ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ధూమ్రాక్షుని యుద్ధము
ననుచు మత్తేభరవానుకారముగ
ఘనమైన నిట్టూర్పు గ్రమ్మధూమ్రాక్షుఁ
బనిచె“నగ్గలమైన బలమును గొనుచుఁ
జను వేగ రామలక్ష్మణులపై.”ననుచుఁ
బనిచిన నా దైత్యపతికి మ్రొక్కుచును
ననికెత్తి ధూమ్రాక్షుఁడప్పుడు వెడలె.
వాని బలంబు వెల్వడఁజొచ్చె నపుడు
నానా విధంబుల నలుగడలందు.
వృకసింహముఖముల వెలసినయట్టి
ప్రకటితస్ఫూర్తి తురంగంబు లొప్పఁ
బటపటార్భటిఁజెవుల్‌ పగులించునట్టి
పటురవంబుల దిశాపటలంబు నద్రువ
వడి భయంకరము దివ్యంబైన దీప్తి
యడర ధూమ్రాక్షుని యరద మొప్పారె.
భేరులు శంఖముల్‌ పృథుమృదం848గములు
భూరి ఘోషణము లద్భుతముగా మ్రోయ
దురమున కటువచ్చుధూమ్రాక్షునకును
బరువడిఁదోచె నొప్పని శకునములు;
నలి నార్చి ముందఱ నడచురాక్షసులు
నిలిచి యెంతయు భీతి నిశ్చేష్టులైరి.
849అయ్యును నిలువక యగ్గలికంబు
కయ్యంబుమీఁదను గలిగి యార్చుచును
వచ్చి ధూమ్రాక్షుండు వారిధివోలె
నచ్చెరువైయున్న యగచరసేనఁ
దాఁకిన యసురులఁదరుచరేశ్వరులు
దాఁకిరి మిన్నులు దాఁక నార్చుచును.850[వా.రా. సర్గ 52]
దానవావలి యడిదంబుల వ్రేయ,
వానరావలి వ్రేయు వారి వృక్షముల;
దానవేశ్వరులు కుంతంబులఁబొడువ,
వానరుల్‌ పొడుతురు వడిఁబిడికిళ్ల;
దానవుల్‌ హరులఁబంతంబునఁద్రోల,
వానరుల్‌ వానిని వ్రత్తురు గోళ్ల;
దాన851వోత్తములు రథంబులు వఱప,
వానరుల్‌ వానిని వ్రయ్యఁద్రొక్కుదురు;
దానవుల్‌ మదగజతతుల డీ కొలుప,
వానరుల్‌ వాని నుర్వరఁగూర్తు రలుక.852
నివ్విధంబునఁబేర్చి యిరువాగుఁబోర
నవ్వనచరవీరు లసురులఁగిట్టి
యంతకాకృతిఁగాళ్ల నలమి మదోగ్ర
దంతుల నేలతోఁదాటించి చంపి
వానిఁజేకొని కడువడి వ్రేసి డాసి
దానవానీకంబు 853దర్పంబుమాపి
యసమునఁగడు నొగ లలమి యందంద
వెసఁద్రిప్పి రథములు విఱుగఁదాటించి
వానినె కొని కడు వడి వ్రేసి వ్రేసి
దానవానీకంబు ధరమీఁదఁ గూల్చి
854కడకాళ్ల నొడిసి ప్రక్కలమీఁదఁబట్టి
పుడమి బెట్టుగ నశ్వముల వ్రేసి చంపి
వానిన కొని కడువడి వ్రేసి వ్రేసి
దానవానీకంబు తనువులు సదిపి
855యెదిరి కాల్బలముల యెమ్ములన్నియును
856బ్రిదులంగఁదన్నియుఁబీనుఁగుల్‌ సేసి
వానిన కొని కడువడి వ్రేసి వ్రేసి
దానవానీకంబుఁదలముగాఁగెడపి
మఱియుఁగ్రందుగఁజొచ్చి మహితదంష్ట్రికలఁ
గఱకు రాక్షసకోటిఁగఱచి చెండాడి
చాఁచినవారి యస్త్రంబులు విఱిచి
మోఁచేతులను వారి మోములు వొడిచి
పడఁద్రోచి చేతుల బలిమిగా నదిమి
మెడలును గాళ్లును మిడుకంగఁబట్టి
మోఁకాళ్ల నూఁది యిమ్ముల దైత్యవరుల
వీఁకఁగోలెమ్ములు విఱుగంగఁ857జేసి
కడువడి నిడుదతోఁకలు దగిలించి
యుడుగక మెడలకు నురులు గావించి
యఱిముఱిఁబరవశులై గ్రుడ్లు వెలికి
నుఱికి బెట్టుగఁజావ నొగి బిగియించి
పెల్లుగాఁ బీనుఁగుపెంటలు సేయ
మల్లడిగొని త్రెళ్లె మహిమీఁద నప్పు
డివి తల లివి కన్ను లివి వదనంబు
లివి చెక్కులివి ముక్కు లివి కంధరమ్ము
లివి బాము లివి మేను లివి జఘనంబు
లివి యూరు లివి జాను లివి చరణములు
నని యేరుపడకుండ నసురవర్గములు.
నెనడును మజ్జంబు నెత్తురు మెదడు
నెఱచియుఁబ్రేవులు నెమ్ములుఁదోలుఁ
బుఱియలతోఁబెనుఁబ్రోవులై యుండె.
నప్పుడు ధూమ్రాక్షుఁడా కపిసేనఁ
జప్పరింపుచుఁదాఁకి చతురత మెఱయఁ
దలలు వ్రయ్యలుగ ముద్గరముల వ్రేసి
చలము దీపింపఁ బ్రాసంబులఁబొడిచి
పరిఘంబులను భిండిపాలశూలములఁ
గరవాలముల మహోగ్రతఁబెంపు సూపఁ
గడు నొచ్చి నెత్తురుల్‌ గ్రక్కుచుఁబడిరి
కడిమికిఁ బెడఁబాసి కపులు పెక్కండ్రు.
తక్కటిక్రోఁతు లుదగ్రత దక్కి
దిక్కులు వఱచిరి ధృతి పెంపు దూలి.
పఱచినఁగోపించి పర్వతం బొకటి
యఱిముఱిఁగొని వైచె హనుమంతుఁడలిగి.
వైచిన గదగొని వారించి యప్పు
డా చావునకుఁ దప్పి యసుర దాటుటయు
నది దానవాధము నరదంబుమీఁదఁ
జదరంబుగా వచ్చి చదియంగఁబడియె.
నంతటఁబోవక యనిలతనూజుఁ
డెంతయుఁ గడఁకతో నేపు దీపించి
యలుకతో జముఁడు బ్రహ్మాండంబు వగుల
బలువిడి నుగ్గాడుపగిదిఁగోపించి
తరుశైలపాషాణతతుల రాక్షసుల
శిరములు నుగ్గాడి సింహవిక్రముఁడు
నడరి వాండ్రను దోలి యగశృంగ మొకటి
తొడిఁబడఁగైకొని ధూమ్రాక్షుమీఁదఁ
గడఁగి యేతేరంగ గదగొని యతఁడు
మడియు మంచును హనుమంతు మస్తకము
వ్రేసిన ధూమ్రాక్షువీఁకయు లావు
నీసును శౌర్యంబు నింత గైకొనక
హనుమంతుఁడుగ్రత నఱచేత నున్న
ఘనతరశైలశృంగంబెత్తి యార్చి
యేచి యద్దానవు నేపెల్లఁ దూల
వైచినఁదల రెండువ్రయ్యలై కూలె.
నప్పుడు గొండ వజ్రాహతిఁగూలు
చప్పుడు దోచెను జగములనెల్ల.
నటు వాఁడు మృతుఁడౌట హతశేషులైన
కుటిలదైత్యులు గాలికొడుకున కులికి
భూచక్ర మదరంగఁ బొరిఁబొరి మగుడి
చూచుచు వెస లంక సొచ్చిరి పాఱి.[వా.రా. సర్గ 55]

  1. గాది
  2. అయ్యెడ వెఱవక
  3. నంగదాదులకును నసురుల కపుడు- సంగర మతిఘోర సంకులం బయ్యె - దానవావలి…
  4. వుల్‌ రథము లుదగ్రతఁబ
  5. దానవుల్‌ పరశువుధార వ్రచ్చుటయు - వానరుల్‌ పైఁబడ వైతురు ఱాళ్ల - నివ్విధంబున…
  6. తనువులు నొంచి
  7. కెడపి కాళ్లొడిసి పక్కెరలతోఁ
  8. యెసగఁగా
  9. నుసుముగాఁదన్ని పీనుఁగులు గాఁజే
  10. బొడిచి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )