ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాఘవులు సువేలాద్రినుండి లంకఁ జూచుట
నని పల్కి యా రాముఁడనుజుండుఁదాను
నినసుతుఁడాదిగా నెల్లవానరులు
గొలువంగ వచ్చి నెక్కొను వేడ్కతోడ
నలరుచు నా సువేలాచలం బెక్కి
గుణములు గలవాఁడు గోత్రంబునందు
బ్రణుతికి నెక్కు నిబ్భంగి నన్‌మాడ్కిఁ
గనియె542 రాఘవుఁడు లంకాపురం బపుడు
తన చేతఁగడకు సాధ్యంబగుదాని,
ననిలజుపెట్టిన యంతనుండియును
దనరార లోపల దరికొన్నచిచ్చు
నాఁడును మండెడు నా మణిప్రభల
పోఁడిమి గలుగుగోపురములదానిఁ,
గడునేరుపున రాము ఘాతకు నులికి
మిడికెడు రావణమృగముఁబోనీక
విలయకాలుండను వేఁటకాఁడర్థి
వెలివాఱు వాఱిన విధమునఁజూడఁ
దనరారు పెద్దకొత్తళములతోడఁ
గనుఁగొన నొప్పు ప్రాకారంబుదాని,
‘రావణుఁబొరిగొందు, రామ, ర’మ్మనుచుఁ
జేవీచు543 గతిని విచిత్రధ్వజముల
మహనీయతోరణమంగళ544సూత్ర
మహిమతో నంబరమణిసంగమమునఁ
దళతళవెలుఁగు 545మధ్యంబుల నొప్పి
చెలువారఁగాఁ దట్టుచేతులు గలిగి
పగలును రేయును బాయక 546కూడు
మగలచే నొప్పు కొమ్మలు గలదాని,
నెసగినరాముకట్టెదుటికిఁగాలుఁ
డసురేశుఁడను లులాయముఁబట్టితేర
నొఱపుగాఁద్రవ్విన యోదంబు లనఁగ
నెఱసినపరిఖల నెలకొన్న దానిఁ,
గైలాస మమరారి క్రమ్మఱఁబెఱికి
మేలైన పేర్మి నిర్మించినమాడ్కిఁ
దనరారి యల మిన్నుఁదాఁకి తెల్పునను
గనుపట్టుమేడలు గల్గినదాని,
ఘనలక్ష్మి యెదురుకోఁగడఁగె రామునకు
నని చెప్పునట్టితూర్యధ్వనిదానిఁ,
జిలుకలపలుకుల చెలువు వహించి
యలులనాదంబుల నానందమంది
కలకంఠరవములఁగడుఁబ్రీతిఁజేసి
పలికెడి శారికాస్ఫారత మెఱసి
పల్లవ547చయమనఃపల్లవం 548బించు
పల్లవంబుల రాగభరితంబు 549లగుచుఁ
గడివోని పువ్వులగంధంబువలన
నెడపక యందంద యింపులు 550సూపఁ
జెప్పఁబెక్కగుచు నేచినయట్టితరుల
నొప్పెడువనముల నొప్పారుదానిఁ,
గమల551కెందును మనఃకమలంబులైన
కమలాకరంబులఁగరమొప్పుదాని,
నటు చోద్యపడి చూచు నా రాఘవునకు
552నట యంచితప్రతాపాతపం 553బొసగి
యాకాశమణి గ్రుంకె నపరాబ్ధిలోనఁ
గాకుత్స్థమణి నమస్కారంబు సేయ.[వా.రా. సర్గ 40]
నా రాఘవుఁడు సువేలాద్రిపై నుండి
యా రాత్రి గడతేర్చి యంత వేగుటయు
గపులు వినోదంబుగాఁబెల్లురేఁగి
విపినంబులెల్లను వెసఁజొచ్చి చొచ్చి
యందలిశరభసింహాదులనెల్ల
నందంద తోలుచు నార్చుచుఁజెలఁగ
నట్టికోలాహలంబంతయు లంక
ముట్టె రాక్షసులయెమ్ములు 554వగులింప
నది విని రావణుఁ;“డది యేమిరవము?
పొదఁ.”డని వచ్చి గోపురమెక్కి చూచె.
నప్పుడు గోపురం బతనితోఁగూడ
నొప్పెఁజూపఱ555కును నుజ్జ్వలంబగుచు.
ధవళాతపత్రముల్‌ దఱచుగాఁబట్ట
ధవళచామరములు దఱచుగా వీవఁ
బొరిఁబొరి సురదంతిపోటులనమరు
నురమునఁబదకంబు లొరయుచుఁగ్రాల
నాయత రత్నసింహాసనాసీనుఁ
డై556యుండె నంతఁబెంపలర రావణుఁడు
బహు557విధరాక్షస పరివృతుండగుచు
558మహితాయుధప్రభామండలంబునను
నపరాచలముమీఁది యర్కునితోడి
యుపమకుఁబాత్రుఁడై యుజ్జ్వలుండగుచు.
మెఱు559ఁగుల560తో నీలమేఘంబువోలెఁ
దఱచుగా మెఱసి561ముదం562బులు గురియ
నెసగిన యా దానవేశ్వరుఁడప్పు
డసమానుఁడై యుండె నా563గోపురమున.
మహనీయ రావణమహిమచేఁ జేసి
మహితవిద్యుత్ప్రభామండలంబైన
గోపురస్థలము దృగ్గోచరం564బైన
భూ565పాలతిలకుఁడద్భుతముఁబొందుచును
“ఆ విభీషణుఁజూచి యల్లనఁబలికె:)
“రా విభీషణ. గోపురంబున566వచ్చి
(భావింప నరుదైన ప్రాభవంబునను)
ఈ విధంబుననున్న యితఁడెవ్వఁడొక్కొ?
ప్రళయకాలమునాఁటి భానుబింబముల
వెలుఁగులపొదిఁబోలి వెలుఁగుచున్నాఁడు?
అనిన విభీషణుం డా రాముతోడ
ననియె:“నాతండు మాయన్న రావణుఁడు;
సురనాథు సురలను స్రుక్కించినాఁడు;
సురకామినులఁజెఱఁజొనిపినవాఁడు;
567ముల్లోకములుఁజలంబున శౌర్యపటిమఁ
బెల్లుగా గెలిచిన పృథుబాహుబలుఁడు.”

  1. రావణుని లంకానగరంబు
  2. పడగలఁజెలువొందు (వైన)దాని
  3. తూర్య
  4. నద్దంబుల
  5. యున్న
  6. ఘనచయ, చయములఁ బల్లవంబగుచు
  7. బులకుఁబ
  8. నగుచు
  9. సూపి, (పు)
  10. కందువ
  11. ఁబటుతరోద్యత్ప్రభాభాతి దానొసగి (గ)
  12. బొసగ, నా
  13. వ్రక్కలింప
  14. చూడ్కికు
  15. యెంతయును బొలుపారి యయ్యెడను
  16. వీర
  17. మహనీయశస్త్రాస్త్ర మహిమతో నొప్ప -న
  18. పులుగల
  19. లో
  20. బున నొప్పు
  21. మేడమీఁద
  22. బగుడు
  23. పాలుఁడప్పు… మంది పలికె
  24. నెక్కి
  25. ముల్లోకములు నుగ్రమూర్తిచే హల్ల - కల్లోలముగ ఁబడఁ (వడిఁ) గారించినాఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )