| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“బాపురే! యెంత నేర్పరియొకో నలుఁడు రూపింపఁబెద్దయు రూఢికి నెక్కి యరుగుఁదీర్చిన మాడ్కి నలవడఁదీర్చె దొరకొని సేతువుఁదుది378దాఁక!”ననుచు దన విద్యకలిమిని దన బాహుబలిమి ఘనమైనసేతువుఁగట్టె నీ నలుఁడు అది శతయోజనంబైనట్టి నిడుపుఁ బదియోజనంబులపరపును గలిగి వెలసిన మలయసువేలాచలంబు లొలసి యెంతయుఁజూడ నొప్పు379వహించె. మెలఁగి యాడెడుగండు380మీలుపైఁదఱచు వెలిఁగెడు చుక్కలవిధమున నుండ నిరుదెస నల్లనై యేపారునబ్ధి కర మొప్పుచున్న యాకాశంబు గాఁగఁ 381గలయ నున్నతదీప్తి గన్నుల కిచ్చి వెలసిననక్షత్రవీథి చందమునఁ దను382నట్లు 383గావింప దయపేర్మిఁజేసి తనరార మన్నింపఁదగునని రామ విభుఁ డా సముద్రుని వేడుకతోడ నభయపట్టము 384గట్టె నన మించి మఱియుఁ గప్పారు నా యబ్ధిఁగన్నారఁజూచి యొప్పారఁగపులెల్ల నుబ్బుచు నుండ నప్పుడు దేవత లామింట నుండి యప్పౌరుషముఁగన్నులారంగఁజూచి: “385నిక్కంబు నిట్టిద;386నీచు మృదూక్తిఁ జక్క నేలగు దండసాధ్యుండుగాక! యటు వేఁడుకొనుటయు నబ్ధిగైకొనమి నిటు387సేయనేరఁడే యినకులేశ్వరుఁడు? చేకొని యెవ్వఁడీ సేతువుఁదలఁచుఁ 388గైకొని యెవ్వఁడు గనుఁగొన నొప్పు నతనికి విజయంబు నతులకీర్తియును వితతపుణ్యంబులు 389వెలయంగఁగలుగు; నెంతకాలంబేని యీ సేతువుండు; నెంతకాలంబేని యీ యబ్ధి యుండు నంతకాలము రాఘవాధీశుకీర్తి యంతంత కెక్కుచు నానంద మొసగు.” నని మదిలోపల హర్షించుకొనుచుఁ దనువులఁబులకలు తఱచుగా నెగయఁ బువ్వులవానలు పొరిఁబొరిఁగురిసి 390రవ్వల దేవతూర్యమ్ములు391మ్రోయ. నప్పుడు రఘురాముఁడానంద 392మొంది యొప్పుసేతువుఁజూచి యొనర నిట్లనియె: “నెలమితో నీ సేతువెల్లకాలంబు నలుపేర393ఁబరగుచు నలువొప్పుఁగాక.” యనుటయు నా విభునానతి నలునిఁ గనుఁగొని పొగడిరి కపివీరులెల్ల. ముదముతో నపుడు సముద్రుండు రాము సదనమ్మునకు సైన్యసహితమ్ముగాఁగఁ బొలుపారఁదోడ్కొనిపోయి దివ్యాస్త్ర ములును దివ్యాంబరంబులు భూషణములు నొక వజ్రకవచంబు నురుభక్తి నిచ్చి యకలంకచిత్తుఁడై యా రాముఁజూచి: “రామభూపాలక! రాజపుత్త్రులకు నీ మునివేషంబు లేల యుద్ధమునఁ? జారువస్త్రములు భూషణములు నిపుడు మీరు394ధరింపుఁడిమ్మెయి నుచితంబు.’ |