ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
వానరులు లంకలోఁ బ్రవేశించుట
గరువలిసుతునిపైఁగర589మొప్ప నెక్కి
వరపుణ్యనిధి జాంబవంతుఁడంగదుఁడు
సౌమిత్రియును విభీషణుఁడు నలుండు
భీమవిక్రమకళాభేద్యులై కొలువ
నా నగస్థలి డిగె. నతులవిక్రముఁడు
వానర590పతులును వడిఁ591దోడుచూపఁ
దాను ముందఱ దనుర్ధారియై నడచెఁ
దోన యా లక్ష్మణాదులు చేరి కొలువఁ.
దక్కినసేన లుద్దండవేగమునఁ
బెక్కుభంగుల నొక్కపెల్లుగాఁ592దోడ
నడవ నెంతయుఁబేర్చి నలినాప్తకులుఁడు
కడుఘోరమైన రాక్షసకోటి593చేతఁ
దనరిన లంకయుత్తరపు వాకిటను
594విన విస్మయంబుగా విడిసె రాఘవుఁడు.
ద్వివిదమైందులతోడఁ దివిఱి నీలుండు
నవిరళభుజశక్తి నమరులు పొగడఁ
బరువడిఁ గపిసేన బలసి తన్‌ గొలువ
వరమతి విడిసెఁ బూర్వద్వారమునను.
గజుఁడు గవాక్షుండు గవయుండు భూరి
భుజుఁడైన ఋషభుండుఁబొంకంబుతోడఁ
దనతోడఁగూడి రా దక్షిణద్వార
మున వాలిపుత్త్రుండు ముదమొప్ప విడిసెఁ.
బసతో సుషేణునిఁబవననందనుఁడు
వెసఁగూర్చుకొని బాహువిక్రమంబొప్ప
వాఁడెపో యీ లంక వడిఁగాల్చినట్టి
వాఁడు నాఁబడుమటివాకిట విడిసె.
మే595టులు పెద్దనమ్మినముప్పదాఱు
కోటులు కపినాయకులు596తన్నుఁగొలువ
వెస రాముపడుమట విడిసె నర్కజుఁడు.
పసగల భల్లూక597పతులు దన్‌ గొల్వ
నసమానబలయుతుఁడై ఋక్షవిభుఁడు
వసుధేశునకుఁదూర్పువంకను విడిసె.598
మనుజేశుఁడపుడు లక్ష్మణవిభీషణులఁ
గనుఁగొని పలికె నుత్కంఠ దీపింప:599
“వనచరపతుల నవారితబలుల600
బనుపుఁడు మఱియును బై దళంబుగను
నెక్కడ నేమియు నేమఱకుండ
నొక్కొక్కపద్మ మొక్కొక్క 601వాకిటికి.”602
“ననలుండు నలుఁడును హరుఁడు సంపాతి
మనము మూవురమును మార్తురతోడ
మిగిలి రాక్షసకోటిమీఁదఁబెల్లెగసి
తగిలి603యిక్కడనె యుద్ధంబు సేయుదము.
క్రందైన సందడి కయ్యంబులోన
నిందు నందును మన కెఱుఁగంగవలయు.”
నని పల్కి రాముఁడా యగచరాధిపులఁ
గనుఁగొని యపుడొక్క కట్టడ సేసెఁ.
“గపిరూపములె కాని కామరూపములుఁ
గప604టరూపంబులుఁగాకుండుఁ”డనుచు.
నిటు రామునానతి నెల్లవానరులు
నటు లంకచుట్టు నత్యంతవేగమున
నిశ్చల605సత్త్వులై నెలకొని పూర్వ
పశ్చిమోత్తరయామ్యభాగముల్‌ నిండి
పదియోజనంబుల పరపున విడిసి
పదిలమై యుండి యప్రతిమవిక్రములు
వికృతవాలంబులు వికృతాననములు
వికృతదంష్ట్రంబులు వికృత606కాయములు
నమరంగఁదరుశైలహస్తులై పేర్చి
సమరంబు సేయంగ సన్నద్ధులైరి.
వారి607 యదల్పులు వారి యార్పులును
వారి హుంకారరవంబులుఁజెలఁగ
భీమమై లంకలోఁబేర్చి యా దైత్య
భామినీజనులగర్భంబులు 608వగిలె.
నట్టికోలాహలంబంతయుఁజూచి
నెట్టన రాక్షసనికరంబు 609బెదరె.

  1. మును వైచి
  2. సేనలు
  3. దోడ నడవ, దోవ
  4. గదలి
  5. తోడ, బెదర
  6. వినుతవిక్రమమున
  7. టియై
  8. సుట్టు విడియ
  9. బలములుఁదాను
  10. నెక్కడ నేమియు నేమఱకుండ -మిక్కిలి కడిమిమై మెఱసి రాఘనులు
  11. వినుత (శస్త్రాస్త్ర ప్రవీణతమెఱసి) మహాబలవిక్రమంబొప్ప- పనసుని (పనుపుఁడు) ఁగపిసేన పై దళంబుగను
  12. వెనుకొనియుండఁ బ్రవీణతఁబనిచె
  13. వాకిటను
  14. ననవుడు శ్రీరామునానతిఁజేసి - పనిచిరి యట్లనే పటుసత్త్వధనులఁ, బంపిన రామభూపాలుండు సౌరి- నింపారఁగనుఁగొని యిట్లని పలికె
  15. యొక్కటన, యొక్కెడనె
  16. టంబు లేమియుఁగాకుండుఁ డనుచు
  17. చిత్తు
  18. నఖాళి
  19. యద్భుతములు
  20. గలఁగె
  21. చెదరె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )