| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
ఇనవంశ్యుఁడపుడు మహేంద్రాద్రి యెక్కి యనతిదూరంబున నంబుధిఁగనియెఁ. గరిమకరంబులు కరిసమూహములుఁ దరఁగలు గుఱ్ఱపుదళముల పెల్లుఁ గమఠకర్కటములు ఘనరథావళులు సమ82దజలార్భకసమితి భటాలి పొలుపారు ఫణిఫణంబులు కేతనములు లలిఁ83జోఱమీలవాలము లడిదములుఁ జలదురుమీనాళి చామరప్రతతి తలకొన్ననురువు సితచ్ఛత్రచయముఁ బెనుపొందు ఘోషంబు భేరీరవంబు వినుతింప నీరంబు వీరరసంబుఁ గా‘నన్నుఁజొచ్చినకడిఁదిరావణుని నే నేల చంపంగనిత్తు.’నన్‌మాడ్కిఁ దన84రిన క్రూరసత్త్వస్థితిఁ బేర్చి తన కెదురై మహోద్ధతి నొప్పుదానిఁ గని85వెఱఁగంది యా గాంభీర్యధనుఁడు వనధితీరముఁజేరవచ్చె రాఘవుఁడు. ప్రకటంబుగా సర్వబలముఁగూడుటకు నొక మంచిచంద్రకాంతోపలస్థలిని జలనిధిప్రాపునఁ జరియించుచున్న బలితంపు రావణపాఠీనవరుని ననుపమంబగు తనయంపగాలమునఁ గొని తివుచుటకునై కూర్చున్నకరణి నాసీనుఁడై యప్పు డర్కకులేశుఁ డాసన్నుఁడైయున్న యర్కజుఁబలికె: “వచ్చితి మిమ్మహావారిధి డాయ; 86నెచ్చోట ఘటియించు నిది దాట మనకు? నా యుపా87యంబు నీ వాత్మఁజింతింపు; మీ యగచరకోటి నెందుఁ బోనీక యింపైనయెడ విడియింపంగఁబనుపు సొంపారఁగాఁ88జోటు చూపంగవలయు.’ నని రాఘవేశ్వరుఁ డర్కజుఁ బనుప, నినసుతుండును నీలు నిటు సేయఁబనిచె. నీలుఁడు నప్పుడు నిరతంబుగాఁగ వాలినసేనల వడి విడియించె. “వనచరరవము నా వలనను89గలిగె వనచరరవము నీవలననుగలిగి యునికి సహింతునే యో సముద్రంబ!” యని యప్పు డా వార్థి నదలించుకరణి (వనచరవరఘోష వార్ధి పెల్లెగసె. నినమండలము దాఁకె నేపుమై కడఁగి) విడియువానరసేన వెడలెడుమ్రోఁత యడఁచెఁబెల్లైన యా యంబుధిమ్రోఁత. నట మూఁడువేలంబులై యా పయోధి తటవనభూములఁదరుచరుల్ విడియ నప్పుడు రాముఁడేకాంత90ంబునందు నొప్ప లక్ష్మణునితో నొయ్యనఁబలికె:[వా.రా. సర్గ 5] “సౌమిత్రి!కంటె యీ జలనిధి నెలవు నే మెయిఁ దుద నిశ్చయింపంగ వచ్చు! నిది యింత యంతని యెన్నంగరాదు; తుదిలేదు 91గద మనోదుఃఖవారిధికి!” |