| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
భీషణగతి దిశల్ భేదిల్ల నార్చి పాషాణనగరంబుపై నెత్తిపోయి విలసితనవరత్న వివిధచిహ్నములు వెలయు తోరణములు విలసిల్లుదానిఁ బసిడికంబంబులఁ బస మీఱుదాని .......... ఘటితవజ్రోపలకాంతి చెన్నొందు పటికంపు సోపానపఙ్క్తులదానిఁ బ్రణుతవేదికలును భద్రపీఠికలు మణికింకిణులు గల్గి మానైనదానిఁ జంద్రప్రభాజాల చారుశిల్పముల నింద్రుమందిరముతో నెనవచ్చుదాని నారంగఁ గనుఁగొని యత్తెఱంగెల్ల నారయు బుద్ధిఁ బ్రహస్తు నీక్షించి యివ్విధంబున నొప్పు నిమ్మహాసదన మెవ్వరి నిలయమో యెఱిఁగి రమ్మనిన నరిగి తల్వాకిట నాతఁ డెవ్వారి నరసి కానక చొచ్చి యాఱువాకిళ్లు చూడని గతి జనశూన్యంబులగుట నేడవవాకిలి కేతెంచి యచట నిండుదేహప్రభుల్ నిగుడంగఁ గిరణ మండలావృతుఁడైన మార్తాండు కరణిఁ బొలిచి వెల్గెడు నొక్కపురుషునిఁ గాంచి యలుకతో నతఁడట్టహాసంబు సేయ నొలయు భయంబున నొడలి రోమములు నిలువంగఁబడి తాల్మి నిలుపంగలేక మదిలోన శంకించి మరల నేతెంచి త్రిదశారిఁ గనుఁగొని దేవ నేనరిగి వడి నిర్జనములైన వాకిళ్లు గడచి తడయక సప్తమద్వారంబునందు భూరితేజునినొక్క పురుషునిగాంచి వా రని భయమున వచ్చితిననిన విని పుష్పకము డిగ్గి వింశతిభుజుఁడు తనరు నవ్వాకిలికి తానేగి చొరఁగ ననలాగ్రజిహ్వయు నరుణనేత్రములు నిరుపమద్యుతులచే నెగడు నాసికయు వినుతబింబద్యుతి వెలుఁగు నోష్ఠంబుఁ దనరారు హనువులు ధవళదంతములుఁ గనలు పెంగోఱలు కంబుకంఠంబుఁ .......... నున్నతఘోణంబు నూర్ధ్వరోమములుఁ గన్నుల కతిభీతి గావించు నొడలు నురులోహ ముసలము లొప్పు నప్పురుషుఁ డరుదార జంకెతో నడ్డమై నిలువఁ గడుభీతిఁ జిత్తంబు గలఁగంగ మేను వడఁకంగ రోమముల్ వడి నిల్వఁబడఁగఁ దన ఘోరరూపంబుఁ దప్పక చూచి తనరఁ జింతించు నాదశకంఠుఁ జూచి నలవుమైన రాక్షస నాతోడనైన .......... కయ్యంబు సేయుదుగాక నీవిట్లు కయ్యంబునకు వచ్చి కంపింపనేల పటువిక్రమంబునఁ బరఁగు రావణుఁడ వటు నీకు భయరోమహర్షణంబేల ననవుడు రఘువర యామాట కతఁడు మనమున ధైర్యంబు మానుగా నిల్పి యుద్ధంబు బలితోడ నొనరించు బుద్ధి నుద్ధతి వచ్చితి నుచితమింకేది యది సేయువాఁడ నేననిన నాఘనుఁడు మది విచారించి యామాట కిట్లనియె నలరుపెంపున దానవాధీశుఁడైన బలిలోన నున్నాఁడు పరికింప నతఁడు సురుచిరాంగుఁడు దానశూరుఁడు విప్ర గురుజనప్రియుఁడు దుర్గుణవిరుద్ధుండు బాలార్కతేజుఁడు బహుగుణార్ణవుడు కాలదండాభీల కాలసన్నిభుఁడు సమరదుర్వారుండు సమరశూరుండు సమరైకవిజయుఁడు సమరదుర్జయుఁడు వినుతసత్త్వుఁడు మహావీరుఁడు శత్రు జనదీప్తిరోషుఁడు సత్పరాక్రముఁడు ననిమిషదైత్యసంఘాదులవలన ననిశంబు నిర్భయుండై యున్నవాఁడు అట్టి యాబలితోడ నని సేయుఁ దలఁపు పుట్టెనేనియుఁ వేగఁ బొమ్మన్నఁ బోయెఁ బోయిన దశకంఠుఁ బొడఁగాంచి బలియు నాయతధ్వని నట్టహాసంబుఁ జేసి పోలంగఁ దలపోసి పొలుచు హస్తమునఁ బౌలస్త్య రమ్మని పట్టిరాఁ దిగిచి తొడమీఁద నిడుకొని దోషాచరేంద్ర కడగి నీవచ్చిన కార్యంబు నాకు నెఱిఁగింపు నీప్రియంబేను గావింతుఁ దెఱఁగొప్ప ననిన నాదివిజారి వలికె బలిఁ బట్టి విష్ణుండు బంధించినాఁడు బలిమిమైనని విని బంధనంబుడుపఁ దలఁచి వచ్చితి నేను దనుజేంద్ర యనుడు బలి నవ్వి పలికె నప్పౌలస్త్యుతోడఁ బూని వాకిటనున్న పురుషుఁ గృష్ణాంగు మానుగాఁ గంటి వమ్మహనీయమూర్తి దనుజవీరులనెల్ల దండించినాఁడు నను నిట్లు బంధించి నాతఁ డాఘనుఁడు అతని నెవ్వఁడు గెల్చు నతఁడు గావింప మితి నెల్లభూతముల్ మృతిఁ బొందుచుండు బ్రహ్మయు నాతఁడు పరమప్రభుండు బ్రహ్మాది సురలకుఁ పరికింప నతఁడు నలువయు నాతఁడు నాకేశుఁడతఁడు కలితవిక్రముఁడైన కాలుండు నతఁడు జగములు వుట్టింప సరిఁ బెంప నడఁప దగునేర్పుగలవాఁడు తలపోయ నతఁడు తరిమిడి పరికింపఁ దాదృశుండైన పురుషుఁడెవ్వఁడు లేఁడు భువనంబులందుఁ బశువులఁ ద్రాళ్లను బంధించినట్లు దశకంఠ నిను నన్నుఁ దక్కినవారి ముడిగొన సంసారమోహపాశముల వడి నంటఁగట్టినవాఁడె యాఘనుఁడు వికటరోషుండైన వృత్రుండుధనువు శుకుఁడు శంభుండు నిశుంభశుంభులును గాలనేమియు మధుకైటభ కూట కాలకేయులుఁ దక్షకుఁడు దారకుండు యమళార్జనుఁడు గయుండనియెడువాఁడు .......... ప్రచురవిక్రములు శంబర విరూపాక్ష ముచుకుంద దుందుభుల్ మొదలైనయట్టి యతులబలోద్ధుతు లడరంగఁ బోరి యతనిచేతనె కూలి రఖిలంబు నెఱుఁగ వేలసంఖ్యలుగల్గి వెల్గు నింద్రులను వేలసంఖ్యలఁ బొల్చు విబుధసంఘముల ముదమునఁ దనుఁ గొల్చు మునిసహస్రముల వదలక పాలించువాఁడు నాఘనుఁడు అతఁడు కట్టిన కట్ల నాతండె దక్క యితరుండు విడువంగ నెంతటివాఁడు అనవుడు దశకంఠుఁ డామాటలెల్ల వినియును మదిలోన వెఱవక పలికె దనుజేంద్ర తగనిట్టు తపసి చందమునఁ దనరుతేజము తటిత్తరళజిహ్వయును శుభ్రోరుదంష్ట్రలు శోణనేత్రములు బభ్రుకేశంబులు భయదాననంబు సరి మేన వృశ్చికసర్పరోమములుఁ బెరుఁగు రోషంబునఁ బెనుమంట లెసఁగ నత్యుగ్రపాశంబు నరుదార నడరు మృత్యువుతోడుగా మెఱయు నంతకుని నని గెల్చిఁనాడ నేనటుగాన వెఱవ మునుకొని యేడవ మొగసాలకడను ఘనతరభీషణాకారుని గంటి వినుతింపఁబడిన యవ్వీరుడెవ్వాఁడు వినియెద వినుపింపు విశదంబుగాఁగ ననుమాట విని యాతఁడతనితో ననియె విశ్వలోకమునకు విభుఁడును గురుఁడు విశ్వరూపుఁడునైన విష్ణుఁ డాఘనుఁడు భావంబులకునెల్ల బయులైనవాఁడు దేవదేవుఁడు సర్వదేవతామయుఁడు సర్వభూతాత్ముఁడు సర్వచిన్మయుఁడు సర్వరూపుండును సర్వకారకుఁడు శిష్టరక్షణమతిం జేసి చక్రమున దుష్టరాక్షసకోటిఁ ద్రుంచినవాఁడు తనర నాత్మధ్యానతత్పరులైన మునులకు మోక్షంబు మొగి నిచ్చువాఁడు తన భక్తి యెఱిఁగియుఁ దన పుణ్యకథలు వినుతి సేసినఁ దన్ను వినినఁ బేర్కొన్న యాగంబు యాజ్యుండునగుఁ దన్నుఁ గూర్చి యాగంబు చేసిన నఖిలపాపముల??? వలనఁ దొలంగించి వాంచితార్థముల నలువారఁగా నిచ్చు నారాయణుండు బలదేవుఁడన బాహుబలలీలలందు నలఘుఁడై వర్తించునని యెఱిఁగింప నతివినయంబున నాబలీంద్రునకు నతిఁ జేసి యతని యానతిఁ జేసి యపుడు సురవైరి వెడలి యచ్చోట నప్పురుషు నరసి కానక దిక్కులద్రువంగ నార్చి లోకభీకరలీల లోకలోచనుని లోకంబుమీఁద నాలోకకంటకుఁడు మెఱసిపోవుచు నడ్మ మేరుశృంగమున నొఱపుగా విడిసి యందొకరాత్రి పుచ్చి మఱునాఁడు చని హేమమణిగణద్యుతుల వఱలు కేయూరముల్ వరకుండలములు రక్తాంబరంబులు రక్తమాల్యములు రక్తచందనమును రంజిల్లువానిఁ |