| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
401గైకసివచ్చినఁగని లేచి మ్రొక్కి యా కాంత నపుడు దా నర్హపీఠమున నాసీనఁజేసి తా నాసీనుఁడగుచు భాసురవినయసంభరితుఁడై పలికె: “జనయిత్రి! యీ సభాస్థలికి నెన్నఁడును జనుదేర; వేటికిఁ జనుదెంచి తిప్పు డెఱిఁగింపు?”మనిన: నే నెఱిఁగిన తెఱఁగు నెఱిఁగించెదను మది నేర్పడ వినుము; మానవాధిపుదేవి మదిఁగోరి నీవు కానకుండఁగఁ దెచ్చుకతన నింతేసి కార్యముల్ వుట్టె నా కమలాప్తవంశ్యుఁ డార్యరక్షణకునై యఖిలంబు నెఱుఁగ దశరథునకుఁబుట్టి తాటకఁద్రుంచి యశమునఁగౌశికు యాగంబుఁగాచి పదధూళిచే రాతిఁబడఁతిఁగావించి ముదమున హరువిల్లు మోపెట్టి విఱిచి జనకభూపతితనూజను బెండ్లియాడి మొనసినపరశురాముని భంగపఱచి తన తండ్రి402పనుపునఁదగిలి కానలకు జనకజాలక్ష్మణసహితుఁడై వెడలి వనములు సొత్తెంచి వనములనున్న మునులకు నభయ మిమ్ముల నిచ్చి నీదు చెలియలిముక్కును జెవులుఁగోయించి యలిగి యా ఖరదూషణాదులఁ403గొట్టి 404మారీచు మడియించి మాయఁబోనీక ఘోరాస్త్రమున వాలిఁగూలంగ నేసి భానుతనూజుని బంటుగా నేలి తోన వారిధి నంప తుదకు రప్పించి కపులచే సేతువుఁగట్టించి మించి యిపుడు సువేలాద్రి కేతెంచినాఁడు. సురల రక్షింప నసురులశిక్షింప. 405ధర మీన కమఠ భూదార మనుష్య హరి వటు రామ రామాది రూపములు ధరియించుచుండు నా దానవాంతకుఁడు. ఆదినారాయణుం డాతని మహిమ భేదించి చెప్ప నభేద్య మెవ్వరికి. నినకులుపంపున 406నేచి యా వాయు తనయుఁడంభోధి యుద్ధతగతి దాటి జనకజతో రామజననాథువార్త వినుపించి యక్షాదివీరులఁజంపి తనరార లంకయంతయుఁగాల్చి సురలు వినుతింపఁబోవఁడే విభుఁడున్నయెడకు. నాతని గెలువలే; వతనియేలికను నీ తరమే గెల్వ నిర్జరవైరి! తెలియంగ మీ తండ్రి దివ్యరహస్య మెలమిఁజెప్పినమాట యెఱిఁగింతు వినుము మునియక్షగంధర్వముఖ్యులతోడ వనజసంభవ సురవరు లిందిరేశుఁ గాంచి:“రావణకుంభకర్ణులబాధ మించెను; మమ్ము నర్మిలిని రక్షింపు.” మనిన వారలఁజూచి యబ్జనాభుండు: “నినకులంబున జనియించి రాక్షసుల దురములో నవలీలఁదునిమెద.”ననుచు వరమిచ్చి సకలదేవతల నీక్షించి: “వనచరులై మీరు వసుధ జన్మించి యనిలోన నాకుఁదోడగుఁ.”డని పలికె. నని చెప్పె మీ తండ్రి; యతఁడె యీ రాముఁ డినవంశుదేవి యా యిందిరాదేవి; తరుచరు లా దేవతలు; గెల్వరాదు దురమున నీకు. నీ దుర్బుద్ధి మాని జగతీతనూజాత జగదేకమాత నిగమసన్నుతపూత నిఖిలవిఖ్యాత నమితగుణోపేతయైన యా సీతఁ బ్రమదంబుతో నిచ్చి పాపశోషణుని ధైర్యభూషణుని సంతతసుభాషణుని నార్యపోషణుఁడైన యా విభీషణునిఁ బరగ 407లంకారాజ్యపట్టంబు గట్టి శరణను మా రామజననాథుఁ బోయి. శరణన్న నెటువంటిశత్రువునైనఁ గరుణతోఁగాచు నక్కరిఁగాచురీతి.” నని బుద్ధిసెప్పిన యట్టి కైకసినిఁ గని దశకంఠుండు కనలి యిట్లనియె: “నెలమి నా కెవ్వరు నెదురు లేకుండ బలిమినిఁగలిమి నేఁబదిలక్షలేండ్లు మనినాఁడ; వేడ్కతో మహితసౌఖ్యములఁ గనినాఁడ; వెఱతునే కలన నెవ్వరికి! నరులు వానరులు నెన్నఁగ నెంతవారు! సురలకన్నఁ దలంప శూరులేవారు! గెలుతు నవశ్యంబు; గెలువలేకున్న నిల రాముశరముల నీల్గుదుఁ; గాని హీన మానవునకు నే మ్రొక్కఁజాల; మాను మీ మాట ముమ్మాటి కోయమ్మ! విచ్చేయు నగరికి; వేయుఁజెప్పినను నచ్చుగా రామున కా సీత నీయ.” నను తనయుని రోసి యచ్చోటు వాసి చని యంతఁగైకసి సదనంబుఁజేరి: “యే తెఱంగునఁబోవ దిది దైవకృతము; నీతి సెప్పిన విననేర్చునే!”యనుచుఁ దన నిత్యధర్మంబుఁదప్పక యపుడు మనమునఁదెలిసి సమ్మదమున నుండె. నట408దశగ్రీవుండు నధికదర్పమునఁ బటుతర నిస్సాణభాంకృతుల్ సెలఁగఁ జేయించి రాక్షససేన రావించి యా యోధనోద్యుక్తులై యేపు మీఱి యున్నమంత్రులఁజూచి యుగ్రుఁడై పలికెఁ గన్నులఁగోపంబు గడలుకొనంగ: “శ్రీరామచంద్రుండు సేతువుఁగట్టి వీరుఁడై వచ్చి సువేలాద్రి విడిసెఁ; బటుగతి నా మీఁదఁ బగవాఁడు409నడవ నిటు నిద్రవోవుట యే410నీతి మీకు? మి411మ్మేమిసేయుదు; మిము మంత్రులనుచు నమ్మినవీఱిఁడి నను నందుఁగాక! కాదు పో మీ రుపేక్షాపరులైన నా దెసఁగీడొందునా యెవ్విధమున! సామభేదంబులఁజక్కఁగాకున్న రామునితోఁబేర్చి రణము సేసెదను.” అని రావణుండాడ నఖిలరాక్షసులు తనికిన సిగ్గునఁ దలలెత్తలేక యూరకుండిరి.‘యూరకుండ నే?’లనుచు ధీరుఁడై యా వేళ దివిజారియైన రావణుతోడ దర్పంబునఁదనదు చేవ దోపఁగ నింద్రజిత్తుండు వలికె: “దేవ! రావణ! సర్వదేవసంఘముల 412భావించి విజయంబుఁబాటించు నీకు నిల యేలఁగానని యీ రామలక్ష్మ ణులచేత నే కీడు నూల్కొను నింక? వలదు చింతింప; నే వాలినవాఁడ; నలవుఁజలంబు ధైర్యముఁగలవాఁడ నాగపాశంబుల నాకీశుఁగట్టి యాగతి నేఁపనా యసురాధినాథ!; కాలకేయాదిరాక్షసవీరవరులఁ దోలనా దానవోద్ధురసంగరమున! మనుజులఁగృశులఁ413దాపసుల దుర్బలుల దనుజేశ! దశరథతనయుల నాకుఁ జంపుట పెద్దయే సమరంబులోనఁ! జంపెద నీ మది సందియపడకు.” మన విని యతికాయుఁడనువాఁడు వలికె దనుజేశ్వరునితోడ దజ్‌జ్ఞులు మెచ్చ: |