన
దంత మయ్యును బుష్పదంతాఖ్యఁబరగు
దంతి నీక్షించి మోదమునఁబూజించి
యటవాసి చని కుబేరాశాంతరమునఁ
దటుకున నరసి సైంధవముఁగానంగ
లేక యచ్చట నొక్కలేఖాధినాథ
లోకగజాధిక 365లోకైక సార్వ
366భౌమమో యన సార్వభౌమాభిధాన
సామజేంద్రముఁగాంచి సద్భక్తిఁగొలిచి
సార్వభౌమునిపుత్త్రసంఘంబు గదలి
శర్వునిదెస కేఁగు సమయంబునందు
ననతిదూరమున హుతాగ్నినిబోలి
కనుఁగవ మోడ్చి యేకతమ కూర్చుండి
తన నిష్ఠపెంపునఁ దప మాచరించు
ననఘాత్ముఁ గపిలమహామునిఁగాంచి
యతని 367చెంగటనున్న హయము నీక్షించి368
యతని భర్జించిన నతఁడుగ్రదృష్టి
నఱిముఱి సగరుల నలిగి చూచుటయు
నఱువదివేవురు నట భస్మమైరి.
కొడుకులు నశ్వంబుఁగొనిరాక చాలఁ
దడసిన 369గురుఁడు సంతాపంబు నొంది[వా.రా. సర్గ 41]
మనుమని నయ్యంశుమంతుఁబంచుటయుఁ
జని యంశుమంతుఁడా జాడనే పోయి
యమరేంద్రుదెస విరూపాక్షంబుఁ గాంచి
370కొమరు మీఱఁగవలగొని వచ్చిమ్రొక్కి
“మాతంగపుంగవ! 371మా తండ్రు లిచట
కేతెంచి; రెటువోయి? రెందున్నవారొ?
తురగచోరకుఁడెందుఁ దూఱినవాఁడొ?
వరుస నీ వెఱిఁగింపవలయు నా.”కనిన
నా దిగ్గజాధీశుఁడా యంశుమంతు
నాదరంబునఁజూచి యతనితో ననియెఁ:
“బ్రియ 372మార 373నొక్కెడఁబృథివీశతనయ
హయముఁగాంచెద.”వన్న “నౌఁగాక” యనుచు
నున్న 374దిక్కరులను నొగినేఁగివాని
నన్నిటి నిబ్భంగి నడుగంగ నవియుఁ
బరువడి 375నా పల్కె పల్కంగ వినుచు
376నరిగి యా ముందర నధ్వరాశ్వంబు
నరయుచుఁగపిలసంయమి 377వరుఁగాంచి
సరిప్రోవు 378లైయున్న సగరభస్మములు
గని చాల శోకించి కడఁగి తండ్రులకుఁ
బొనరఁ దిలోదకంబులు వోయఁ379దలఁచి
యుదకంబు గానకయున్న నయ్యెడకు
సదయుఁడై గరుడుండు సనుదెంచి పలికెఁ:
“గపిలుని నలుకమైఁగలఁచి యమ్మౌని
కుపితాగ్ని సగరులు గూలి నీఱైరి.
యిది యేల 380శోకించె? దీశోకమునకు
నిది వేళగా; 381దిప్పుడేర్పడ వినుము:
సరసిజాసనవంద్యచరణారవిందుఁ
డరవిందదళనేత్రుఁ డాదిపూరుషుఁడు
బలిదానవేశ్వరు382 బంధించునప్పు
డలుకఁద్రివిక్రముఁడై నిండఁబెరిగి
యగణితశక్తి రెండడుగులయందు
జగతీతలంబెల్ల సరి నాక్రమించి
జలజాతజలచరశంఖచక్రముల
నలవడవెలయు383మూఁడగు పదాంబుజముఁ
384గడుకొని బ్రహ్మలోకముదాఁకఁజాపఁ
గడువేగమున వచ్చి కమలసంభవుఁడు
తలకొన్నభక్తితోఁదన 385కమండలువు
జలములఁ దత్పాదజలజంబు గడుగఁ
బొగడొందఁ 386దజ్జలంబులు నభోవీథిఁ
దగిలి వర్తించు మందాకిని యనఁగఁ;
గావున నీ వింకఁ గమలసంభవుని
భావించి తప మతిభక్తిఁ గావించి
కడఁకమై నాకాశ 387గంగఁ దోడ్తెచ్చి
తడయక భస్మముల్‌ దడిపినఁగాని
పరలోకసుఖములు పడయరువీరు;
గురుబుద్ధిఁదురగంబుఁగొనియేఁగు”మనినఁ
దురగంబుఁగొనిపోయి తొడరి 388యొండొండ
తరమిడి యాతఁడు దమ తాతతోడఁ
జెప్పిన శోకించి చేయఁ గైకొన్న
యప్పుణ్యమఖము సమాప్తంబు సేసి
389కామించి యాకాశగంగ నీ యుర్వి
కేమెయిఁదెత్తునో యే నంచు నతఁడు
విడువక ముప్పదివేలేండ్లు దపము
పుడమి నెంతయుఁజేసి పోయెను దివికి.
నా రాజుమనుమఁడయ్యంశుమంతుండు
ధారుణి గంగకుఁదప390 మొప్పఁబూని[వా.రా. సర్గ 42]
391వరుస ముప్పదివేల వర్షముల్‌ సలిపి
పరలోకగతుఁడయ్యె 392బదపడి యతఁడు.
393నతనిపుత్త్రుఁడు దిలీపావనీనాథుఁ
డతినిష్ఠతోడ జాహ్నవి394ని దెచ్చుటకు
విడువక ముప్పదివేలేం395డ్లు సలిపి
కడపల నతఁడు రోగములచేఁజచ్చె.
ననఘుఁడాతనిపుత్త్రుఁడగు భగీరథుఁడు
దన రాజ్య396మరయఁబ్రధానుల నునిచి
సారధర్మజ్ఞులు 397సద్గుణోజ్వలులు
శూరులు నగునట్టి సుతులఁగోరియును
ఎల్లపాపంబులు398నిలమీఁద399బాయఁదెల్ల
దెల్లంబుగా గంగఁదెచ్చెద ననుచుఁ
గర400మర్థిఁదపము గోకర్ణాశ్రమమున
నరుదుగాఁబదివేలయబ్దముల్‌ 401సేయ
ననుపమంబగుచున్న యాతపంబునకు
వనజసంభవుఁడంత వరదుఁడై వచ్చి:
“యడుగుము వర.”మన్న నా భగీరథుఁడు
కడుభక్తి బ్రహ్మకుఁ గరములు మొగిచి:
“ధాత! మా తాతలుదగ్రులై వచ్చి
యాతత కపిలకోపాగ్నిచేఁ గాలి
నూఱు 402వేలేండ్లు సన్నుతగతి లేక
యాఱడిపడి భస్మమైయున్నవారు;
కడఁగి యాభస్మంబు గంగోదకములఁ
దడుపక గతిలేదు దయసేయు;”మనుడు:
“హరుఁడొక్కరుఁడుఁదక్క 403నన్యులా గంగ
ధరియింపనేరరు దవిలి యెవ్వరును;
నీవింక హరు404నకు నిష్ఠఁదపంబు
గావించి 405ప్రార్థింపు గంగ ధరింప.”
నని పల్కి మదిలోన నాతఁడర్థించు
తనయుల నిచ్చి యద్ధరణీశుకొఱకుఁ
దనరంగ నా గంగ“ధరకేఁగు.”మనుచు
జనియెఁబద్మజుఁడంతఁజనిభగీరథుఁడు[వా.రా. సర్గ 43]
అంగుష్ఠ మొక్కటి యవనిపై మోపి
యంగజహరునకు నతిఘోరతపము
తలకొని చేయఁబ్రత్యక్షమై శివుఁడు:
తలఁదాల్తుఁదెమ్ము మందాకిని.” ననియె
నంత భగీరథుండర్థిఁ బ్రార్థింప
నంతరిక్షంబునయందుండి గంగ
గగనమండలము నక్షత్రమండలముఁ
బగుల లోకములెల్లఁబ్రబలి మ్రోయుచును
గులపర్వతములతోఁగుంభినితోడ
బలిసి మహాదేవుఁబాతాళమునకుఁ
గొనిపోవు 406కడఁకతో ఘోరమై పర్వి
చనుదెంచుభంగికి జగములు బెదర
వచ్చు నా గంగగర్వ మడంప శివుఁడు
407నిచ్చ జూటముఁబెంప నింతలో గంగ
వచ్చి మహాదేవు వరజూట వీథిఁ
జొచ్చి వెల్వడుత్రోవ సొప్పడకున్న
హరుజటా 408రణ్యంబు నందులఁజిక్కి
తిరుగుడువడుచు వర్తించుచునుండె.
నంత భగీరథుం ‘డతుల ప్రవాహ
మంతయు నిప్పుడెందరిగెనొ?’యనుచు
వెఱఁగంది వెండియు విషకంధరునకుఁ
దఱిగొని యత్యుగ్ర తపమాచరింప
నపరిమితప్రీతి నా భగీరథుని
తపమిచ్చ మెచ్చి కందర్పసంహరుఁడు
లోలతఁ దన మౌళిలోనున్న గంగ
‘భూలోకమున కింకఁబొ.’మ్మని యనుప
వలనొప్పుజూటంబు వాకిలి వెడలి
పొలుపొందఁ బాతాళమున దృష్టి నిలిపి
తన దివ్యదృష్టి మందాకిని కపిలుఁ
గని మునిమహిమకుఁగడు భీతిఁగలఁగి
“తగిలి నిన్నలఁచిన దారుణాత్మకుల
సుగతికిఁబుచ్చ వచ్చుచునున్న దానఁ
గినియకుమా.”యని కే లర్థి మొగిచె
ననఁబద్మకుళంబు లమరఁజూపఱకు;
నడరు నమ్ముని కిన్క కటువోవ వెఱచి
సుడివడుచాడ్పున సుళ్లొప్ప మిగుల;
“మా మీఁదఁజనుదెంచె మలయుచుగంగ
యే మెక్కడికిఁబోదుమిటమీఁద.”ననుచు
బఱతెంచి 409సగరసంభవులపాపములు
మొఱపెట్టుచున్నవి ముక్కంటి కనఁగ
410నోలిఁబంకజముల నుండరాకున్నఁ
దూలి యాకసమునఁదుమ్మెదల్‌ మ్రోయ
భూతాధిపతి జూటముననుండి ధరణి
కేతెంచు గంగకు నెండ 411గాకుండ
గొడుగులు 412వట్టినకొమరున నంచ
లుడువీథిఁ413జనుదెంచియొప్పారుచుండఁ
దొడరి యా సగరుల414దోషోత్కరములు
గడఁకమైఁబోఁద్రోచు415కరములోయనఁగఁ
గమనీయతరములై ఘనతరంగముల
గములంతకంతకుఁగర మొప్పుమిగులఁ
దన వారిలోపలఁ దగ భగీరథున
కనుపమసితకీర్తు లందంద పుట్టి
నెఱసి భూతలమెల్ల నిండ నేతెంచు
416పఱువుననురువులు పరగంగ గంగ
యప్పటికప్పటి కతులఘోషంబు
లుప్పొంగి యుప్పొంగి యుడువీథి నిండి
బ్రహ్మాండభాండముల్‌ పగులఁబెల్లుబ్బి
బ్రహ్మాదిదేవతల్‌ భక్తితోఁబొగడఁ
జనుదెంచి బిందు వన్‌సరసిలోఁజొచ్చి
యెనయఁబ్రవాహంబు లేడయి పాఱె.
ననఘాత్మ! పావని హ్రాదిని నలిని
యనుప్రవాహములు మూఁడరిగెఁదూర్పునకు;
సీత సుచక్షువు సింధువు నాఁగ
భాతిగా మూఁడేఁగెఁ బడుమటిదెసకు;
నడరుచు417నిబ్భంగి నందులో నొకటి
కడఁగి భగీరథక్ష్మాపాలు పిఱుఁద
ఘనతర విశదోదక ప్రవాహంబు
వినువీథి శరదభ్రవిభ్రమం బొలయ
దివికేఁగ మదిలోనఁ దివుఱుభూజనుల
కవిరళ నిశ్శ్రేణు లమరుచందమున
నిలయు నింగియు మ్రోయునెడఁబ్రవాహంబు
గలయ 418నానామాలికా వీచులమర;
“నీ భంగిఁద్రిప్పుదు నెల్లపాపముల
నా భంగిఁజూడుఁడు.”నా సుడులమరఁ
జెలమి దారలతోడఁ జేయఁజన్కరణిఁ
బెలుచ నింగికి నంబుబిందువు లెగయ;
“ధర్మాత్ములగువారి ధర్మకీర్తులకు
నిర్మల 419సారమై నెఱిఁ 420బొల్తు.”ననుచుఁ
గేలి421నన్యాపగాకీర్తుల నవ్వు
లీల డిండీరమాలిక లుల్లసిల్లఁ;
“బెక్కుకన్నులఁజూతుఁబృథివిపెంపెల్ల
మక్కువ.”ననుభంగి మత్స్యముల్‌ వొలయఁ;
జరియించు422మకరాది జలచరావళులు
పొరినొప్ప నేతెంచె భూలోకమునకు.
నంత శతార్కమై యమరుచందమునఁ
గాంతిమద్బహురత్న ఖచితంబులైన
నిజభూషణంబుల నెఱి నింగి వెలుఁగ
గజవిమానాదులు గరమర్థి నెక్కి
యమరగంధర్వసిద్ధాదులు423సూడ
424నమరంగ425నేతెంచి; రజుఁడునేతెంచె.
నటమహానాగంబులా ప్రవాహంబు
చటులవేగముఁజూచి సరి426మ్రొగ్గుటయును
అంతయు నా నిర్జరావళి సూచి
చింతించి జపములు సేసి యాలోన
నా నది 427లోపల నవగాహమంది
యానందమునఁ428బొంది; రాడిరచ్చరలు;
నమరమునీంద్రాదు 429లాత్మ సంతోష
మమరఁగాఁ బువ్వుల నర్చించి రెలమి;
నా పుణ్యనదిలోన నతిపాపరతులు
శాపదగ్ధులు గృతస్నానులై దివికిఁ
జనుచుండ సురలు నచ్చరలు గంధర్వ
దనుజపన్నగ యక్ష దైత్యరాక్షసులు
కిన్నరాదులు నా భగీరథురథము
వెన్నాడి కనుఁగొంచు వేడ్క నేతేరఁ
బెరిగి పర్వతములు భేదించుకొనుచు
నరుగ జహ్నుఁడు430యాగ మా త్రోవఁజేయ
యాగోపకరణంబు లవి 431వెల్లివోయి
యాగవిఘ్నంబైన నమ్మునీశ్వరుఁడు
నింగికి నుప్పొంగి నెఱి నేఁగుదెంచు
గంగ432నాకర్షించి కలుషించి క్రోలె;
ననిమిషుల్‌ మునివరు లా భగీరథుఁడు
వినుతించి జహ్నుని వేఁడినఁ జూచి
యుమిసి యెంగిలిసేయ నొల్లక యతఁడు
రమణమైఁ దన కర్ణరంధ్రంబులందు
వెడలింప నెప్పటివిధమున గంగ
యడరుచు జాహ్నవియనుపేరఁబరగెఁ.
బురుషపురాకృతపుణ్యంబు 433వలన
దొరకొన్న విఘ్నంబుఁద్రోచి యేతెంచు
వెరవున నా రాజు వెనుక నేతెంచి
శరనిధిఁజొచ్చి యా జాహ్నవీదేవి
దిగి రసాతలమునఁ434దిరిగి యందున్న
సగరులభస్మముల్‌ సరినిండఁబాఱె.
నంత నంబుజగర్భుఁ డా భగీరథుని
సంతోషమునఁజూచి:“జననాథ!వినుము:[వా.రా. సర్గ 44]
జలనిధి నెందాఁక సలిలంబులుండుఁ
దలఁప మీ సగరుని తనయు లందాఁక
దివ్యభూషణములు దివ్యాంబరములు
దివ్యమాల్యంబులు దివ్యగంధములు
దివ్యమూర్తులు నొప్పి దివిజలోకమున
దివ్యభోగముల వర్తించుచు నుందు.
రడరంగ నిదిమొద లనఘ! నీ పేర
నడచు భాగీరథీనామ మీ నదికిఁ;
ద్రిపథగ యనఁగ, సరిద్వర యనఁగ
నృప, జాహ్నవి యనంగ నెగడు నీ గంగ
తగఁబితాళ్లకుఁదిలోదకములు435నడపి
జగములన్నిట సత్యసంధుండ వగుము;
అనఘ! మీసగరుండు, నంశుమంతుండు
ఘనుఁడు దిలీపుండుఁ గైకొన్నప్రతిన
నెఱపఁజాలరు; నీవు నెఱపంగఁదివిఱి
తెఱఁగొప్ప నీగంగఁదెచ్చితికాన
436గంగాతరంగ రంగదభంగ తుంగ
మంగళ 437చిరకీర్తిమహితుండ వగుము;
కాకుత్స్థ కులజుల గౌరవశ్రీల
కాకరంబగు తనయావళిఁ గనుము;
లలితధర్మముల మూలస్తంభ మైతి;
పొలుపార నీ వింకఁబుణ్యోదకముల
వెలయఁదీర్థస్నాన విధిసల్పి పుణ్య
ఫలముఁగైకొను”మంచుఁబద్మసంభవుఁడు
తన లోకమునకేఁగెఁ. దదనంతరంబ
తనర నా గంగఁగృతస్నానుఁడగుచు
నఱువదివేవుర కా భగీరథుఁడు
నెఱిఁ దిలోదకములు నిష్ఠతో నిచ్చె.
నా తిలోదకముల నమరులై సగరు
లాతని దీవించి యరిగిరి దివికి.
ననఘుఁడై మఱి యయోధ్యాపురంబునకుఁ
జని భగీరథుఁడు రాజ్యము సేయుచుండెఁ.
గలుషఘ్న మీ యుపాఖ్యానంబు; భక్తి
చెలువారఁజదివినఁ జెప్పఁగా వినిన
నొనరఁబుణ్యముల నాయుష్మంతులగుచు
ధనధాన్య చయములఁదనరుచుండుదురు;
ఎప్పుడు వారల కెల్ల దేవతలు
నొప్పఁబ్రసన్నులై యుండుదు రెలమి;
నమరంగ సిద్ధించు నఖిలకార్యములు;
సమకొను నంచిత స్వర్గభోగములు;
పెనుపార నట వారి పితృగణంబులకు
ననుపమసద్గతు లనిశంబుఁ గలుగు.”
ననిన రాఘవుఁడు గంగావతారంబు
విని కౌశికునిఁజూచి వినుతులు సేసి[వా.రా. సర్గ 45]
“నేఁడు విశ్వామిత్ర! నీచేత వింటిఁ
బోఁడిగా నీ గంగ భూలోకమునకు
వచ్చినవిధమును వారిధి విధము
నచ్చెరువడరంగ.” నని ముదంబంది
యా రాత్రి యందుండి యఖిలలోకముల
నారూఢికెక్కిన యా నదిఁగ్రుంకి
యాహ్నికకృత్యంబులన్నియుఁదీర్చి
జాహ్నవిదాటి విశ్వామిత్రుతోడ
నుత్తరతటమునందున్న సంయములఁ
జిత్తంబు లలరఁ బూజించి వీడ్కొనుచుఁ
జనిచని యెదుట విశాల యన్‌పురముఁ
గని గాధినందనుఁ గనుఁగొని పలికె:

  1. యవనీశుఁ
  2. వేడ్కవుట్టెడు వివరించి చెప్పు-మనిన
  3. కాత్మఁ
  4. నిర్జించి, బంధించి
  5. వేగ
  6. ఁగడఁగి, ఁగదలి
  7. మర్త్యంబులంతము
  8. యేర్పఱించి
  9. దొడరి
  10. గుంతములవడి
  11. దాఁకంగఁ
  12. గర్భునిఁజేరి కడఁకతో మ్రొక్కి…
  13. చనిత్రవ్వు
  14. బొనర్చె
  15. విడువక పట్టి
  16. పరువడి… సరసిజాసన పట్టి
  17. వృథాచంపు
  18. వలవదా యన… వారి కిట్లనియె
  19. నావిని
  20. మేమింక
  21. వలగొని, కలగొని
  22. ఎలమి శిరఃకంప మేది (మలుకఁగా) కావింపఁ- దలకొని యందంద ధరణి గంపించు, నా కుంజరము విరూపాక్షమన్‌దాని- పాకశాసనదిశాభాగంబు నందుఁ, బొడఁగాంచి వలగొని పూజ సేయుచును (గావించి), గడఁకతో యామ్యదిగ్భాగంబుఁ ద్రవ్వి, యచట మహాపద్మమునుదంతిఁ గాంచి - యుచితప్రదక్షిణ మొనరించి మఱియు, దమకించి పడుమరఁ ద్రవ్వి యచ్చోట- సుమనసకరిఁ గాంచి సుప్రదక్షిణము, వచ్చి యందఱు నురవడి నుత్తరంబు- విచ్చలవిడిఁ ద్రవ్వి విపులదేహంబు, భద్రోరుపాండురప్రభ నుల్లసిల్లు- భద్రాఖ్యగల యట్టి భద్రసామజము, నరుదారఁబొడఁగాంచి యా గజంబునకుఁ - గరమర్థితోఁ బ్రదక్షిణముగా వచ్చి, మునుమిడి యీశాన్యమునకు నేతెంచి- యనఘాత్ము…
  23. సంప్రీతిఁబూ
  24. గనిచాలఁబూ
  25. నొక్క
  26. మారణహరణ, హరప్రహరణ
  27. భౌముఁడో
  28. వెన్కనయున్న
  29. యతులగర్వోక్తులై యదరి యొండొరులు, గుఱ్ఱపుదొంగఁగన్గొని యద్దిరయ్య- కొఱ్ఱుమ్రింగినరీతిఁ గొమరొప్ప బిగిసి, మునిమ్రుచ్చు వీఁడె యీ మూలనున్నాఁడు-తునుముఁడు, త్రుంపుడు తోడ్తోడ ననుచుఁ, బ్రతిలేనిగర్వ దుర్వారవాక్యముల- నతని…
  30. సగరుండుఁదాపంబు
  31. సముచితస్థితిఁబ్రదక్షిణముగా వచ్చి(గావించి)
  32. మా పినతండ్రులే
  33. మాఱునొక్కటపృథి
  34. నీజాడ … గాంచెదవేఁగుమననట్లపోయి
  35. దిగ్గజముల నొగిఁగాంచియప్పు-డన్నిటి
  36. నట్లనే, నటువలెఁ బ,తామిట్టు
  37. నరిగిముందట నధ్వరాశ్వంబుఁగాంచి, యురయుచుఁ
  38. పొంతఁగనియె
  39. లైనయా
  40. వెదకి
  41. శోకింప నిటుశోకమంద
  42. దొకటేర్పడ
  43. బంధించి (న)యప్పు
  44. మూఁడవ
  45. గడఁకతో
  46. కమండలము
  47. ది,దు
  48. గంగనుదెచ్చి
  49. యంతయును
  50. (గంగాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత, అకృత్వానిశ్చయం రాజా కాలేన మహతా మహాన్‌; త్రింశద్వర్షసహస్రాణి రాజ్యంకృత్వా దివంగతః. మూ.‘విధ్యుక్తక్రమంబున నయ్యజ్ఞంబు సంపూర్ణంబుసేసి, తన పురంబునకేఁగి సతులుం దాను ననురాగంబున. క. సురుచిర భోగము లందుచుఁ| బొరిఁబొరి జనులెల్లఁ దన్నుఁ బొగడఁగఁ గీర్తుల్‌|| పరగఁగ ముప్పదివేల్‌ వ| త్సరములు రాజ్యంబుచేసి చనియెన్‌ దివికిన్‌’ భా.రా.)
  51. మర్థిఁ
  52. (ద్వాత్రింశచ్చ సహస్రాణి వర్షాణి. మూ.‘ముప్పదిరెండువేలు వత్సరములు… తపంబుసేసి’ (భా.రా.)
  53. బరువడి నతఁడు
  54. (దిలీపస్తు మహాతేజా యజ్ఞైర్భహూభి రిష్టవాన్‌, త్రింశద్వర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్‌. మూ.)
  55. దెత్తుననుచు, దెచ్చుకొఱకు
  56. డ్లతపము
  57. మేల
  58. సద్గుణాన్వితులు
  59. నిట
  60. బాప
  61. మొప్పఁ
  62. సేసె
  63. వేలేండ్లయ్యెనుత, వేలేండ్లునున్నత
  64. నల్పు, నన్యులు
  65. ఁగూర్చి నెమ్మితోఁదపము
  66. ప్రార్థించి గంగదోడ్తెమ్ము
  67. తెఱఁగున
  68. హెచ్చి
  69. జూట మహాటవిఁ
  70. సగరులపాలి పాప(భస్మ)ములు
  71. బలిసి పంకజములపై నుండరాక- తొలఁగి యాకసమున
  72. రాకుండ
  73. ధరియించు, చనుదెంచు
  74. సుడివడి
  75. దోషంబులోలిఁ(లెల్ల)
  76. కరములు వోలె
  77. పఱుసున
  78. నుప్పొంగి నదులలో
  79. నాలోకంబుగా
  80. స్థానమై
  81. బోల్తు, బోలు
  82. క(న) య్యాప
  83. కొమరారు
  84. గొలువ
  85. నమరేంద్రుఁడే తెంచెన
  86. వేడ్కమైనజుఁడు
  87. నడ్డపడిన
  88. గట్లసేయవ,కట్లైనయవరోధ ముడిపి
  89. బాడియాడి
  90. లంత
  91. జన్న
  92. యెల్లఁబోవ
  93. నాలోకించి
  94. లందు
  95. దిన్నెలైయున్న
  96. వోసి
  97. గంగాంబు నిర్మలకమనీయపరమ
  98. సిత
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )