ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
విభీషణస్తోత్రము
“నిత్యసత్యత్రాణ! నిత్యకల్యాణ!
నిత్యజగత్త్రాణ! నిత్యగీర్వాణ!
జగదన్వయాకార! జగదాది వీర!
జగదుదయాకార! జగ250దబ్ధిపూర!
సర్వసంగాతీత! సర్వానుభూత!
సర్వజగత్పూత! సర్వ 251నిర్ణేత!
గురులఘుక్రమరూప! గురుబోధదీప!
గురుమధురాలాప! గురుచారు252చాప!
పద్మసన్నిభనేత్ర! బహుజీవసూత్ర!
పద్మాకలితగాత్ర! పరమపవిత్ర!
కవి253జనసంవేద్య! కరుణానవద్య!
వివిధ254శాస్త్రోత్పాద్య! వేదాంతవేద్య!
పరమాత్ముఁడవు నీవ; పరమంబు నీవ;
పరమవిద్యయు నీవ; పరికింప నెందు.
భువనకర్తయు నీవ; భువనంబు నీవ,
భువనహర్తయు నీవ; భువనైక వీర.
యాగభోక్తయు నీవ; యాగంబు నీవ;
యాగఫలప్రదుండరయంగ నీవ.
చంద్రార్కులును నీవ; జలధులు నీవ;
యింద్రాదులును నీవ; యిలయును నీవ.
మూఁడుమూర్తులు నీవ; మూఁడుమూర్తులకు
బోఁడిగా నవ్వలిపొడవును నీవ.
క్షరమును నీవ; యక్షరమును నీవ;
క్షరసాక్షి వీవ; యక్షరసాక్షి వీవ.
త్రిభువనవందిత! దేవాదిదేవ!
యభయ మీదేవ! నా కఖిలాధినాథ!
జయజయ శతకోటిజలజాప్తతేజ!
జయజయ సంసారసర్పసుపర్ణ!
లలితాగమస్తోత్ర! లక్ష్మీకళత్ర!
విలసద్దయాపాత్ర! విబుధారిజైత్ర!
యలఘుమునిస్తుత! యాద్యంతరహిత!
దళితశాత్రవభీమ! దశరథరామ!
దినకరశశినేత్ర! దివ్యచారిత్ర!
యనుపమశుభగాత్ర! యఖిలైక సూత్ర!
వేనోళ్లుగల భోగివిభుఁడైన నుతులు
పూని నేర్చునె చేయ భూపాల! నిన్నుఁ.?
(బాయనిసద్భక్తిఁబాకారి నుతులు
సేయంగ నేర్చునె శ్రీరామ! నిన్ను?)
నప్పద్మసంభవుండైన నీ మహిమ
నొప్పార నుతియింప నోపునే తవిలి?
యే నిన్ను నెఱుఁగంగ నెంతటివాఁడ?
నే నిన్ను నుతియింప నెంతటివాఁడ?
దానవుండను వృథాతరళచిత్తుఁడను
భూనాథ! నీ వాదిపురుషోత్తముఁడవు255
నరనాథ! యార్తుని నన్ను రక్షింపు;
పరమదుర్జను దైత్యపతిఁద్రుంచివైవు.
మఖిలశరణ్యుండ వైన నీ మఱుఁగు
సుఖమని యే వచ్చి చొచ్చితిఁబ్రీతి.”
ననిన నాతనిఁగరుణాంబుధిలోన
మనుజేశ్వరుండు గ్రమ్మఱ నోలలార్చి:
“నమ్ము! విభీషణ! నాకీశవైరి
తమ్ముఁడవా? నాకుఁ దమ్ముఁడ వీవు;
మఱుఁగకు మింక; లక్ష్మణుకంటె నిన్ను
నఱలేనివానిఁగా నాత్మఁగైకొంటి.”
నని భయం బుడిపి దయార్ద్రవాక్యముల
జననాయకుఁడు విభీషణు నాదరించె.
నెయ్యంబుతోడ నా నృపుఁడప్పు డతని
చె య్యూదుకొని వార్ధి సేరంగఁబోయి:
“మాకు నిక్కము సెప్పుమా విభీషణుఁడ!
నాకారిశక్తియు నమ్మినబలము.”256
ననిన విభీషణుండా రామచంద్రుఁ
గనుఁగొని మ్రొక్కి నిక్కము విన్నవించెఁ:

  1. తీసుధార
  2. సమేత
  3. రూప
  4. మనస్సం
  5. శాస్త్రా
  6. కాన,నిన్నితరులు గానంగ లేరు; - నే నెంతవాఁడను నిజముగాఁ దెలియ
  7. నుదధిలోఁబురము మున్నుదయించు టెట్లు? వదలక తొలుత నెవ్వఁడు నేలె నందు? ననిన…
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )