| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
శ్రీరామచంద్రుండు సితకీర్తు లలర ఘోరాజి రాక్షసకోట్ల నిర్జించి మరల నయోధ్యకు మహిమతో వచ్చి చిరలీల రాజ్యంబు సేయుచున్నెడను శుభమూర్తి నమ్మహాశూరు దీవింప నభిలాష జనుదెంచి రఖిలసంయములు నొగి తూర్పుదిక్కుననుండి కౌశికుఁడు తగ యవక్రీతుఁడను తాపసోత్తముఁడు గాలవుండును పేరుగల తపోధనుఁడు నోలి కణ్వుండు గార్గ్యుండును మఱియు దక్షిణంబున నుండి తను మునుల్ గొలువ నక్షీణపుణ్యాత్ముఁడగు నగస్త్యుండు సురుచిరవ్రతుఁడైన సుముఖుండు నియమ పరుఁడైన విముఖుండు పడమటినుండి మథితకల్మషమహామతి త్రిశంకుండుఁ గ్రథనుండు దూర్వుండు ఘనుఁడు లోధ్రకుఁడు ధనదు దిక్కుననుండి తగ భరద్వాజ మునియు విశ్వామిత్రమునివరేణ్యుండు జమదగ్నియును నత్రి సంయమీశ్వరుఁడు నమితతేజుండు కశ్యపుఁడు గౌతముఁడు నిరుపమ మహిమైకనిధి వసిష్ఠుండు కర మర్థి బహుశిష్యగణములు గొలువ నధికతపోధను లధికశాస్త్రజ్ఞు లధికులు వేదవేదాంగపారగులు సప్తార్చిరాదిత్య సమతేజు లట్లు సప్తర్షు లాదిగా సంయమీశ్వరులు వీనుల కింపారు వేదనాదముల మానుగా నేతెంచి మహి నొప్పిరంత సకలసమ్మతిఁ గుంభజన్ముఁ డందఱకు నకలంకమతియుఁ గార్యజ్ఞుండునగుచు నగరివాకిలి జేరి నరనాథచంద్రుఁ దగవొప్ప రఘురాముఁ దర్శింపఁ దలఁచి దౌవారికునిఁ జూచి తరమైన రామ భూవరు నెఱిఁగింపఁ బొమ్ము నీవనిన నతఁడేగి ముకుళితహస్తుఁడై నిలిచి పతిదృష్టి తన మీఁదఁ బాఱుటఁ జూచి జననాథ మిముఁ గాన సకలసంయములఁ గొనివచ్చియున్నాఁడు కుంభసంభవుఁడు మొగసాల ననవుడు ముదితాత్ముఁడగుచు జగదీశుఁ డెదురుగాఁ జనుదెంచి మ్రొక్కె పరువడిమై నర్ఘ్యపాద్యాదివిధుల గురుభక్తిఁ బూజించి గోదానమిచ్చి భక్తిఁ దోడ్కొనివచ్చి పరిచరజనులు యుక్తకార్యముల నియోగింప వారు భద్రకాంచనమయబహురత్న చిత్ర భద్రాసనంబులపై దర్భ పఱచి చారుకృష్ణాజినాస్తరణముల్ చెలువ మారంగ రచియింప నందుఁ గూర్చుండి కుశలమే రఘురామ! కువలయజనులు కుశలమా! యని నీకుఁ గుశలంబె కాదె పరుషవిక్రము నకంపను జంబుమాలి నురుబాహుబలుని యుధాజిత్తు మత్తు నక్షీణబలు విరూపాక్షు సంగ్రామ దక్షతగల మహోదర ఘటోదరుల శూరోత్తముని బ్రహ్మసుతు నరాంతకుని ఘోరవిక్రముల నికుంభకుంభులను నంతకసముని దేవాంతకు వికటు సంతతాహవజయశాలి దుర్ముఖుని నతులబలోదగ్రుఁడగు మహావీరు నతికాయు ఘనకాయుఁడగు కుంభకర్ణు వీరాదిగాఁ గల వీరరాక్షసుల ఘోరాజిఁ జంపితి కువలయాధీశ సుతబంధుయుతముగా సురలోకవైరి నతిరయంబునఁ జంపి తాదశాననుని నీవు విల్లందిన నిఖిలంబు బెదరు రావణుండన నెంత రఘువీర నీకు ననిమిషదుర్జయుండగు తండ్రికంటె నినకులోత్తమ చాలనెక్కుడు గాదె యింద్రాది దివిజుల హృదయశల్యంబు నింద్రజిత్తును గెల్వ నెవ్వఁడు చాలు నతికాయు నడఁప నీ యనుజుండు దక్క నితరుఁ డెవ్వఁడు గలఁ డిన్నియు నేల నక్షీణబలుఁడు బ్రహ్మాస్త్రప్రయోగ దక్షుండు కపటయుద్ధముల దుర్జయుఁడు కాలుని గెలిచిన కడిదివీరుండు త్రైలోక్యజయశాలి దశకంఠసుతుఁడు మేఘనాదునికి సౌమిత్రిఁ దప్పించి రాఘవ నిలుతురె రణమున నొరులు అభియాతి కులమెల్ల నణఁచి లోకముల కభయమిచ్చితి శుభంబగుఁ గాక మీకు సమరంబులోపల సకలరాక్షసుల సమయించి వచ్చి రాజ్యమును గైకొన్న నినుఁ జూడఁగంటిమి నిండె మా తపము అనఘాత్మ ధన్యులమైతి మేమనిన ముకుళితహస్తుఁడై మునుల నీక్షించి సకలేశుఁడగు రామచంద్రుఁడు పలికె ననికి దక్షులు విరూపాక్షాదు లుండ ఘనసత్త్వుఁడగు కుంభకర్ణుఁ డుండఁగను భుజవిక్రమాటోపభువనభీకరుఁడు రజనీచరేంద్రుండు రావణుండుండ మేఘనాదుని మీరు మిగులఁ బేర్కొంటి రా ఘను బలమును నధికవిక్రమము సామర్థ్యమును నెట్టిచందంబు తండ్రి కేమికారణమున నెక్కుఁడైనాఁడు వరము లేగతిఁ గొన్నవాఁడంతవట్టు కరమర్థి విననిచ్చ గలదు నాకనిన ననఘుఁడు మునివరుఁడగు నగస్త్యుండు నతినయోక్తుల రాఘవాగ్రణికనియె మఱి మేఘనాదుని మహితప్రభావ మెఱుఁగఁ జెప్పెద మనుజేంద్ర మున్నతని తనయుఁగాఁ బడసిన దశకంఠుకులము జననప్రకారంబుఁ జరితంబు వినుము ప్రథమయుగంబున బ్రహ్మపుత్రుండు ప్రథితోరుతరకీర్తి పరమార్థవిదుఁడు నిరుపమచరితుఁడు నిర్మలధర్మ పరుఁడు పులస్త్యుఁడన్ బ్రహ్మర్షివరుఁడు సంపూర్ణగుణముల జనకుని భంగిఁ బెంపార సురలకుఁ బ్రియమైనవాఁడు దివిజారి చేరువఁ దృణబిందుఁడనఁగ నవిరళవ్రతనిష్ఠ నధికుఁడై వెలయు నట్టి యారాజర్షి యాశ్రమంబునకుఁ బట్టుగా భానుప్రభాభాసియగుచు నిర్మలస్వాధ్యాయనిరతుఁడై విహిత ధర్మక్రమంబునం దపమాచరింప నరలోకనాయక నాగకన్యకలు కరమర్థి రాజర్షికన్యకాగణము నచ్చరలేమలు నమరకన్యకలు నిచ్చలు నేతెంచి నేర్పుమై నచటఁ బాడుచు నింపార బహువాద్యగతుల నాఁడుచునుండఁగ నాపులస్త్యుండు కనుఁగొని కోపించి కన్నియలార ననుఁ గలంపఁగ వచ్చినారిట్లు మీర లేకన్య నావల నిమ్ముగాఁ జూచు నాకన్య ధరియించు నపుడ గర్భంబు నని శపియించిన నతిభీతిఁ బొంది కనుఁగొని యటఁ బాసి కాంతలు చనిరి పరుషోగ్రమైన యాపలుకులు వినక తిరమైన వేడుక తృణబిందుపుత్రి యాదెస మెలఁగుచు ననతిదూరమున వేదవాక్యధ్వని విని చేరవచ్చి యమ్మహాత్మునిఁ జూడ నప్డ గర్భంబు క్రమ్మఁగాఁ గనుఁగొని కడుభీతిఁ బొంది యిది యేమి మూఁడెనో యింతలో ననుచు మదిలోన శంకించి మరల నేతెంచి తన తండ్రిముందర దైన్యంబుతోడఁ దనరారు సిగ్గునఁ దలవంచియున్న నాతృణబిందుండు నద్భుతస్తిమిత చేతస్కుఁడై పుత్రి చేడ్పాటుఁ జూచి యకట నీకిదియు ననర్హంబు గాదె వికృతభావం బేమివిధమున వచ్చె నెవ్వరికెగ్గు నీవేమి కావించి తెవ్వరు శపియించి రేదిక్కుచనితి తప్పక నాతోడఁ దలఁకు నీవుడిగి చెప్పుదుగాకన్నఁ జేతులు మొగిచి జనక! పులస్త్యు నాశ్రమసమీపమునఁ జనఁ జొచ్చి యచట నా సఖులు లేకున్న వెదకుచో నిట్లైనవేష మాక్షణమె విదితమై వచ్చితి వెఱచి మీ కడకు ననవుడు తృణబిందు వాత్మలో నంతఁ గని కూఁతుఁ దోడ్కొని కడువేగ నరిగి యాపులస్త్యునితోడ ననియె నీకన్యఁ దాపసోత్తమ మీరు దయఁ జూడవలయు నెలమిఁ దపోనిష్ఠ నింద్రియజయము గల మీకు శుశ్రూషఁ గావించుఁగాక యనిన పులస్త్యుఁ డాయబలఁ గైకొన్న దినకరతేజుండు తృణబిందుఁ డరిగె సముచితస్థితినంత సంయమీశ్వరుఁడు విమలధర్మాచారవినయశీలములఁ దనకు సంతతమును దగిలి శుశ్రూష లొనరింప నమ్ముని వనిత నీక్షించి నలినలోచన నీకు ననుఁ బోలు నుభయ కులకీర్తి నిచ్చితిఁ గొడుకుఁ బౌలస్త్యు వాఁడును దా విశ్రవసుఁడను పేరి వాఁడునై తగునని ధ్వని వింటిఁగాన నని పల్క గర్భంబు నభివృద్ధిఁ బొంది వనజాక్షి సుతు విశ్రవసుఁ గాంచె నంత ననఘాత్మ కాళింది కాపులస్త్యునకు ఘనుఁడు పౌలస్త్యుండు కరమర్థిఁ బుట్టి ముజ్జగంబుల ధర్మమును బేరుకొనఁగ సజ్జనుఁడై వేదశాస్త్రము లెఱిఁగి నృపవర యతఁడును నియతితో ఘోర తపముసేయఁగ భరద్వాజుఁ డేతెంచి వర్ణింపఁదగు రూపవతియైన దేవ వర్ణినియను కూఁతు వానికి నిచ్చె నతఁడును నాపత్ని యందొక్కకొడుకు నతులతేజోనిధి నవనీశ వడసె నంబుజాసననుఁడంత నచటికి సంత సంబున దేవర్షిసహితుఁడై వచ్చి వినుతింప నీతఁడు విశ్రవసునకు జనియించెఁ గాన వైశ్రవసుడన్ పేర నమరుఁ గాకనుడు హుతాగ్నియుఁ బోలి విమలతేజోభూతి వెలుఁగుచునంత వేయేండ్లు ననశనవిధిఁ జేసెఁ దపము వాయు వాహారమై వర్తించి పిదప వింతగాఁ దపమున కంతరంగమున సంతోషమందుచు జలజసంభవుఁడు నింద్రాదిసురులతో నేతెంచి యతని యింద్రియజయమున కెంతయు నలరి వరమేమి సంయమివర వేఁడుమనినఁ బరిపూర్ణతర లోకపాలత్వ మడిగె నడిగినపుడు నాలవలోకపాలుఁ బొడమింపఁ దలఁపు నాబుద్ధిలోఁ గూడె వాసవసమవర్తి వరుణులతోడ వాసికెక్కుచు ధనేశ్వరుఁడవై యుండు మినసమప్రభగల యీపుష్పకంబుఁ గొనుమంచు వరమొసంగుచుఁ బోయె నజుఁడు ధనపతియును నింత తండ్రిసన్నిధికిఁ జనుదెంచి వినతుఁడై సకలంబుఁ జెప్పి జలజాసనుఁడు నివాసస్థాన మనఁగఁ బలుకఁడు నాకున్కిపట్టేది యనినఁ బసిఁడికోటలు ప్రభాభాసితరత్న విశదచిత్రములైన వివిధ సౌధముల భర్మనిర్మిత సాలంభంజికాకలతి నిర్మలకలధౌతనిబిడహర్మ్యముల మహనీయహాటకమణిగోపురముల బహురత్నతోరణప్రచురమార్గముల నరుదులై మెఱయంగ నమరేంద్రుపురముఁ బురణించు లంకయన్ పురలలామంబు దక్షుఁడై సకలంబుఁ దగ విశ్వకర్మ రాక్షసులకు నుండ రచియించినాఁడు తనయుండ నీవందుఁ దగు రాజ్యసుఖము లనుభవించుచునుండుమని పల్క నతఁడు తోయధి పరిఘయై దుర్భేద్యమగుచు నాయతస్థితిఁ ద్రికూటాద్రిమధ్యమునఁ బెంపారు లంకకుఁ బ్రియముతో వచ్చి యింపారు నప్పురం బెలమినేలుచును నిచ్చలు గంధర్వనిర్జరస్తుతుల నచ్చరలేమల యాటపాటలను మదికొప్ప నుదయార్కుమాడ్కిఁ దేజమునఁ బొదలుచు లీలమై పుష్పకంబెక్కి తక్కనిభక్తితోఁ దల్లిదండ్రులకు మ్రొక్కిపోవుచునిట్లు ముదముతో నుండె ననవుడు నతినిర్మలాగ్నియుఁ బోలె జనపతి తలయూఁచి సంయమిఁ జూచి యెలమి రాక్షసులకు నీలంక మున్ను కలుగుట విదితంబుగా వింటి నేఁడు పొరిఁ బులస్త్యుని కులంబున నిశాచరులు పరఁగుట విందు నప్పౌలస్త్యునందు ఘనుఁడు రావణకుంభకర్ణుల కంటె ననుపమబలుఁడు ప్రహస్తునికంటెఁ గడిమి నవ్వికటుని కంటెరావణుని కొడుకులకంటె నెక్కుడు బాహుబలము గలవాఁడు తొంటిరాక్షసు లెవ్వరీడు బలవంతుఁ డరివీరభయుఁ డెవ్వఁ డరయ నతితరజయశీలుఁ డగుచున్న విష్ణు చేత నేగతిఁ బరాజితులైరి వారు విన వేడ్కఁ బుట్టెడు వివరించి చెప్పుఁ డన నమ్మహాత్ముండుననియె రామునకు నరనాథ కొందఱ నలువ యుగాదిఁ బొరి జలంబులలోనఁ బుట్టించె నంత వారు నాఁకలినీరువట్టును బట్టి వారిజాసను గానవచ్చి కేల్మొగిచి యేమెట్లు మనువార మిటమీఁద మాకు నేమివర్తనమన్న నించుక నవ్వి యుదకంబు రక్షించు నొగినంచుఁ బలికె మది వారి పలుకులు మహితాత్ముఁ డెఱిఁగి రక్షింతుమనువారు రమణ రాక్షసులు శిక్షింతుమనువారు క్షితి యక్షులనియె రాక్షసుకులమున రఘువర కడిమి నీక్షింప హేతిప్రహేతులన్వారు మధుకైటభులఁ బోలి మహి నిశాచరుల కధిపతులై పుట్టి రందుఁ బ్రహేతి పరిణయం బొల్లఁడు పరఁగంగ హేతి వరియించె నుభయ వైవస్వతానుజుఁడు అంత విద్యుత్కేశుఁ డనువాఁడు పుట్టె నంతకు చెలియలి కాహేతివలన నతఁడును సోదకంబగు మేఘలీల నతిశయిల్లుచు నూత్నయౌవనుఁడైన సాలకటంకటా సంజ్ఞాభిధానఁ బోల సంధ్యాదేవి పుత్త్రిపుత్త్రునకు హేతిపెండిలి సేసె నెలమితో నదియు జాతగర్భస్థితి జని మందిరమున సుతుఁ గాంచి యటనొక్కచోఁ బాఱవైచి రతికిఁ గ్రమ్మఱ వచ్చె రమణునికడకు బాలుఁడు నాననపంకజంబునకుఁ గేలు మాటుగఁ జేసి గిరిగుహల్ చెలఁగ నెలుఁగెత్తి పిలిచె బీరెండ నోరెండఁ బలుమాఱు నుఱిమిన భంగి వాపోవ నందివాహనముపై నగరాజసుతయు నిందుమౌళియు మింట నేగుచునుండి విని గౌరి వెరగంది వింటివే దేవ కనుఁగొంటివే వీనిఁ గనుఁగొనవలయు నరుదైన దయపుట్టె నటుగాన మీరు పరమేశ యీ బాలుఁ బాలింపవలయు నని విన్నవించిన నప్పుడు వాని కనుపమస్థితిఁ దల్లి యంతప్రాయంబు నమరత్వమును నిచ్చె నమ్మహాదేవుఁ డమరఁ గర్భంబున నపుడ జన్మంబు తమ సవితృలపాటిదగు వయఃస్థితులు నుమయును వరమిచ్చె నొగిరాక్షసునకు నంత సుకేశాఖ్యుఁడై వాఁడు జనని యంతప్రాయమున వాఁ డమరుఁడునగుచుఁ బురుహూతమహిమతో భువనంబు లద్రువ వరగర్వమునఁ గ్రొవ్వి వర్తించుచుండ గ్రామణియను పేరి గంధర్వుఁ డతని సామర్థ్యమూహించి సమ్మదం బెసఁగ వరరూపవతి వేదవతియను కన్యఁ బరఁగంగ నతనికిఁ బత్నిఁగా నిచ్చె లీల నాతఁడు సుమాలిని మాల్యవంతు మాలిని గనియె నమ్మత్స్యాక్షివలన మూఁడగ్నులను రుద్రు మూఁడు నేత్రముల మూఁడు మంత్రంబుల??? మూఁడు వాయువులఁ బోలి యామువ్వురుఁ బొలుపార మేరు శైలంబునకు నేగి సకలలోకములు భయమందఁ దపములు పరమేష్ఠిఁ గూర్చి నియతితోఁ జేయంగ నీరజాసనుఁడు కనకాద్రి కేతెంచి ఘనులార! వేఁడి కొనుఁ డేమివరములు కోర్కి మీకనిన ముగురు విచారించి ముకుళితహస్తు లగుచు వా రతిభక్తి నాబ్రహ్మఁ జూచి యెనసి మేమన్యోన్యహితులమై యుండ వినుతతేజంబుల విలసిల్లుచుండ నరుల కజేయులమై యుండనిమ్ము చిరజీవులై యుండఁ జేయుము మమ్ము ననిన నవ్వరములు నబ్జజుఁ డొసఁగి తన లోకమునకేగెఁ దదనంతరంబ వారిజాసనదత్తవరశక్తిఁ జేసి వారును ముదమంది వారింపఁబడక ననిమిషుల్ మొదలుగా నఖిలలోకముల జనులఁ బాధించుచు జనలోకనాథ! దుర్మదచరితు లాదుర్జయుల్ విశ్వ కర్మయొద్దకు వచ్చి ఘనుఁడ నేర్పెసఁగ నీవు నివాసముల్ నిర్మింతు సకల దేవతాగంధర్వ దితిసుతాదులకు మాకు నింపెసఁగంగ మంథాద్రినైన శ్రీకిఁ బట్టగు హేమశిఖరిపైనైన హిమవంతముననైన నెల్లసంపదలఁ గమనీయరచనలు గల పట్టనంబు నిర్మింపు నీవన్న నెరయంగ విశ్వ కర్మయు వారితోఁ గరమర్థిఁ బలికె వినుఁడు పురాతన వృత్తాంతమొకటి యనఘుండు నారదుఁ డఖిలలోకములుఁ దిరిగి యొక్కెడ వాయుదేవుని గాంచి యరుదార నతనితో ననియె నీరీతి నిన్నొక్కటడిగెద నిక్కంబుఁ జెప్పు మిన్నిలోకములకు నెక్కుడు బలము గలవారు వీరని గణుతింపుమనిన నలరుచు నిట్లను నాగంధవహుఁడు త్రిగుణాత్మకమ్మైన దేదీప్యమైన ముగురువేలుపులకు మొగ యాకసంబు కన్న నేనధికసత్త్వాఢ్యుండనైతి ననిన నీకంటె సత్త్వాఢ్యులు లేరె నీయవనీతలంబెల్ల ధరించు నాయనంతుండు సత్త్వాఢ్యుండు గాఁడె యనిన నవ్వుచు నిట్టులనె గంధవహుఁడు వినుము శేషుండు నా విక్రమమునకు నెనగాఁడు చెప్పెద వేల! మునీంద్ర యనిన నావచనంబు నాత్మలో మఱ??? కనఘుండు చనుదెంచు నాశేషుఁడెల్లి నని శేషవరునొద్ద కాప్రొద్దె పోయి వినిపించె సకలంబు విశదంబు గాఁగ విని యనంతుం డతివేగంబె కదలి కనకాద్రికడనున్న కరువలిఁ గాంచి వినుమని పలికెఁ బ్రవీణత మెఱసి బలవిక్రమంబులు పలుమాఱుఁ జెప్ప నిలువక పాఱెడు నీతోడిదేమి లక్షయోజనముల లలిఁ బొడవగుచు నక్షీణశిఖరాళి నలరు నీయద్రిఁ గప్పెదఁ బడగలఁ గదలించితేని నిప్పుడు నీ సత్త్వమెఱిఁగెదననుచుఁ బాటించి మణిఫణాపఙ్క్తులచేత హాటగిరిఁ గప్పె నపుడ శేషుండు నన్నివాయువుల నొక్కంతగాఁ గూర్చి పన్నగవరుఁ గరువలి తాఁకుటయును నలవడ యోగంబునం దెల్లప్రొద్దుఁ జలియింపకుండెడి శంభుండ పోలి యున్న నావాయువు లొగి లోకపఙ్క్తు లన్నియు గుండ్లు బెండ్లాడంగ దొణఁగెఁ దొడఁగిన దేవతల్ తుప్పునఁ దూలి వడి బ్రహ్మయొద్దకు వచ్చి కేల్మొగిచి దేవలోకములెల్లఁ దెగి చెడిపోవు నీవాయువెడపక నిటు వీఁచెనేని యనిన నాబ్రహ్మ శేషాహియొద్దకును జనుదెంచి యిట్లను జతురవాక్యముల విశ్వంభరునిఁ దాల్చి విశ్వంబుఁ దాల్చి శాశ్వతకీర్తియు క్షమగల నీకు నీయెడ లోకంబులెల్ల నశించు వాయువుతో స్పర్ధ వలదు నాగేంద్ర యని పద్మభవుఁడాఁడ నయ్యనంతుండు తనలోనఁ బరమశాంతంబును బొంది యొకపడగించుక యోరసేయుటయు నకలంకమగు వాయు వందులఁ జొచ్చి ధృతి నొక్కశిఖర ముద్వృత్తిని విఱిచి యతివేగమున దక్షిణాబ్ధిలో వైవ నదియ త్రికూటమై యమరుచు నెపుడుఁ బదిలమై యత్యంతబలమయై చూడ నక్షత్రవలయంబు నడుమగాఁ బెరిఁగి దక్షిణవారాశి తనుఁ జుట్టియుండ నమరుఁ ద్రికూటాద్రి యాత్రికూటమున నమరేంద్రు పనుపున నమరించినాఁడఁ జెలువార నతిచిత్రచిత్రహర్మ్యములు కలధౌతబహురత్నకలితశిల్పములు గల గృహప్రాకార ఘనగోపురాదు లలవడఁగా లంక యను నొక్కపురము నది విపక్షాభేద్యమగుచుఁ బక్షులకు గదియంగ రాకుండు గగనంబుఁ దాఁకి యందు రాక్షసులుండి రర్హత నెలమిఁ బొందుగాఁ బొండు నప్పురమునకనిన వారు నాలంకకు వడి నేగుదెంచి .......... తగు సుమాలికి నిచ్చెఁ దన పెద్దకూఁతు మగఁటిమి వారు నమ్మాల్యవంతునకు నెలమి రెండవకూఁతు నిచ్చె సౌభాగ్య నిలయ మూఁడవకూఁతు నిచ్చె మాలికిని బదపడి వార లప్పడఁతులఁ గూడి మదనరసాసక్తమతులతో బడలి సంతోషమున రతుల్ సలుపుచునుండి రంత సుమాలియు నాకేతుమతియు నతలశూరుల బ్రహ్మహణు నకంపనుని వితతప్రతాపుని వికటుఁ డన్వాని ఘనభుజున్ గరటముఖ శ్యావదంతు లనువారి ???సంహ్రాదియను మహాబలుని భాసురయశుని సుపార్శ్వునిఁ బ్రణుని భాసకర్ణునిని బహ్వాసి ధూమ్రాక్షు నమరఁ బుష్పోత్కట యను కోమలాంగిఁ గమనీయశుభమూర్తి కైకసియనియు నమరఁ గుంభీనస యను నామమెసఁగ రమణీయమై యొప్పు రాజాస్యఁ గనియె నలఘుతేజోమూర్తియగు మాల్యవంతుఁ డలరి యాసంకృతి యను పత్ని యందు మొగి వజ్రముష్టి దుర్ముఖు విరూపాక్షు నగణితశత్రుఘ్ను నగ్నికోపనుని మదమత్తుఁ డనువాని మఱియొక్కకూఁతు నధికతేజస్విని ననలాఖ్యఁ గాంచె మాలికిఁ గొడుకులు మహిమతోఁ బుట్టి రోలి నవ్వసుధపై నురుతరతేజు లనలుండు ననిలుండు హరుఁడు సంపాతి యును విభీషణుమంత్రు లుర్వీశ వారు ఇవ్విధంబునను నయ్యింతులవలన మువ్వురు సంతతుల్ ముదముతోఁ బడసి మృత్యుఘోరాకృతి మిగుల సంతతము నత్యంతబలవంతులై సమీరణము మాడ్కి నెల్లందుఁ గ్రుమ్మరుచు జనముల వేడ్కతోఁ జెఱుపుచు విపులదర్పమునఁ గొడుకులుఁ దారు గైకొనియు లోకములఁ గడలేనిబాధలఁ గావించుచుండ దిక్కెవ్వరును లేక దివిజులు మునులు ముక్కంటికడకేగి మొగిఁ గేలుమొగిచి గౌరీశ! పరమేశ! కందర్పదహన కారుణ్యమున మముఁ గావంగవలయు వనజసంభవుచేత వరములు వడసి కినుకతో నడరి సుకేశనందనులు మునుల యాశ్రమములు మునుకొని చెఱుతు రనిశంబు బాధింతు రఖిలదేవతల వేల్పుల నాకంబు వెడలంగ వ్రాలి వేల్పుల మేమంచు విహరింతురచట నేనె విష్ణుండను నేనె రుద్రుఁడను నేనె పద్మజుఁడను నేనె యింద్రుఁడను నేనె కృతాంతుఁడ నేనె పార్థివుఁడ నేనె చంద్రుడను నేనె భాస్కరుఁడ నని పల్కుచుండుదు రానిశాచరులు చను మమ్ము రక్షింప సకలలోకేశ! కడుఘోరరూపంబుఁ గైకొను వారి నడఁగించి మాకు నీవభయ మిమ్మనినఁ దలఁచి సుకేశనందనులపైఁ గూర్మి పొలియింపఁ జాలక భూతేశుఁడనియె వారు నా కరియంగ వధ్యులు గారు వారల వధియించు వారిజోదరుఁడు విష్ణుని వరములు వేఁడుఁ డాసర్వ జిష్ణుడు మీకెల్ల సేమంబు సేయు నని పల్క శివునకు నతిభక్తి మ్రొక్కి మునులును సురసంఘములు నేగుదెంచి హరిఁ గాంచి ముకుళితహస్తులై దేవ కరుణించి మము నీవ కావంగఁ దగుదు వనజసంభవదత్తవరులు సుకేశ తనయులు సురమునిస్థానంబుఁ గొనిరి వారు లంకాపురి వర్తింతు రమర వైరులఁ గడతేర్ప వలవదే మీకు దనుజమర్దన వారి తలలు చక్రమునఁ దునుమాడి జముఁ గూర్పు దుష్టరాక్షసుల నభయంబు నేఁడు మాకానతి యిమ్ము త్రిభువనాధీశ్వర దేవ నీవనిన నిర్జనంబుగ వారి నిర్జింతునింక నిర్జరవరులార నెమ్మదినుండుఁ డని పల్క వారు నయ్యసురాంతకునకు వినతులై చనఁగ నావృత్తాంత మెఱిఁగి మనమునఁ దలపోసి మాల్యవంతుండు తన సహోదరులతోఁ దగ నిట్టులనియె మునులును సురలును ముక్కంటిఁ గాంచి వినతులై వేఁడిన “వివరింప వారు నాచేతఁ జావరు నలినలోచనుఁడు మీ చింతఁ బాపెడు మీరేగుఁ” డనుచు నాభూతపతి వల్క నమరాదు లబ్జ నాభుని కడకేగి నమ్రులై నిలిచి మనబాధ లెఱిఁగింప మనల నిర్జింప దనుజారి సమయంబు దగఁ జేసినాఁడు విశదోరుయశు మహావీరు హిరణ్య కశిపుఁ జంపెను బలిం గడతేర్చి పుచ్చె రాధేయు వధియించె రణభూమి నముచి సాధించి వాతాపి సమయించెఁ గడఁగి శంభుని దునిమె నిశుంభు మర్దించె శుంభదంశుల యమార్జునుల నిర్జించె నిరుపముండగు కాలనేమి భంజించెఁ బరిమార్చె మఱి లోకపాలుఁ డవ్వాని హార్దిక్యు నణఁచె సంహతు సంహరించె దుర్దములగుచున్న దుష్టరాక్షసుల మఱియును బల్వుర మర్దించె దీని నెఱిఁగి యావిష్ణుతో నేలవైరంబు బగముల బాధలు చాలించి సంధి తగఁ జేసి మనుటయుఁ దగినకార్యంబు నయమార్గ మెఱిఁగిన నా మాట వినిన భయమేది నెమ్మది బ్రతుకంగవచ్చు శిష్టైకరక్షణ శీలుఁ డాహరికి దుష్టమర్దనమది దోషంబుగాదు వినుఁడన్న మాటలు వీనులఁ జొరక తనరు తెంపున వారు తమ యన్నకనిరి వేదంబులొగిఁ జదివితిమి యజ్ఞములు వేదోక్తవిధులఁ గావించితి మెలిమి వివిధదానంబులు విహితధర్మములు నవిరళరాజ్యంబు నమరఁ జేసితిమి కడుఁ దేజమునఁ బెద్దకాలంబు మంటి మడరి యోడించితి మఖిలలోకముల యశముఁ గంటిమి విష్ణుఁడైనఁ గానిమ్ము పశుపతి గానిమ్ము బ్రహ్మ గానిమ్ము మనలఁ గయ్యంబున మార్కొనఁగలరె మనమిఁక లంకలో మసలక వెడలి వైరకారణులైన వాసవాద్యమర వీరులఁ బొలియించి వెస వత్తుమనుచు ఖరిహయస్యందన కమఠశార్దూల శరభభేరుండాజసింహవాహనులు గురుమృగపన్నగ క్రోడోగ్రకరటి నరగోవిహంగమ నక్రవాహనులు నఖిలాయుధోజ్జ్వలహస్తులునగుచు నిఖిలసేనలతోడ నేల యల్లాడ భీకరాకృతులతోఁ బేర్చి రాక్షసులు నాకంబుపై నెత్తి నడువంగ నపుడు తలపోసి గృహదేవతలు నిప్పురంబు లలిఁ దూలఁగలదంచు లంక వెల్వడిరి వారిదంబులు రక్తవర్షముల్ గురిసె వారాసు లుప్పొంగి వడి మేరఁ దప్పె నట్టట్టుగా దొర్లె నల కులాచలము లట్టహాసముతోడ నాడె భూతములు చరణంబు లెఱ్ఱనై సరి నూరుకముల గొరవంకలును బాఱె ఘోరంబులగుచు సుడియుచుఁ బొడచూపె సురగాలి పెల్లు యెడనెడ వఱడు బిట్టెదుట వాపోయె వలయమై సేనపై వడి గ్రద్దలాడెఁ గలఁగుచు నుగ్రంబుగాఁ గాకులఱచె బలుమాఱు నిటు మహోత్పాతముల్ వొడమ దలఁకక రాక్షసుల్ దర్పంబు లెసఁగ మొగి మాల్యవంతుండు మున్నుఁ గానొక్కఁ తెగువతో నడచిరి దిశలెల్ల నిండ నంత నిర్జరదూత లసురాంతకునకు నంత వృత్తాంతంబు నట యెఱిఁగింప కలసి విద్యాధరగంధర్వసిద్ధ విలసితగానముల్ వీనులఁ బొలయ నమరులు గొలువంగ నఖిలసైన్యములు సముచితస్థితితోడఁ జనుదెంచుచుండ మెఱసి వక్షస్థలి మించు కౌస్తుభము మెఱుఁగు దిక్కులనిండు మిఱుమిట్లు గొలుప జంగమరోహణాచలతుంగశృంగ సంగతిగల నీలజలదంబు భంగి విక్రమోదగ్రుఁడై విహగేంద్రు నెక్కి చక్రగదాఖడ్గశార్ఙ్గంబు లోలిఁ గరపంకజంబులఁ గరముల్లసిల్లఁ బరుషభూరీభేరి భాంకృతుల్ చెలఁగ నాభీలగతి దిక్కులద్రువంగ వనజ నాభుండు నాజికి నడచె నయ్యెడను గరుడపక్షానిలగమనవేగమునఁ దరులెత్తి వడిఁ బాఱఁ దారలు చెదర వినువీథి రవితేరు విముఖమై పఱవ ఘనమాలికలు తూలికలభంగిఁ దూల మున్నీరు గడలెత్తి మ్రోయ మిన్నేరు పెన్నేల నెగసిన పెందూళి యనఁగ విఱిగి మహాచలవిపులశృంగములు దఱుగుచు నిలఁ గూల ధరణి కంపింపఁ గువలయహితబింబగురుకాంతి నమరు ధవళాతపత్రంబు దవ్వులఁ గాంచి జయశాలి విష్ణుండు చనుదెంచె ననుచు భయమంది రాక్షసబలమెల్లఁ గలఁగ నంత నద్దేవున కభిముఖులగుచు నెంతయుఁ గడకతో నేర్పులు మిగుల దినకరకరజాల తీవ్రార్చు లడర ఘనమాంసశోణితకలితంబులైన పరశుతోమరకుంతపట్టసప్రాస పరిఘాసిముద్గర ప్రముఖాయుధములఁ దిరిగి నొప్పించుచు దితిజారి మేను శరవృష్టిఁ గప్పిరి సకలరాక్షసులు ధారాధరంబులు ధరణీధరంబు వారిధారలఁ గప్పు వలనొప్పు మిగులఁ విలయకాలంబున విశ్వలోకములు కలఁగి యద్దేవుని ఘనశరీరంబుఁ జొచ్చిన విధమునఁ జొచ్చి లోనణఁగ నచ్చెరు వడరంగ నయ్యంపగములు భుజబలదర్పముల్ పొలుపార నంత రజనీచరాధముల్ రథికుతో రథియుఁ గరముఁ దాఁ గరివాఁడు కరివానితోడఁ దురగంబువానితోఁ దురగంబువాఁడుఁ దరమి పదాతి పదాతితోఁ దాఁకి పారిఁ బొరిఁ జలమెక్కి పోరుచున్నెడను నడిదము జళిపించి యంగముల్ త్రుంచి కడిదిఁ బొమిడికలు గదలచేఁ జదిపి నెఱి నారసంబులు నెఱకులఁ ద్రుంచి మెఱుఁగువజ్రంబుల మెడలు దున్మాడి చేతికినందక సెలకట్టెలెత్తి వేతొడల్ గాడిపో వీఁకతో వైచి కడుగట్టి రథములఁ గడునొగల్ గొట్టి పొడలెత్తి పొడిగాఁగ బుడమితోఁ జఱచి రంత రాక్షసముఖ్యులగు మహావీరు లంతకాకృతులతో నార్పులు నిగుడ సరిఁ దోమరంబుల శక్తుల నొంచి శరవృష్టి గప్పి రాసకలలోకేశు నప్పుడు విష్ణుండ నలిగి శార్ఙ్గంబు కొప్పున కొప్పుగా గుణమెక్కఁ ద్రోచి జిహ్మగాధిపకల్ప శింజినీరవము బ్రహ్మాండకోటరభరితంబుఁ గాఁగ మిడుగుర్లు మంటలు మింటఁ బెల్లడరఁ బిడుగులఁ బోలెడు భీకరాస్త్రముల గరుల పెన్గాడ్పున ఘనపంక్తి దూల నిరుఁ దెసఁ గొని వడి నిగిడింప నవియు నెడ నిశాచరులేయు నిషుపరంపరలు వడిఁ ద్రుంచివైచుచు వచ్చి రాక్షసుల మస్తకంబుల ద్రుంచి మరువులు చించి హస్తముల న్దునుమాడి యంగము ల్ద్రుంచి నెఱకులు గొనికాఁడి నేల భేదించి మఱియును బహురక్తమాంసముల్ తొరఁగఁ జరణముల్ జానువుల్ జత్రువుల్ జంఘ లురము లూరులు బాహు లుదరముల్ కాళ్లు నిటలంబులాదిగా నిఖిలాంగకములు చటులవేగమున జర్ఝరితముల్ చేసి వేదండకుంభముల్ విదిళించి తురగ పాదంబు లతిఘోరభంగిగాఁ ద్రుంచి కేతుదండము లుర్విఁ గిరికొల్పి మెఱయ నాతపత్రావళు లందంద నఱకి రథికులఁ బొలియించి రక్తవాహినులు పృథివీతలంబునఁ బెల్లుగాఁ బఱపి వెలయ మేఘధ్వని విధముగా బెట్టు జలజనాభుఁడు పాంచజన్య మొత్తుటయు జలజభవాండమ్ము సంధులు ప్రిదిలెఁ గలఁగె నబ్ధులుఁ దారకంబులు డుల్లెఁ జలియించె దిక్కులు శక్రాదిసురలు చెలఁగి నిశాచరసేన మూర్ఛిల్లె వనజాప్తబింబంబువలనఁ బెల్లడరు ఘనరశ్మిజాలంబు గతి వెలుంగుచును గనుఁగొని లయవేళ కడలి వెల్వడిన పెనుప్రవాహంబుల పెలుచ మ్రోయుచును నరుదార నద్రిగహ్వరముల వెడలు నురగసంఘము భంగి నుగ్రంబులగుచు తత భుజాదండకోదండంబువలన నతిగాఢముక్తంబులైన బాణములు నీక్షింప గణనకు నెక్కుడుగాఁగ రాక్షసావలినెల్ల రణభూమిఁ గెడపి కడునల్క శరభంబు కనలి సింహంబుఁ గడిమిమై సింహంబుఁ గరియూధములను గలయంగ గరి భయంకరలీలఁ బులులఁ బులి తురగంబులఁ బోఁద్రోలు కరణి గరుడవాహనుఁ డుగ్రగతిఁ దోల నోలిఁ బరువడి రాక్షసభటుల రూపణఁచెఁ బుంఖానుపుంఖవిస్ఫురితబాణముల శంఖశార్ఙ్గధ్వనుల్ సైరింపలేక నతిభీతి హతశేషులగువారు విఱిగి ధృతి మాలి యాలంకదిక్కు పాఱుటయు సుడిగొన్న తమసేనఁ జూచి సుమాలి యెడసొచ్చి యనువుగా నిషుపరంపరల నసురారి నొప్పించి యాకసంబద్రువ వెస నార్చి నిలిచె దిగ్వివరంబు నిండ నాజి మున్విఱిగిన యానిశాచరులు తేజంబు లూహించి తెరువుఁ గ్రమ్మరిరి దానవాంతకుఁ డంతఁ దనరారు నలుక వాని సారథి తల వడిఁ గూలనేయ నరద మీడిచికొంచు నశ్వముల్ బెదరి మరలిపాఱఁగఁ జూచి మాలియు నంతఁ బసిఁడిపింజెల నొప్పు బాణముల్ దొడఁగి యసురారిపై నేయ నవియు నందంద సితకరద్యుతులతోఁ జెలువారు హంస వితతులు క్రౌంచాద్రి వెసఁ జొచ్చు కరణిఁ బరువడి వెలుఁగుచు విడి వడి చొచ్చె నరుదార విలసిల్లు నవ్విష్ణు మేన దాని కొక్కింతయుఁ దలఁకక నిలిచి దానవాంతకుఁ డంత ధనువు మ్రోయించి కులిశోపమములైన ఘోరబాణంబు లలుకతో నడరించి యతని నొప్పించి విముఖునిఁ గావించి వెసఁ గిరీటంబు సమరోర్విఁ బడవైచి చాపంబుఁ ద్రుంచి కేతువు ఖండించి కీలాలధార లాతతగతి దొర్గహరుల??? పోరణఁచి మఱియును దఱుమంగ మాలి తేరెక్కి యురగభీకరగదాయుతబాహుఁ డగుచు గిరిశృంగములనుండి కేసరి యెగసి కరమల్క లంఘించు గతి నేలకుఱికి యదరులు చెదరంగ నాభీలలీల గదగొని వడినేసె గరుడుని శిరము కులిశసన్నిభ గదాఘోరఘాతమున నలఘుశిలాకల్పమగు శిరం బవిసె మఱుఁగున నగ్గరుత్మంతుఁ డాలోన బిరుదు ముందరయైనఁ బెలుచ విష్ణుండు కలత నానారత్నఘనదీప్తు లడరఁ విలయార్కు పరివేషవిస్ఫూర్తి దోఁపఁ గాలానిలావర్తగతి కానఁబడఁగఁ గాలచక్రాకృతి గల చక్రమెత్తి పెడచేతివాటున పృథులమస్తకము మిడుకుచుఁ బడ వాని మెడఁ ద్రుంచివైచె నవునవునని మింట నందంద పేర్చి దివిజసంఘములార్చె దిక్కులనిండ మాలి పాటునకంత మాల్యవంతుండు దూలె సుమాలియు దుఃఖంబునొందె నసములు??? సెడి భీతి నందఱు లంక దెస మోముగా వైనతేయుండు తెలిసి పక్షవిక్షేపన పవనవేగముజ??? రాక్షసకోటుల రణభూమిఁ దోలఁ దలలు వీడఁగ నాయుధంబులు విడచి వలనేఁది పాఱెడు వారి వెం దవిలి పటుశిలీముఖముల పాలుసేయుచును నటు నింగినిండిన యానిశాచరుల వారిదాకృతిఁ బోలి వారాశిలోన ఘోరాశుగంబులఁ గూలనేయుచును వెండియఁ బోనీక వెసఁ గూడఁ దఱిమి పుండరీకాక్షుండు భూరికోపమున నరుణారవిందాక్షుఁడై విక్రమించి పొరిఁ బొరిఁ జంపెనప్పుడు నిశాచరుల నెట్టనఁ గరవాలనిష్ఠుర హతులఁ దెట్టలై నడుములు తెగిపడ్డవారు ప్రేవులు నెమ్ములు పిశిత ఖండములు ప్రోవులై గదలచేఁ బొలిసినవారు విక్రమోదగ్రులై వెసఁ దాఁకి వీఁకఁ జక్రంబు వాటున స్రుక్కినవారుఁ గవచముల్ భేదించి గరులంట నమ్ము లవయంబులు గొన్న యముఁ గన్నవారు వారణంబులతోడ వాజులతోడఁ దేరులతోఁ గూడఁ ద్రెళ్లినవారు నెరసిన కీలాలనిర్ఝరంబులను బరువడిఁ దునియలై పడిన కైదువులు దూలిన గొడుగులు తుమురైన రత్న కీలితాభరణముల్ గిరిగొంచు నమర నధికవేగమున నిట్లసురారి మసఁగి వధియింప నమ్మాల్యవంతుఁడు మగిడి కనలు కోపంబునఁ గన్నులకెంపు దనరారఁ బలికె నద్దనుజారిఁ జూచి యెఱుఁగవె రణధర్మమేల చంపెదవు వెఱచి పాఱెడువారి వెనువెంటఁ దగిలి సమరభయార్తులఁ జంపినవారి కమరలోకము దూర మతిపుణ్యులైన నని చెప్పఁగా విందు మని కోడువారిఁ జనునె జనార్దన చంపనిబ్భంగి నదె చక్రమదె చాపమదె గదాదండ మిదె సంగరంబునకే వచ్చినాఁడ మీఱి నీతో లావుమెఱయుదునింకఁ బాఱెడువారల పనియేమి నీకు నని పల్క దనుజారి యన్నిశాచరుని గనుఁగొని నీచేతఁ గడునొచ్చి సురలు శరణు వేఁడిన నేను సకలరాక్షసులఁ బరిమార్ప బ్రతినలు పట్టినవాఁడ మెచ్చి వరంబులు మీతపంబులకు నిచ్చిన విధి వెన్క నిడికొన్ననైన సురిగి పాతాళంబుఁ జొచ్చిననైనఁ బొరిగొందు మిమ్మేలఁ బోనిత్తుననిన ఘంటికల్ మెఱయంగ ఘనశక్తిపూని మంటలారఁగ వాఁడు మధువైరి వైచెఁ బేరురం బదినాటఁ బృథులవిద్యుతుల వారిదాకృతినొప్పి వనజనాభుండు దానిన కొని వైవ దారహారముల తో నొప్పునాతని తోరంపుటరము కవచంబు భేదించి గాఁడనైచుటయు నవశభావము చెంది యాలోనఁ దెలిసి కింకిణుల్ మెఱయంగఁ గేల నంకించి హుంకృతితో వక్ష ముగ్రశూలమున వెస వైచి పిడికిట వీఁకఁ దాఁకింప నసురారి కవియెల్ల నవలీలలైనఁ బిఱిఁదికి నొకవింటిపెట్టోసరించి యఱచేతఁ జఱఁచె బిట్టసురారి శిరము గరుడుండు ఱెక్కలగాలి చొక్కాకు కరణిఁ దోఁపఁగ నుగ్రగతిఁ దోలె వాని వాఁడును సేనతో వసుధేశ పాఱి వాఁడిమి చెడి లంక వడిఁ జొచ్చెనంత నసురారి దెస శంక నాలంకయందు మసలక రాక్షసుల్ మఱి యుండవెఱచి కొడుకులతో బంధుకోటులతోడఁ బడఁతులతోఁ గూడఁ బాతాళమునకు భూలోకనాయక పోయిరి వీరు సాలకటంకట సంతతివారు పఙ్త్కిరథాత్మజ బాహుదర్పమునఁ బఙ్త్కికంఠునకంటె బల్లిదుల్ వీరు ధర నీవు చంపిన దశముఖప్రముఖు లరయఁ బులస్త్యు నన్వయమువా రధిప నారాయణుఁడు దక్క నరలోకనాథ విరి నిర్జింప నేవీరుండు లేఁడు ఆదిత్యకులజ నీ వా చతుర్భుజుఁడ వాదినారాయణుండైన దేవుఁడవు శరణాగతప్రియ సకలరాక్షసులఁ బరిమార్పఁ బుట్టితి భానువంశమున యుగయుగంబునను నీవొక్కొక్కమూర్తి నెగడుదు ధర్మంబు నిలిపెడుకొఱకు నని పల్క మఱియును నవనీశుఁ జూచి మనుజేంద్ర వినుము సుమాలి యన్వాఁడు తనయఁ గైకేశి యన్దానిఁ దోడ్కొనుచుఁ జనుదెంచి ధరణిపైఁ జరియించు నెడను నేపారఁ బుష్పకంబెక్కి మోదమున నాపులస్త్యుని మన్మఁడగు కుబేరుండు ముదమందఁ దండ్రికి మ్రొక్కఁబో నతని సదమలతేజంబు చక్కఁగాఁ జూచి యరుదంద సుతఁ జూచి హరిణాక్షి! నీకుఁ బరిణయకాలంబు పరికింపనిదియ యతఁడేల మనకిచ్చు ననుచు నా వలన నతివ! శంకించి నిన్నడుగ రెవ్వరును నుభయకలంబుల నుజ్జ్వలాకార విభవగణంబుల విలసిల్లు వరుని నిలలోన నొకని నన్వేషించి నిన్నుఁ దల మోచుకొనిపోయి తరుణి యీవలసె నాఁడుబిడ్డలఁ గన్నయప్పుడె కాదె వాఁడిమి చెడియుండవలయుఁ దండ్రులకు లలితలక్షణగుణలావణ్యములను నెలజవ్వనము నొప్పు నెలనాఁగ నీకు నటుగాన నీయంతనైన వేఁ బనుపఁ గుటిలకుంతల వరుఁగోరి పోఁ దగుదు వతివ పద్మజుసుతుఁడైనపులస్త్యు సుతు విశ్రవసుఁ బొందు సోయగం బమర మగువ నీకొడుకులు మన్మలు నితని పగిదిఁ దేజస్వులై పరఁగెదరనినఁ బ్రియమంది రఘువీర పితృనియోగమున భయదసంధ్యావేళఁ బరికింప కరగి వనితయు నవ్విశ్రవసుఁ డగ్నిహోత్ర మొనరించుతఱి నగ్నియును బోలె వెలుఁగ వ్రీడఁ బోనడఁచుచు విలసితాననము తోడన యుజ్జ్వలాత్ముని మ్రోల నిలిచి కంతుని జయలక్ష్మి కరణిఁ జెన్నొందు నంతఁ బౌలస్త్యుండు నయ్యింతిఁ జూచి శ్రోణీభరంబును సురుచిరకాంతి నేణలాంఛన కలితేందుబింబంబు నవ్వు నెమ్మొగమును నలినాక్షి నీవు నెవ్వరికూఁతుర వేది నీపేరు వచ్చిన పనియేమి వామాక్షి యనిన నచ్చెల్వ ముకుళితహస్తయై పలికెఁ బెనుపొంద మా తండ్రి పేరు సుమాలి యనఘాత్మ కైకశి యను కన్య నేను ననుఁ దండ్రి పుత్తెంచె నారాక తెఱఁగు మునినాథ మీచిత్తమునఁ జూడుఁడనిన నత్తెఱంగెల్లను నాత్మలో నెఱిఁగి మత్తేభగమన నీమది కోర్కిఁ గంటి కోమలి ననుఁ బొంది కొడుకుల వడయఁ గామించి వచ్చితిగానఁ గైకొంటి వనిత సంధ్యావేళ వచ్చుటఁ జేసి తనయుల నిచ్చితి దారుణాత్మకులఁ గ్రూరబుద్ధియుతుండుఁ గ్రూరవర్తనుఁడు, గ్రూరుండునగు పెద్దకొడుకందులోన ననవుడుఁ గైకసి యమ్మునీశ్వరుని గనుఁగొని దయదోఁపఁగా నిట్లులనియె ధాత్రిభారకుల నదయచిత్తులను న పాత్రులఁ గృపసేయఁ బాడియె దేవ యనుటయుఁ జంద్రబింబాస్య నీ కూర్మి తనయుల కిద్దఱ తఱిఁ బుట్టువాఁడు హరిపదాంబుజభక్తుఁ డనురాగచిత్తుఁ డురుతరయుశుఁడు మహోజ్జ్వలుఁడగుచు లంకకుఁ బతియునై లలి నీదు కులముఁ గొంకక పాలించుఁ గోర్కులింపార నని విశ్వవసుఁ డాడ నట్లకాకనుచు మనమున సంతోషమంది యాలేమ బాగైన భక్తితోఁ బరిచర్యసేయఁ గాఁ గొంతకాలంబు గడచిన యంతఁ జకితాత్ములై చిత్తచలనంబులేక .......... క్రమమొప్పఁగా నెల్లకాలంబులందు సముఖులై యామునీశ్వరు నాశ్రమంబు చేరువ నొకజమ్మి చెట్టుమీఁదటను బూరిపుంజములచేఁ బొలుచు మందిరము లారంగ రచియించి యందుఁ బెంపొందఁ దారును పుత్రమిత్రసమేతముగను నున్నచో నొకపక్షి యువిద యండములు పన్నుగాఁ బొదుగుచుఁ బాయకున్నంత నా నాతి నాథుండు నతిముదంబలర మానుగా నమృతోపమానంబులైన ఫలరసంబులఁ దెచ్చి పరిపాటి నిడుచుఁ బొలుపార నొకనాఁడు ప్రొద్దుమాపైనఁ దా సమీపమునున్న యాసరోవరము నాసమీరములు నీరాసనం దరుగ నందలి కెందమ్ము లాసౌరభంబు మందమారుతముచే మతి చాల బ్రమసి పెన్నిధిఁ గన్న యాపేదచందమున వన్నెగా తన మనోవాంఛఁ బోఁగ్రోలి మత్తుఁడై యున్నెడ మార్తాండుఁ డెలమి నత్తఱి నస్తాద్రి కరిగె నర్గుటయుఁ గమలంబులెల్ల నొక్కట మోడ్పఁ బక్షి రమణుఁడు పూమందిరములోనఁ జిక్కి వెలువడ లేక నిర్విణ్ణుడై జలజ వలయంబులోపల వర్తించుచుండి యామందిరమ్మున వేమఱుఁ దిరుగు నామార్గమున వేగునంతకుఁ బక్షి కులములు నెలుఁగింపఁ గుముదముల్ మగుడఁ దలకొని చంద్రుఁ డస్తాద్రికి నరుగఁ గమలతో వెస సోఁగకమలంబు లెత్తఁ బ్రమదాబ్ధిలోనఁ దెప్పలు దేలుచుండ నాసమయంబున నాసరోజాప్తుఁ డాసుపర్ణాగ్రజుఁ డటు తేరు గడుప భాసమానోదయపర్వతంబునకు భాసురగతి నేగి భాసిల్లునంత విరిసిన నెత్తమ్మి వెడలి యాపక్షి పరిపక్వమైనట్టి ఫలములు గొనుచు వెఱపును మోదంబు వీడు జోడాడఁ దరుణిమందిరము కంతట నేగుదెంచి కొమ్మని యిచ్చినఁ గొనక నీ వలచు కొమ్మలకే యిచ్చి కోర్కులింపార మనమున బ్రియమైన మాడ్కి నందంద చని సుఖింపుదుగాక చాలు మాకింక నని తూలనాడిన నతివ కాపక్షి ఘనుఁడు నిక్కము దోపఁగాఁ నిట్టు లనియె వనజాక్షి తామరవనము కేనరిగి గొనకొని పూఁదేనెఁ గ్రోలునత్తఱిని ఇనుఁ డస్తమించిన నెల్ల తామరలుఁ గనుమూసినట్టు తక్కక మూయఁబడిన నందొక్క కమలంబు నందుండి వెళ్లఁ బొందుగానకయున్న పొందింతె గాని యితరకాంతలతోడ నిచ్చమైఁ జిక్కి మతిమఱచుట గాదు మసలుట లేదు వలవ దకారణవైరంబు మనకుఁ గలిగిన నవ్వరె ఘనులైనవారు మిన్నక యిట్లాడ మెలఁతరో తగునె యన్న నప్పుడు నవ్వి యల చేనిపంట కొయ్యలు చెప్పెడిఁ గుటిలకుంతలుల సయ్యాటములనైన చందనపంక మొఱపుమై నీమేను నుండఁగా నిట్లు మఱియు నూరార్చె దేమనఁ గలనింక నీ మనసెఱుఁగను నిజమును గల్ల లోమనోహర నీవు నుచితోక్తులింక మానుము నీవన్న మగువరో యిదియు నానీరజపుధూళి యంతియెకాని వారకాంతల కుచద్వయమందునున్న సారంపు మృగమదసారంబు గాదు వారిజసుమముల వాసన గాని వారిజాయతనేత్ర వలదు శంకింప నింత యవిశ్వాస మేటికి నాదు నంతరంగమున నొండరమర లేదు ధారుణి సాక్షి వేదంబులు సాక్షి తారకంబులు సాక్షి తరువులు సాక్షి గా మగువల వాదు కలలోన నంట నోముగ్ధ విడుము నీ వొడఁబడవేని వారక నావిశ్రవసువు దాఁ జేయు ఘోరపాతకము చేకొని చనువాఁడ ననవుడు వెఱగంది యంత నాలేమ వినయోక్తు లెసఁగ నవ్విభున కిట్లనియె నీసదాచారున కీజితేంద్రియున కీసత్యరతునకు నీశుభమూర్తి కీదయాంభోనిధి కీపవిత్రునకు నేదెస వర్తించె నేదోషమనిన నల సుకేశాఖ్యున కాసంశ్రుతికిని వెలయ జన్మించిన విపులప్రతాపుఁ డామాల్యవంతుని యనుజుని పట్టి భామినీమణి యనఁ బరఁగు కైకేసి సంతానవాంఛ నీసంయమీశ్వరుని నంతయుఁ బ్రార్థింప నట్లకాకనుచుఁ బలికె బొంకునఁ గాని భామిని కోర్కి తల కూర్పలేక తద్దయు నున్నవాఁడు ఋతుకాలముల నొక్క ఋతువుఁ దప్పినను గతిలేదు తమ పితృగుణముల కండ్రు తరుణి పుష్పవతియై తక్కియుండఁగను బురుషుఁ డొండూరికిఁ బోవంగఁ దగదు పోయిన దోషంబు పొందెడు నతని కాయంబులోన దుఃఖంబులు పెరుఁగుఁ దమ నివాసముల నెంతయుఁ బ్రేమనుండి తమియెల్ల నావేళఁ దప్పించిరేని యల బ్రహ్మకును భ్రూణహత్యదోషంబు నలవడఁ బ్రాపించునఁట మర్త్యులెంత పదిఋతువులు దప్పె భామినికిపుడు కదియఁడు నాదోషగతి యెంతలేదు అని పక్షి తన ప్రియురాలితోఁ జెప్ప విని సమ్మతించె నవ్విధి తన్ను గుఱిచి యూనిన భక్తితో నున్న కైకేసి పూనిక యెర్గి యప్పుడు విశ్రవసుఁడు తన యాత్మ ఋతువులు దశకంబు నిలిపి గొనకొని యాయింతిఁ గూడెఁ గూడుటయు నంత నానెలఁతయు ననురాగమందెఁ గొంతకాలమునకు గురుగర్భమైన నిడుదకోఱలు మేఘనీలదేహంబు మిడుగుఱుల్ రాలెడి మిడికన్నుఁగవయు నిరువదిచేతులు నీరైదుతలలు నురుతరోష్ఠంబులు నుగ్రతేజంబుఁ గల పుత్రు నొక్కనిఁ గాంచె నాలోనఁ గలయ నెత్తురువాన ఘనరాసి గురిసె నినుని తేజము మాసె నిలఁ జుక్కలురిలెఁ పెనుగాలి వడివలెఁ బృథివి కంపించెఁ మఱియు నుత్పాతముల్ మఱినెల్ల చోటఁ దఱచయ్యె నంత నాతనయుని జూచి యలవడ గుణనామమని విశ్రవసుఁడు తలపోసి యాతని దశకంఠుఁడనియె మనుజేంద్ర యావెన్క మహనీయశీలుఁ డనుపమదుర్జనుఁ డఖిలనిర్దయుఁడు శఠబాహువిక్రమ సమవర్తిసముఁడు కఠినాత్ముఁడగు కుంభకర్ణుని గనియె నప్పుడు దిగ్భ్రముండయ్యె భాస్కరుఁడు చెప్ప నగ్గలముగా సృష్టి వాపోయె కలఁగె పయోధులు కంపించె ధరణి కులగిరుల్ గదలె దిక్కులు వ్రక్కలయ్యె నాకంబు చెదరెఁ బినాకి కంపించెఁ జీకాకుపడియె నాశేషలోకంబు కొఱగాని వేషంబు ఘోరమై తోఁప మఱి శూర్పణఖయను మలినాంగిఁ గనియెఁ బిదపఁ ధర్మాత్ము విభీషణుఁ గాంచి మది ముదంబందె నామత్తేభగమన మఱి సుమాలిని పుత్త్రి మదిరాయతాక్షి వఱలు పుష్పోత్కట వడసె నమ్మౌని కరమర్థి బుత్రార్థి గవయుటఁ జేసి ఖరదూషణాదుల గాంతయుఁ బినస??? కరమర్థిగొని కొంతకాలంబు చనఁగఁ దరుణి యెంతయుఁ బోయెఁ దన మేను దొరఁగి వారంతఁ బెరిఁగిరి వనభూములందుఁ గ్రూరుఁడై చరియించి కుంభకర్ణుండు పరమధర్మాత్ములఁ బట్టి బిట్టల్కఁ బొరి మ్రింగుచుండును భువనంబు లదర రావణుం డఖిలవిద్రావణుండగుచు దేవగంధర్వాది దివిజులనెల్ల గారింపుచును గడుఁ గష్టవర్తనల వారక చరియించువారని కడిమి నిగమశాస్త్రాభ్యాసనిరతుఁడై నియతి జగములౌనన విభీషణుఁడు వర్తించు ఖరదూషణాదులు కడకతోఁ బోయి యరుదైన దండకాటవి నుండిరంత మనుజేంద్ర యొకనాఁడు మహనీయభూతిఁ దనరు పుష్పకమెక్కి తండ్రికి మ్రొక్కి ఘనవీథిఁ జనుదేరఁ గైకేసి ధనదు గనుఁగొని దశకంఠు కడకు నేతెంచి చూచితె మీయన్న సురుచిరతేజుఁ డీచందమున నీవు నెన్నఁ డొప్పెదవు నామనోరథమార నందన యాత్మ నామెయి గైకొనుమయ్య నీవింక ననవుడు తల్లితో నాతఁడిట్లనియెఁ గొనకొని పరమేష్ఠిఁ గోరి మెప్పించి యీతనికంటె నేనెక్కుడు పొలుతు నోతల్లి వత్తు నీడొండె నీతనికి నెమ్మది వగవక నీవుండుమనుచుఁ దమ్ములుఁ దానును దశకంఠుఁ డజుని గడుభక్తితోడ గోకర్ణాశ్రమంబు కడకేగి తపములు గావించిరనిన నేవెంట తపము లందెవ్వరుచేసి రేవరంబులు గాంచి రెఱిఁగింపు మనఘ యనవుడు మునినాథుఁ డవనీశుఁ జూచి విను కుంభకర్ణుండు విమలాత్ముఁ డగుచు మహనీయ పంచాగ్నిమధ్యంబునందు విహితక్రమంబుల వేఁడివేసవుల వీరాసనస్థితి విలసిల్లి వాన వారక నానుచు వానకాలమున నాకంఠజలమగ్నుఁడై ఘోరనియతి చేకొని విడువ కాశీతకాలమున నరుదార నిబ్భంగి నతినిష్ఠఁ దపము చరియించెఁ బదివేలసంవత్సరముల అకలంకమానసుండై విభీషణుఁడు సకలేంద్రియంబులు పరినిగ్రహించి యైదువేలబ్దంబు లవనిపై నేక పాదస్థుఁడై యూర్ధ్వబాహుఁడై మఱియు నైదువేలేండ్లు నుగ్రాంశుఁ గన్గొనుచు సాదరంబునఁ జేసె నత్యుగ్రతపము అతినిష్ఠ దశకంఠుఁ డనశనవ్రతము మతిఁ బూని వేయేండ్లు మసలక సూది మొనమీఁద నిలిచి యిమ్ముగఁ జేతుననుచు ఘనమైన తపము సంకల్పంబు సేసి కమలగర్భుని నాత్మకమలమం దునిచి విమలచిత్తస్థితి వేడ్కతో నిలిచి యాహారతృణ్నిద్రలన్నియు మాని యూహించి నిష్ఠతో నుండె వేయేండ్లు అంతట బ్రహ్మ తన్నాలింపకున్న సంతోషమును బొంది చలము పెంపెక్కి యేకపాదస్థుఁడై యెలమిఁ బెంపొంది చేకొని యిరువదిచేతులు మొగిచి యూనిన నిష్ఠతో నుండె వేయేండ్లు దానికి నాబ్రహ్మ దయఁ జూడకున్న ధరణిపై నర్థితోఁ దలక్రిందుగాఁగ వర్షకాలంబునఁ బడిబట్టబైట శీతకాలంబునఁ జిత్రమౌచుండ లోఁతైన కొలఁకులలోపలనుండి మండువేసవి కారుమంటలు నిగుడ యొండొండ కలిసిన నొడక నిలిచి భానుమయూఖముల్ పైఁ బాఱుచుండ మానైన పంచాగ్నిమధ్యంబునందు నేచి కాలత్రయ మెడపక నియతి నాచరించెను దపమర్థి వేయేండ్లు అంత వారిజగర్భుఁ డాత్మలోఁ దన్ను నెంతయఁ దలఁపక ఝెఱుఁగనట్లున్నఁ దగ హోమగుండంబుఁ ద్రవ్వించి యచటఁ దగిన ద్రవ్యంబులు తానె తెప్పించి నిగమకల్పితతంత్రనిచయంబుతోడ నగణితంబుగ వేడ్క నగ్ని సంధించి పద్మాసనంబిడి పఙ్క్తికంధరుఁడు పద్మజుఁ దన మనఃపద్మమం దునిచి ప్రథమమస్తకముఁ దాఁ బటుగతిఁ ద్రుంచి ప్రథమాహుతియుఁ గాఁగఁ బావకు లోన వేల్చె నధర్వణవేదమంత్రముల వేల్చిన నది గాల్ప వెఱచియుండుటయి నగ్నితోఁ గోపించి యప్పుడు నూఁద భగ్నమయ్యెను దల పావకు లోన నూఱేండ్లకొక తలనూకడగాఁగ మాఱులేకిబ్భంగి మసల నీకదిమి తరిగొని యొక్కొక్క తలఁ గోసికోసి యరుగ్రమ్మి యిటువలె నత్తఱినొకటి తక్కక తొమ్మిది తలలో వేల్చి చిక్కిన తలఁ గోయఁ జేయిచాఁచుటయు నందె మంటలు మింట నాయింద్రపురము నందిన భీతిల్లి యప్పురందరుఁడు నమరులు తను గొల్వ నధికవేగమునఁ గ్రమమొప్పఁ గమలజు కడ కేగుదెంచి యవధారు దేవ దశాస్యుండు నేఁడు తవిలియ నతిఘోరతప మర్థిఁ బూని తలలు తొమ్మిది గోసి తడయక వేల్చి తల యొక్కటియు వేల్పఁ దలకొన్న వాఁడు ఆ తల వేల్చిన నాయగ్ని యెగసి భూతలంబంతయుఁ బొరి పొరిఁ గాల్చు నిగిడి లోకములెల్ల నీఱుగావించు మిగుల నాక్రోశించి మిన్నులఁ బ్రాఁకు వారిజాసన నీవు వచ్చి యాయసుర వారించి వరములు వరుసనీకున్న బ్రహ్మహత్యయు నెంత ప్రబలి లోకముల బ్రహ్మాదిసురలను బాధింపకున్నె యనఘాత్మ వారింపు మాతని తపము నని విన్నపము సేయ నంబుజోదరుఁడు (అంబుజాసనుఁడు ???) మనమునఁ గరుణించి మహితాత్ముఁడగుచుఁ జనుదెంచి సురమునిసంఘముల్ గొల్వ వచ్చి యాదశకంఠు వద్దన నిల్చి యిచ్చెద వరము నీయిష్ట మేమడుగు మనవుడు దశకంఠుఁ డాక్రోశమునను తన తలఁ జూచి యాధాతకిట్లనియె నడిగిన వరముల నర్థితో నాకుఁ గడుఁ గృపనిచ్చినఁ గైకొందుఁగాని దేవత లొగి మెచ్చఁ దివిరి యీశిరము పావకజ్వాలలఁ బడవేల్తుననిన నోవత్స వత్స తెంపుడుగు నీవింక భావింపఁగా నీవు పటుసాహసుఁడవు మెచ్చితిఁ దపము నీ మెడమీఁది వాలుఁ బుచ్చు మేమట వరంబులు వేఁడుమనిన ననురాగమును బొంది యపుడు విధాతఁ గనుఁగొని వినఁతుఁడై కరములు మొగిచి నరవానరాదులు నాకొక్కతృణము సరుకుగాఁ గొన నల్పజంతుజాలములఁ బక్షీంద్రగంధర్వపన్నగదివిజ యక్షరాక్షసదానవాదులచేత సరసిజాసన నాకుఁ జావు లేకుండఁ గరుణించి వరమిత్తుఁ గాక నీవనఘ యడిగెదఁ దెగినచో నా మస్తకములు గడిమినప్పుడు మొల్వఁగా నిమ్మ యొకటి వీఁకతోఁ ద్రిభువనవిజయంబు నాకుఁ గైకొనిభోగింపఁగా నిమ్మ యొకటి యనవుడు నాబ్రహ్మ యగుఁగాక యనుచుఁ గొనకొన్న కృపతోడఁ గోరి యిట్లనియె ననఘాత్మ యీకుండలాకృతి నిప్పు డనయంబు దీపించు నమృత మీనాభి గనుఁగొన నొరులకుఁ గానరాకుండ నొనరించుకుండు మాయొగి నేమఱకుమ అమృతంబు నుండినయంత కాలంబు నమృతత్వమూలమై యాననాబ్జములు మొలపించు నది వోవ మొలవక యుడుగు ననఘ బలోదగ్రయమృత మేమఱకు మని పల్క వరమిచ్చె నంతటిలోన దనుజాధిపతికి నత్తల లోలి మొలచె నంత నాపద్మజుఁ డావిభీషణుని సంతోషమునఁ గాంచి సదయుఁడై పఙ్క్తి వదనుని కిచ్చిన వరములన్నియును ముదమెందఁగాఁ జెప్పి మొగి నిట్టులనియె ననఘాత్మ యీదశానను నాభి నమృత మనలాస్త్రమునఁ గ్రుంకునని యెఱింగించి మఱి నూటతొమ్మిదిమాఱుల దాఁక నరయ సుధాస్పర్శనంబునఁ జేసి మొలచు నత్తలలు నిమ్ముల నటమీఁదఁ దలకొని యతఁ డొంటితలతోన నుండు ననుచు రహస్యంబులైన వాక్యములు వినిపించి యతనితో వేధ యిట్లనియె వరమేమి వేఁడుము వత్స! నీవనుడు వరద నాకెంతయ వాత్సల్యమొప్ప నిర్మలగుణలోలు నెరి గుణశీలుఁ గర్మవిదూరు లోకత్రయాధారుఁ బురుషోత్తమాచ్యుతుఁ బుండరీకాక్షు చరణాబ్జముల భక్తి చాల నాకిమ్ము పడయరానివి లేవు పరమధర్మములు పడయ దుర్లభమైన బ్రహ్మాస్త్రమిచ్చి కమలసంభవ నన్నుఁ గరుణింపుమనిన నమర నారెంటితో నమరత్వమిచ్చి గురుదయాంచితబుద్ధిఁ గుంభకర్ణునకు వరమిచ్చు వేడ్క నవ్వల నేగుదేర ముకుళితహస్తులై ముందట నిలిచి సకలదేతులు నాచతురాస్యు కనిరి వారిజాసన మీరు వరములీవలదు క్రూరాత్ముఁ డగుచున్న కుంభకర్ణునకు వాఁడిమిఁ గడువ్రాలి వరశక్తిలేని నాఁ డుగ్రగతిలేని నందనచరుల నచ్చరలేమల నమరకన్యకల విచ్చలవిడిఁ బట్టి వెస మ్రింగుచుండు మఱియును నరమునిమాంసాశియగుచు వెఱపించు లోకముల్ వీడు సంతతము వరముల నిచ్చిన వాసవప్రభృతి సురలకతఁడు మనశ్శూలంబు గాఁడె మూఁడులోకంబులు మొగిఁ బాఱమ్రింగు వేఁడిమి చూపఁడె వీఁడేపు మిగిలి యటుగాన వరరూపమగు శాపమిచ్చి కుటిలాత్ముఁ డాతని క్రొవ్వార్పవలయు నని విన్నవించిన నవుఁగాక యనుచు వనజాసనుఁడు సరస్వతిఁ దలంచుటయు భారతియును వచ్చి పద్మజు మ్రోల గారవంబున హస్తకమలముల్ మొగిచి పనియేమి నావుడు పరమేష్ఠి వలికె వనజాక్షి నీవెల్లవారి జిహ్వలను గల్గియుండుడు కుంభకర్ణుని జిహ్వ నెలకొని తప్పాడు నీవంచుఁ బనిచి వనజాసనుఁడు వచ్చి వరమేమి వేఁడు కొనుము నీవనిన నాకుంభకర్ణుండు యాఱేసినెలలు నిద్రావస్థనుండి తేఱుట తుదివొక్క దివసంబునందుఁ గలుగంగ నాకిమ్ము కరుణతో ననుచుఁ బలుక నవ్వరమిచ్చిబ్రహ్మ దాఁ జనియె నప్పుడు వాణియు నాకుంభకర్ణు తప్పులు బలికించి తాఁ బాసి చనఁగ నీమాట నానోటి కేలొకో వచ్చె నేమని వేఁడితి నీవరం బకట యిరవంద నిది మున్ను హృదయంబులోనఁ గరమర్థి దలఁచిన కార్యంబు కాదు పరికింప దైవంబు ప్రతికూలమవుట వెరవేది నాకోర్కె విపరీతమయ్యె ననుచు విచారింప నంత రావణుఁడు తనరు తేజముతోడ దండముల్ గొనుచు ననుపమశ్లేష్మాతకాహ్వయంబైన వనములోపలి కేగి వర్తించుచుండ వారిజాసనుచేత వరములు వడిసి వారు వచ్చుట విని వసుమతీస్థలికిఁ బాతాళముననుండి పరివారసహితుఁ డై తనూజులు మంత్రులగు విరూపాక్షు శూరోత్తముని ప్రహర్షుని మహోదరుని మారీచుఁ గొనుచు సుమాలి యేతెంచి పౌలస్త్యపుంగవుఁ బఙ్క్తికంధరుని నాలింగనముఁ జేసి యతనితో ననియె ఘనుఁడ చిత్తంబునఁ గల మనోరథము లనువార సిద్ధించె నధికభాగ్యమున వ్రాలు తేజంబున వరములు వడసి తీలోకమున నీకు నెదురెవ్వరింక వినుచు విష్ణున కేము వెఱచి పాతాళ మున కేగితిమి భయంబున లంక విడచి యసమానవిక్రమ యావిష్ణు వలన నెసఁగిన భయము మాకిటమీఁద లేదు బహుకాల మీలంక పాలించినాము మహిమతో మేమున్న మన పట్టణంబు నెలకొని సొంపార నీయన్న ధనదుఁ డెలమి నప్పుర మిప్పు డేలుచున్నాఁడు పరఁగ నెయ్యము మున్ను పాటించి యడుగు పరిహరించిన లంక బలిమిఁ జేకొనుము లంకాధిపత్యంబులం బొందు నీవు కొంకక రాక్షసకుల ముద్ధరింపు మాకు రాజవు నీవ మఱి దిక్కు నీవ కైకొని పాలింతుగాక నీవనిన నతనితో రావణుండనియె వైశ్రవణుఁ డతులతేజుఁడు నాకు నధికమాన్యుండు పితృసమానుఁడు గాఁడె పెద్దవాఁడెందు హితమైనఁ దగునె మీకిట్లాడ ననుచుఁ ద్రోచి పుచ్చిన ప్రహస్తుండును నవస రోచితంబగు వాక్య మొక్కటిఁ బలికెఁ దలఁపక దశకంఠ తగునె యీపలుకుఁ బలుక శూరులకు సౌభ్రాత్రమెక్కడిది యక్కయుఁ జెల్లెలు నగువారు గారె యక్కశ్యపుని పత్ను లదితియు దితియు నన్నదమ్ములు గారె యన్యోన్యశత్రు లన్నెలంతల పుత్రులగు సురాసురులు వనశైలసాగరవతియైన వసుధ తనర గశ్యపునకై దైత్యులేలఁగను వారి నాలములోన వధియించి విష్ణుఁ డారంగఁ ద్రైలోక్య మమరుల కీఁడె దేవాసురులకైనఁ దెఱఁగు చింతించి నీవు గైకొను రాజనీతిమార్గంబు నని పల్క మదిలోన నాదశాననుఁడు ననువుగా నూహించి యౌఁగాక యనుచుఁ బలికె నిశాచరబలముతోఁ గూడి యలరి యప్పుడు త్రికూటాద్రికి నరిగి యెలమిఁ బ్రహస్తుని నీక్షించి పలికె నలఘువిచార నీవర్థేశు కడకుఁ బ్రియమారఁ జని యాకుబేరునితోడ నయశాలివై పల్కు నాపల్కు గాఁగ ముదమున నీలంక మొదలు సుమాలి మొదలైన రాక్షసముఖ్యులుండుదురు మావారి పురమిది మాకు నీవిచ్చి పోవుట తగవని పొందుగాఁ బలుకు మనఁ బ్రహస్తుం డేగి యామాటలెల్ల వినిపింప నతనితో విత్తేశుఁడనియె విను రాక్షసులు లంక విడచిన పిదపఁ దనర నిందున్నాఁడఁ దండ్రి పంపునను మానుగా నేను సమస్తరాక్షసుల దానవనాథులఁ దగ సత్కరించి యీలంక యేలితి నిది నాకుఁ దనకుఁ బోలంగ నూహింపఁ బొత్తులపురము తగవుతో నీలంక తనకును నేల నగునంచుఁ బల్కి యాతని వీడుకొల్పి చని విశ్రవసునకు సద్భక్తి మ్రొక్కి ధనదుఁడు నప్పుడాతండ్రితో ననియెఁ దనరారు నీలంక తన పురంబనుచు ననఘాత్మ దశకంఠుఁ డడుగఁ బుత్తెంచె నేమి యానతి నాకు నిటమీఁద ననుడు నామహాఘనతేజుఁ డతనితో ననియె నీ లంకఁ గొనియెద నేనంచు నతఁడు పౌలస్త్య నాతోడఁ బలమాఱుఁ జెప్పెఁ జెప్పినఁ గోపించి చెడ విచారించి యొప్పఁగావలవ దీయుద్యోగమనిన వరగర్వమునఁ జేసి వాఁడు నామాట సరకు చేయకపోయెఁ జండకోపమున నీవింక నాలంక నిలువఁగ వలదు వేవేగ బలసమన్వితుఁడవై వెడలి చారుసంపదలతో సామగ్రి మెఱసి గారవంబున రమ్ము కైలాసగిరికి నందు భానుప్రభ నమరు హేమార విందదళీయుత విమలోరుకమల యనుపమసారసహంసనాదములఁ దనరారుచున్న మందాకిని గలదు కిన్నర గంధర్వ గీర్వాణవరులు చెన్నార నప్సరస్త్రీలును నందు కమలకల్హారాది గంధవాసనల నమరు సైకతముల నాడుచుండుదురు వరగర్వితుండైనవానితో వైర మరయ నీకేటికి ననఁ గుబేరుండు తనయులఁ గాంతలఁ దగ మంత్రివరుల నొనరంగ భృత్యుల నోలిఁ బౌరులను వరరత్న కాంచనవాహనాదులను వెరవారఁగాఁ గొని వెడలి వే చనియె ధనదుఁ డేగినవెన్కఁ దత్పురం బొప్పెఁ గనకనానారత్నఖచితసాధముల??? నంత దశగ్రీవుఁ డనుజులుఁ దాను సంతోషమును బొంది సచివులతోడ బహురత్నతోరణ బహుకేతునికర మహనీయవీథుల మహిమఁ గన్గొనుచు భటభుజార్గళహేతి బహువిస్ఫులింగ పటలంబు దినకరప్రభల గీట్పరప విలసిల్లు లంకాప్రవేశంబుఁ జేసి, యలరి ప్రహస్తుని యనుమతంబునను బరఁగ లంకారాజ్యపట్టాభిషేక మిరవందఁ గైకొని యెలమి శోభిల్లె ధనదుఁడు నటయంతఁ దండ్రివాక్యమున ననువంద రజతాద్రి కరిగి తానచట నమరేంద్రుపురికంటె నభిరామలీల నమరంగ రచియించె నలక యన్పురము నాపురంబున రాజ్య మర్థితో ధనదుఁ డేపారఁ జేయంగ నిట లంకలోన దశకంధరుండును దమ్ములతోన విశదంబుగా నర్హవిధి విచారించి యెలమి విద్యుజ్జిహ్వుఁ డీశూర్పణఖకుఁ దలపోసి చూడఁగాఁ దగు వరుండనుచు నమరఁ బెండిలిసేసె నంతటమీఁద రమణితో మృగయాభిరతి నొక్కనాఁడు దిరుగును వనభూమి దితిసూను మయుని దరలాక్షి నతని తనయ నీక్షించి యీ వనంబున జను లెవ్వరు మెలఁగ రీవేల వర్తింతు వీయింతితోడ ననిన నామయుడంత నతని వీక్షించి తనదు వృత్తాంతమంతయుఁ జెప్పఁ దొడఁగె యామినీచరనాథ యాకశ్యపునకు భామయౌ దితికిని బ్రభవించినాడఁ నే మయుఁడనువాఁడ హితబుద్ధితోడ యామినీచరనాథ యమరులు నాకు హేమనా నచ్చర నిచ్చి రేనందుఁ బ్రేమతో నిచ్చినఁ బ్రీతిఁ గైకొంటి మఱవక వేయేండ్లు మన్మథసుఖము పరమానురక్తిమై పాటించుచుండఁ బదునాలుగేండ్లకు భామావియోగ మది దైవగతిఁ గల్గె నంత నేనలసి నాహేమ వర్తించు నాహోమగృహము లోహేమకై వగ లుడుపంగలేక పరమతపోవృత్తిఁ బరమేశుఁ గూర్చి యరయ సంతానేచ్ఛ నర్థితోఁ జేయ గరళకంధరుండంతఁ గరుణించి నాకు వరరూపవతియైన వామాక్షినిచ్చె నరయ మందోదరి యనఁదగినట్టి పేర నొప్పుచునున్న పువ్వులబోఁడిఁ గమనీయకాంతి నిక్కన్యక ననిన నమరకంటకుఁ డంత నాశ్చరమంది యనఘాత్మ నీకన్య నాసదాశివుఁడు గొనకొని నీకెట్లు కూఁతుగా నిచ్చె వినిపింపు మనవుడు వేడ్కతో ననియె ఘనభుజుఁడగు పఙ్క్తికంఠుతో మయుఁడు తలకొని హిమనగాత్మజ యొక్కనాఁడు యలర మై మర్దనఁ మర్థి గావించి దేహపంకంబెల్లఁ దెఱఁగొప్పఁ బెట్టి యూహింప నరుదైన యొప్పగు వనిత రూపంపు సౌభాగ్య రూపురేఖలను నోపిక తోడుత నొకబొమ్మఁ జేసి పరమేశునకుఁ జూపి ఫాలాక్ష దీని కిరవంద నాయువు నేపార నొసఁగి సమరోర్వి నమరుల సాధించునట్టి యమితబలోదగ్రుఁ డగువాని కిమ్ము అనవుడు హరుఁడప్పు డౌఁగాక యనుచు ననయంబుఁ గరుణించె నంతట నదియు నజరామరత్వంబు నతిరూపు నగుచు భుజగకంకణు మ్రోలఁ బొలుపార నిలువ నరయ మందోదరి యను నామమిచ్చి కరమర్థి నాయింతి గనుఁగొని మదిని నంగజహరుఁడంత నతికాముఁ డగుచు నంగజసుఖలీల ననుభవించుటయు నమరెడు గర్భంబు నగుట దాఁ జూచి పురహరుతోఁ గోప మొదవ నిట్లనియె నిరుపమంబగుచున్న నీపేర్మి దూలి పరకాంతఁ గలసితి పాతకంబనక నశుచిత్వకారణ మటుమీఁదఁ గలుగఁ బశుబుద్ధి యిది దేవ భావింపవైతి విదియు నానేరమ యెసఁగిన తెరవు నదయత నిను దూర నదిపనిలేదు ఇంక నీరూపంబు నిట్లుండెనేని పంకజాక్షిని నీవు పాయంగ లేవు గాన నీరూపు నీకాంతకు వలువ దా నేరమె చాలు నట్లయిన దాని నైన మండూకమై యమరఁగా నీయు మనవుడు శివుఁడంత నట్ల కావింప వెరవుగా మండూకవేషంబుఁ దాల్చి యిరవుగా నున్నంత హిమశైలసుతయు భూతేశ తొల్లింటి పుణ్యరూపంబు నేతెఱంగునఁ గల్గు నిటమీఁద ననిన నంతటఁ గరుణించి యాపినాకియును నింతితో వెఱవొప్పు నిట్లని పలికెఁ గొంతకాలమునకుఁ గువలయంబునను సత్యర్షి మయుఁ డని జన్మించి తనకు సంతతి వేఁడ నిచ్చటికి నేతేర నంతట నిన్నిత్తు నతని కాత్మజగ సంతోషమునఁ జేసి వ్రాలుచునుండు వరుఁడు రావణునకు వనితవు గమ్ము ఆ వరగర్భంబునందు జన్మించు నావరవరుఁడు దా నమరుల గెలిచి తరువాత రఘుకులోద్భవుఁడైన రామ ధరణీంద్రు ననుజు చేతఁ జగముల్ బొగడ మృతిఁ బొంది లక్ష్మిసమేతుఁడౌ వాని గతివేగఁ, గనువాఁడు కమలాయతాక్షి యనవుడు మండూకమై యుండె నదియు గొనకొని పదివేల ఘోరవర్షములు నంతట నీవును నావిశ్రవసున కెంతయుఁ బ్రియమార నెలమి జన్మించి తేనును జనుదెంచి యీశు సర్వేశు మానని భక్తి నా మనమున నిలిపి పుత్రార్థినై తపంబొనరింప శైల పతిజావిభుండు నీపొలఁతి నాకిచ్చె నిచ్చినఁ దోడ్కొను చేను నాపురికి వచ్చిన నొకనాఁడు వాత్సల్యమొప్ప నారంగఁ బ్రార్థించి యడుగ నవ్విధము నీ రూపమెల్లను నీ పుత్రి నాకుఁ బరమపరిజ్ఞానభావదానగుట నరయంగఁ దన తెఱంగంతయుఁ జెప్పె నటుగాన నీసాధ్వి నమరులకంటెఁ బటుతేజ మమరత్వ భాతిఁ జెన్నొందె వరుఁడు నీకన్యకు వలయుటఁ జేసి వరు నిన్నుఁ గూరిచి వచ్చినవాఁడ నాఁడుబిడ్డఁలఁ గన్న యటుమీఁద నెట్టి వాఁడు వాడిమి చెడవలయు నన్యులకు నందనులిరువురు నాకు మాయావి దుందుభులనఁగ నుద్ధురపరాక్రములు నని చెప్పి నీ తెఱంగంతయుఁ జెప్పు మనిన నమ్మెయిఁ జూచి యాదశాననుఁడు లలితమై యొప్పు పులస్త్యు వంశమున నెలమిఁ బుట్టినవాఁడ నే దశాననుఁడ నని పల్క విని కూఁతు నతని కీఁదలఁచి మనమున సంతోషమగ్నుఁడై మయుఁడు ఆపఙ్క్తికంధరు హస్తంబుఁ బట్టి యీపంకజానన నిచ్చితి నీకుఁ బౌలస్త్యకులవర్య పత్నిగా నింక నీలేమ వరియింపు మింపుసొంపార నమర మండోదరియనఁగ నీవికచ కమలాస్య ననుడు నక్కన్య నీక్షించి లక్షణరూపాదులకు మెచ్చి యగ్ని సాక్షిగా వరియించె సమ్మదం బలర నేశక్తి సౌమిత్రి నిలఁ గూలనేసె నాశక్తియును గాంచె నమ్మయుచేత బలపరాక్రమశాలి పఙ్క్తికంధరుఁడు లలనాసమేతుఁడై లంక కేతెంచి బలి మన్మరాలైన పద్మాయతాక్షి యలరు వహ్నిజ్వాలయనుదానిఁ దెచ్చి వర్ణింపఁదగిన వివాహంబు కుంభ కర్ణున కొనరించెఁ గడుసమ్మదమున సరమ యన్ కన్యక శైలూషుఁడనగఁ బరఁగు గంధర్వాధిపతిపుత్రిఁ దెచ్చి సముచితస్థితి సర్వసామగ్రితోడ నమరఁ బెండిలిసేసె నావిభీషణున కంత నాపౌలస్త్యు లతివలుఁ దారు నెంతయుఁ బ్రియమున హృదయంబు లలరఁ దగ నందనమున గంధర్వులఁ బోలె నొగి వినోదించుచునుండి రంతటను నిల నింద్రజిత్తని యెవ్వాని జనులు పిలుతురెప్పుడు నట్లి పృథులవిక్రముని శితకంఠు వీర్యవిశేషంబువలన సుతుని మండోదరి సొంపారఁ గాంచె నతఁడు జన్మించిన యప్పుడు ధాత్రి ధృతిఁ దూలి యదరె నాదివిజులు బెదర నురుతరమేఘంబు లుఱిమిన భంగిఁ పురజనంబులు భీతిఁ బొంది యేడ్చుటయు నందనునకు మేఘనాదుఁ డన్నామ మందంబుగాఁ జేసె నాదశాననుఁడు నగరిలో నామేఘనాదుఁడు నంత నొగినాఁడు నాఁటికి నొదవంగ నచట నిమ్ముల మును బ్రహ్మ యిచ్చిన నిదుర క్రమ్ముటయును గుంభకర్ణుండు వచ్చి నన్ను నిద్దరం దశాననుఁడ! బాధించు చున్నది నాకుండ నొకయిల్లు వలయు ననవుడు దశకంఠుఁ డపుడు తక్షకులఁ బనిచె ననేకుల బహుశిల్పవిదుల వారును వెస నేగి వరచిత్రరచన లారంగఁ దమ నేర్పులందంద మెఱసి తారాచలోన్నతిఁ దనరారి లోన మేరుగుహాంతరమితి నొప్పు మిగిలి వివరింప బారల వెలుపారు నూఱు లవి మూఁడువేలును నన్నూరు నిడుపు గలిగి సముజ్జ్వలఘనలీలఁ దనరి లలి రత్నతోరణాలంకృతం బగుచు హాటకరత్నమయస్తంభతతులఁ బాటిల్లు మణిసాలంభజికావళులు రమణీయబహురత్నరచితవేదికలుఁ గమనీయగతి నొప్పఁ గట్టిరి గృహము నక్కుంభకర్ణుండు నమ్మందిరమునఁ బెక్కువేలేండ్లును బెనుమబ్బు గవిసి నిదురఁ బోవఁగ లంక నిచ్చలు పఙ్క్తి వదనుండు వెలువడి వసుధఁ గ్రుమ్మరుచు సురల భూసురల యక్షులఁ బన్నగులను బొరివెట్టి చంపుచు భువనముల్ బెదర నందనోద్యానాది నానావనంబు లందుఁ జరించుచు నధికదర్పమున నాఁకలే కేపారు ననిలుండు పోలె వీఁక వృక్షంబులు విఱిచి వైచుచును మదపుటేనుఁగు భంగి మట్టిమల్లాడి నదులు గోరాడుచు నలిరేగి మఱియుఁ జటులవజ్రముఁ బోలె శైలశృంగములఁ బటుభుజార్గళమునఁ బగులవేయుచును బుడమిపైఁ గలయట్టి పుణ్యాశ్రమంబు లెడపక చెఱుపుచు నిబ్భంగిఁ దిరుగ దశకంఠుఁ డటు జగద్బాధకుండగుట విశదంబుగా విని వెసఁ గుబేరుండు తన తమ్ముఁడైన యాదశకంధరునకు నొనర బుద్ధులు సెప్ప నొగిఁ బంప దూత చనుదెంచి యతఁడును సంతోషమెసఁగ మును విభీషణుఁ గాంచి మొగిఁ బూజ వడిసి ధనపతి కుశలంబుఁ దక్కిన బంధు జనుల సేమంబులు సకలకార్యములు నలర విభీషణుఁ డడుగంగఁ జెప్పి వలఁతియై యెఱిగించె వచ్చిన పనులు నంత దశగ్రీఁవు డధికతేజమున నెంతయ నలరి కొల్విచ్చియుండఁగను సమ్మదమ్మున విభీషణుఁడు తోడౌచు నిమ్ముల మొఱఁబెట్ట నెలమి మ్రొక్కుచును విత్తాధిపతి దూత వినయంబుతోడ దత్తావధానుఁడై దశకంఠుఁ జూచి తగ లోకవార్తలు దడవుచో సమయ మగుటయు ముకుళితహస్తుఁడై పలికెఁ బ్రీతి మీ యన్న కుబేరుండు నన్ను దూతగాఁ బుత్తెంచె దోషాచరేంద్ర మీ కులంబునకెల్ల మేలైన పలుకు లాకుబేరుఁడు సెప్పుచున్నాఁడు వినుము పెక్కనాచారముల్ పేర్చి కావించి తెక్కుడుముదముతో నేఁచితి సురల నందనవనతరుల్ నఱిముఱి విఱిచి తందంద బాధించి తఖిలసంయముల కులములన్నియు నొక్కకులముగా బలిమిఁ గలఁచి తెంతయు నన్నుఁ గైకొనవైతి వెఱుఁగక పిన్నవాఁడెంత చేసినను నెఱి బుద్ధిసెప్పుట నీతి పెద్దలకు నీయనాచారంబు లిటమీఁదనైనఁ జేయక ధర్మంబుఁ జేకొని నడువు చెడుత్రోవ వల దేనుశివునకుఁ దొల్లి తడయక తుహినాద్రిఁ దపము సేయఁగను పరమేశు తోడ నాపార్వతీదేవి చరియింపుచుండ నాచంద్రశేఖరుని వఱలంగఁ జూచుచో వామనేత్రమున నెఱుఁగక పొడగంటి హిమశైలపుత్రిఁ దడయక నాకన్ను దగ్ధమై చూడఁ గడునొప్పు దూలి పింగళవర్ణమగుడు నంత నక్కడనుండ కందు వేఱొక్క వింతయాశ్రమమేను వెస నాశ్రయించి యచటనె నూఱేళు లాహారముడిగి యచలితస్థితిఁ దప మాచరించుటయుఁ గామారి మెచ్చి నాకడ కేగుదెంచి యీమహాతపము మున్నేఁ జేసినాఁడ నీవు గావించితి నిష్ఠతో నిప్పు డీవెంట సిద్ధింప దింక నన్యులకు జగముల నాతోడ సఖ్యంబు నీకు తగు నటుగాన మత్సముఁడవు నీవు కడు నుగ్రగతి నద్రికన్యాప్రభావ మడరి నేత్రము దగ్ధమైనది గాన నేకపింగాహ్వయ మింకలోకముల నీకొప్పునని నన్ను నీలకంధరుఁడు నిరుపమదయఁ జూచి నిజనివాసమున కరుగంగ నట నేను నలక కేతెంచి వరగర్వమున నీవు వారిలోకములఁ దిరిగి యేఁచుటలెల్లఁ దెల్లంబు వింటి నీచేతఁ బడిన యానిర్జరుల్ మునులు వేచి నీచెడుత్రోవ వెదకుచున్నార లని చెప్పుమనియె మీ యన్న వాక్యములు వినిన మేలగు నీకు విందుగాకనిన భ్రుకుటి రేఖాభీలభూరిఫాలముగ వికటనేత్ర స్ఫురద్విస్ఫులింగముగఁ గని సభ కంపింపఁ గరములు చఱచి కొని మొగంబులు బాదుకొని రోషమునఁ చిటులు మంటలు మేను చెమరింప నోష్ఠ, పుటములు గటములుఁ బొరిబొరి నదరఁ బరుషస్వరంబునఁ బలికె నిట్లనుచుఁ దిరముగాఁ జెప్పితి తెలియంగ వింటి నినుఁ బట్టి చంపెద నిన్ను నాకడకుఁ బనిచిన ధనదునిఁ బట్టి చంపెదను శివునితో సఖ్యంబు చేసితిననుచు నవమారఁ బుత్తెంచె నగుఁగాక నేమి యిది నాకు నెంతయు హితవుగాకునికి మదిలోన నెఱుఁగుదు మఱవనీమాట పితృసమానుఁడు నాఁకు బెద్దవాఁడగుట నితని సైరించితి నింతకాలంబు నాలంబులోన నేనతనితో లోక పాలుర నందఱ భజింతుననుచు నలుకతో వాలెత్తి యాదూత వ్రేసి బలి రాక్షసులకును భక్షింపవైచి పుణ్యాహవాచనపూర్వకంబుగను బుణ్యఘోషములతోఁ బొలుచు తేరెక్కి మూఁడులోకంబులు మునుమిడి గెలుతు వాఁడిమి నను గెల్చువాఁడెవ్వఁ డనుచు నతను బలోదగ్రుఁడగు మహోదరుఁడు నతిఘోరవిక్రముఁడగు ప్రహస్తుండు సొరిది మారీచుండు శుకుఁడు సారణుఁడు నరిభయంకరుఁడు ధూమ్రాక్షుఁ డన్వాఁడు సచివులార్వురితోడఁ జనుదేరఁ బెక్కు లచలముల్ నదులు మహారణ్యములును దప్పక యొక ముహూర్తంబునఁ గడచి శివుఁడు పార్వతితోడఁ జెలఁగుచునున్న కైలాసశిఖరంబు కడకేగి కడిమి వ్రాలువీరుల యక్షవరులఁ దోలుటయు వారు నగ్గరిపైకి వడినేగి ధనదు నారంగ నటు గాంచి హస్తముల్ మోడ్చి ఘోరరాక్షసులను గొని రావణుండు వారక కడిమి దుర్వారుఁడై పేర్చి నీతమ్ముఁ డేపున నీతోడ సమర మాతతగతిఁ జేయ నరుదెంచినాఁడు అనిన గుబేరుఁ డయ్యక్షులఁ జూచి యని సేయుఁ డని పంచె నంత నెంతయును నతులవిక్రములైన యక్షరాక్షసుల కతిభయంకరమైన యాహవంబయ్యె నానిశాచరమంత్రు లార్వురు నపుడు నానాశరంబులు నాటి తూలుటయుఁ జాల నొచ్చిన తన సైన్యంబుఁ జూచి పౌలస్త్యుఁడును దిశల్ వగుల నార్చుచును మహిమతో నడువ నమాత్యు లార్వురును బహుసహస్రములతో బవరంబు సేయ దెసలు గప్పిరి లసద్విపుల శక్తులను ముసలంబులను ఖడ్గములఁ దోమరముల నోలి నొప్పించుచు నొక్కింత పోరఁ గాలదండముఁ బోలు గదఁ బుచ్చుకొనుచు వాయువుచే నేఁచి వరవహ్నిఁ బట్టి పోయిన యడవులు పొరిఁ గాల్చు భంగి రాక్షసేంద్రుఁడు పేర్చి రణభూమిలోన యక్షుల సమయించి యందందఁ గదిసి యామహారథముఖ్యులగు నమాత్యులను భీమాట్టహాసముల్ బెరయంగఁ జేసి పఱతెంచి యయ్యక్షబలముతోఁ బొడువఁ తఱుచుగాఁ గొందఱు ధరపైనఁ బడిరి పెనుకిన్కఁ గొందఱు పెదవులు గఱచి కొనుచునుండిరి తమకొలఁది కాకున్న నొదవిన భీతి నాయుధములు వైచి యొదుఁగుచుఁ గొంద ఱొండొరులపైఁ బడిరి యంత నారసములు నాహవగతుల నంతకంతకు నిండె నాకాశపథము ధనదుఁడు నప్పుడు తన సేన విఱిగి చనుదేరఁ గనుఁగొని సంభ్రమించుచును జండవిక్రముఁడైన సంయుగకంట కుండాదిగా నాయకుల నెల్లఁ బనిచెఁ కడిమితో సంయుగకంటకుండంతఁ దొడరి రాక్షసులతో దురము సేయుచును మారీచు నొప్పింప మఱి మూర్ఛనొంది యారాక్షసుండును నప్పుడు దెలిసి యలుకతో నని సేయ నాతఁడు విఱిగె బలువడిఁ బరవంగఁ పఙ్క్తికంధరుఁడు కనకచిత్రితరత్నఖచితంబు నగుచుఁ దనరు నప్పురవరద్వారంబుఁ జొచ్చి నగరివాకిట కేగ నడతెంచి యచటఁ దగు నూర్యుభానుఁడన్ దౌవారికుండు నిలుపంగ నిలువక నిర్జరారాతి బలవంతుఁడై పోవఁ బరుషరోషమున నమితబలుండగు నత డద్రిశృంగ సమమైన తోరణస్తంభంబుఁ బెఱికి వ్రేసె నక్కంబంబు వెసఁ బుచ్చుకొనుచుఁ నాసూర్యభాను రూపణచె రావణుఁడు నాయుగ్రవిక్రమోదగ్రత కంత నాయుధంబులు వైచి యక్షులందఱును నగగహ్వరములకు నదులకుఁ బాఱి బెగడఁ జొచ్చిన నాకుబేరుండుఁ జూచి బలవంతుఁడగు మాణిభద్రుఁడన్వాని నలయుచుఁ గనుఁగొని యతనితో ననియెఁ బాపాత్ముఁ డగుచున్న పఙ్క్తికంధరుఁడు నేపున నిటవచ్చి యెంతయుఁ గడిమి దీపింప యక్షులఁ దివిరి చంపెడెని యాపాపవర్తను నట నేలఁ గూల్చి నతిభీరులగుచున్న యాయక్షులెల్ల పవి నీవై పోయి పరిమార్పుమనినఁ నక్షీణవిక్రములగు నాల్గువేలు యక్షవీరులతోడ నతఁ డేగుదెంచి యాలంబు సేయంగ నతిఘోరలీల నాలోన నందఱు నాయక్షవరులు ఘోరముద్గరములు కుంతముల్ గదలు తోరంపు శక్తులు తోమరంబులును ముసలాయుధంబులు మొగిఁ బూని సమర మసమానగతిఁ జేసి యరులఁ దోలుటయు నావిక్రమంబున కలిగి నిర్జించి వేవుర యక్షుల వెసఁ బ్రహస్తుండు పరువడిఁ బురముపైఁ బడ మహోదరుఁడు కరమల్క వేవుర గదపాలు సేసె నంతలో ధూమ్రాక్షుఁ డని ఱెప్పవెట్టు నంతలో యక్షుల నారెండువేల మడియించినది చూచి మాణిభద్రుండు తడయక ధూమ్రాక్షుఁ దలపడ నతఁడు వడి ముసలంబెత్తి వక్షంబు వ్రేయఁ గడు నొచ్చి వాఁడును గద ద్రిప్పి వైచె నురుగదాహతి మూర్ఛనొంది యాతండు ధరణిపైఁ బడఁ జూచి దశకంధరుండు చండకాలానల చటులరోషమున మండి పై నడవ నమ్మాణిభద్రుండు వడి మూఁడుశక్తుల వైచె వైచుటయుఁ గడునల్క నీతఁడు గదఁ బుచ్చుకొనుచు వెస వాని మకుటంబు విఱుఁగవేయుటయు నసమానభుజశక్తి నంతనుండియును మాణిక్యరుచిరోరుమౌళిభంగమున మాణిభద్రుఁడు పార్శ్వమౌళినాఁ బరఁగి యటు భంగమునఁ బొంగి యతఁడు రాక్షసులు పటుతరధ్వని నిల్వఁ బాఱెఁ బాఱుటయు నధికుఁడై దశకంఠుఁ డప్పద్మశంఖ నిధులతో నొప్పుచు నిఖిలపుణ్యములు దనరంగఁ బెంపారు ధనదునిఁ గాంచ ధనదుఁడు ననియె నాదశకంఠుతోడ |