| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“యో వనచరవీర! యో మహాధీర! నీ విక్రమంబెల్ల నీ రథిసెప్పెఁ గట్టు మంభోరాశిఁగడఁకతో నీవు నెట్టన నీ లావు నేర్పుమై మెఱసి.” యనవుడుఁ గరయుగం బర్థితో మొగిచి వినయంబుతో రామవిభున కిట్లనియె: “నుర్విపై నే నిట యుదయించుటకును నుర్వీశ! కలిగెఁ బ్రయోజనంబిపుడు; దేవ! యీ జలధి బంధించెదఁబనుపు; మా వెర353వెల్ల నే నట తండ్రిచేత ధారుణీతలనాథ! తగ నేర్చినాఁడ. నారయ దేవరయానతిఁ జేసి నా నేర్పు మీ యొద్ద నరనాథ! చెప్పఁ గానేల? యిపుడు సాగరము బంధించి చెచ్చెర దేవరచిత్తంబు వడసి మెచ్చించువాఁడ354నెమ్మిగఁబంపు.”మనుడు నలినాప్తకులమణి. నలునిఁబంచుటయు నలునితోఁగూడ వానరసేనలెల్ల నేలయు నింగియు నిఖిలదిక్కులును వాలినయార్పుల వ్రయ్యఁజేయుచును నా యెడ శైలవృక్షావళిఁదెచ్చి తోయధిఁగట్ట నుద్యోగించి రపుడు. రామచంద్రుండను రాజు గణేశుఁ దా మదిలోపలఁదలఁచి మ్రొక్కుచును నరయోజనంబైన యద్రి సుగ్రీవుఁ డురువడిఁగొనివచ్చి యుర్వి గంపింపఁ గలయంగ దేవతాగణములు వొగడ నలువునఁదొలుదొల్త నలుచేతి కిచ్చె. దొరకొని నలుఁడును దోయధియందు వెరవొప్ప నిలిపె నా విపులశైలంబుఁ దన చేయుసేతుబంధమునకు రాము ననుపమకీర్తికి నా విభీషణుని వినుతపట్టమునకు విశద355ప్రభాతిఁ దనరారు శాసనస్తంభంబుమాడ్కి. నంత వానరకోటి యాశావితాన మంతయుఁదానయై యద్రులుఁదరులు నవలీలఁబెఱుకుచు నవి దెచ్చి నలున కవసరోచితముగ నందియిచ్చుచును, ఒక కొండపై నుండి యొక కొండపైకిఁ బ్రకటజవంబు లొప్పంగ దాటుచును, 356గెరలుచు నొక కొన్నిగిరులెత్తి యార్చి గిరులక్రిందుగఁబెల్లగిలఁగ వైచుచును, గొండలు తల357కెత్తి గునిసి యాడుచును, దెండని కొందఱఁదిట్టి నవ్వుచును, గొండపైఁ గొండ యా కొండపైఁ గొండ యొండొండ యవి డొల్లకుండఁ బేర్చుచును, నిమ్ముల శైలంబు లిరుచేతులందు నిమ్మపండులమాడ్కి నిగుడవైచుచును, ఒకఁడు కొండలు మోచి యురువడి రాఁగ నొకఁడవి పడఁద్రోచి యుబ్బి నవ్వుచును, దాటి యా కొండ లుద్దండతఁబట్టి మీటుదునా నీవు మెచ్చంగ ననుచు, నీ తరు లీ గిరు లింతవేగమున 358వైతునా యా నలువద్దకు ననుచు నని బాసలిచ్చుచు నగ్గించుకొనుచు వనచరు లిబ్భంగి వడిఁదెచ్చి తెచ్చి తరువులు నగములుఁదన కిచ్చుచుండ దొరకొని నలుఁడు సేతువు గట్టఁదొడఁగ ముందటిచందమై మునుఁగక యుండె నందొక్కటైనను నంబుధిలోన. నట్టి చందంబున నా కపికోటి గట్టెను, గటకటా కష్టజీవనము కలిగెనా నాకని కలఁగినమాడ్కిఁ గలఁగి యంబుధి హల్లకల్లోలమయ్యె. నలుఁడు నిమ్మెయిఁబదునాల్గు యోజనము లలవడఁదొలినాఁడె యబ్ధి బంధించె. |