| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
నంతలోఁగనువిచ్చి యమరేంద్రతనయుఁ డింతింతయనరానియింతిశోకంబు నంతకంటెనుమించునంగదువగపు నంతయు నటు సూచి యర్కజుఁజూచి: “పూని రామునిచేత భువనంబు లెఱుఁగ భానుజ! నేఁడు నీ పగసాధ్యమయ్యె క్షితిమీఁద రాజులకృప నమ్మ98వలదు మతి99నమ్మి చెడక యేమఱక వర్తింపు మడరి రామునితోడ నాడినప్రతిన యెడపక కావింపు మిటమీఁద నీవు. పాయక నాతోడ బలిమిఁబోరాడి మాయావి గడిమిమై మడిసిన మెచ్చి పూనినవేడ్కతోఁబురుహూతుఁడిచ్చె మానైన యీ హేమమాలికఁదొల్లి. యిది నీవు ధరియింపు; మీ కపిరాజ్య పదమున కిది నీకుఁబరగుచిహ్నంబు ఈ యంగదునిశోకమింక వారింపు; నాయట్లు గొనియా100డి నను మఱపింపు; మా సుషేణునిపుత్రియైన యీ తార ధీసార; దీని బుద్ధినిఁబ్రవర్తిల్లు; మేను జేసిన తప్పులెల్లను మఱవు; పూని నామెయిఁబ్రాణములు నిల్వ వింకఁ గైకొను మీ మాలికారత్న.” మనుచు శోకానతగ్రీవు సుగ్రీవుఁబిలువ నతఁడును రఘురామునానతి వడసి యతిభక్తిఁదాల్చె నా హైమదామంబు ననువొప్ప మఱి వాలి యంగదుఁజూచి తన మదిలో నతిదయ దోపఁబలికె: “నో కుమారక! శోకముడుగుము నీవు. శోకింప నేటికి సుగ్రీవుఁడుండ? నలినాప్తసూనుండు నాకంటె నిన్ను లలిఁబెంపుమై నుపలాలింపఁగలడు. సుగ్రీవుఁడెక్కడ శూరతఁజూపె నగ్రణివై యుండు 101మక్కడ నీవు. చిరతరకీర్తులు సిద్ధించు నీకు; నురుతరసౌఖ్యంబులొగిఁబొందు నిన్నుఁ బరగఁగిష్కింధకుఁబట్టంబు గట్టి యరుదుగాఁ జూచు పుణ్యము సేయనైతి. ననిమిషపురమున కరిగెద నింక.” నని పల్కి రఘురాము నర్థితోఁజూచి “యోరామ! యేను బెంపొంద సుగ్రీవు తో రాసి పోరుట తుదిఁబథ్యమయ్యె. నారయ నంగదుఁ డబలుఁ; డేమైన నేరముల్ సేసిన నేర్పుగాఁగొనుమ. యినసుతుతర్వాత నితని రాజుగను మనువంశతిలకుఁడ! మన్నింపవయ్య! వేదశాస్త్రంబుల వెదకి నిన్గాన; రాదిమధ్యాంతంబు లవి నీకు లేవు. చనుదెంచి ప్రాణావసానకాలమున నొనర నా కిట తోచుచున్నాఁడ వీవు. అటుపోయి కనియెడు నామూర్తిఁగంటి. నటుగాన నేను గృతార్థుండ నైతిఁ. బంకజహితవంశ! పరమకల్యాణ! యింకఁబ్రాణములుండ వీయమ్ము వెఱకు.” మనిన రాము102నియాజ్ఞ నా దివ్యశరము పెనుపొంద103నీలుండు పెఱికివైచుటయుఁ గరమొప్పఁదనబాహ్యగతు104లు బంధించి మరలినపవనుతో మనసు సంధించి యీ మెయిఁబరమమై యింపొందు రాము శ్రీమూర్తి మనమునఁజెలువొప్పఁజేర్చి బ్రహ్మపదానందపరుఁడైన వాలి బ్రహ్మరంధ్రంబునఁబ్రాణముల్ విడిచె. నా వేళఁదారాదులైన కామినులు నా వాలిపై వ్రాలి యందంద వగవ, నంగదసుగ్రీవు లచ్చటిప్లవగ పుంగవుల్“హా వాలి! పోయితే!” యంచు విలపించుచుండ నా వేళ సౌమిత్రి నలినాప్తసుతుని నందఱను వారించి: “హనుమంత! నీవింక నంబరమాల్య ఘనగంధసారాదికములు దెప్పింపు.” “శిబిక దెప్పింపుము శీఘ్రంబె తార, నిబిడహాటకరత్న నిర్మితంబుగను.” అని పంప వారును నట్ల కావింప వనచరులందఱు వచ్చి రచ్చటికి. మఱి తారమొదలైన మగువల యడలు తెరఁగొప్ప వారించె దిననాథసుతుఁడు. ఆ లోన రఘురామునానతి వడసి వాలికిఁబరలోకవైదిక క్రియలు సేసి యా దశరాత్ర శేషకృత్యములు భాసురగతిఁదీర్చి పరిశుద్ధిఁబొంది యంగదుఁడును దాను హనుమదాదులును సంగతి నా రామచంద్రుఁగాంచుటయు విపులసంతోషంబు విలసిల్ల 105నంతఁ గపినాయకులకు రాఘవుఁడిట్టులనియె: |