ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ప్రహస్తుని యుద్ధము
దనుచు రావణునిఁబ్రహస్తుండు వీడు
కొనివచ్చి తాఁదనకోలలవారిఁ
బనిచి యప్పుడు నాల్గుబలము937ల వారిఁ
938దనుఁగూర్చుకొని మహోద్దండ భావమున
ఘనమైన కపివరాంగంబుల గాలి
తన మీఁద వీచునంతకు మ్రోయుచున్న
కొమ939రున 940జలద నిర్ఘోషంబుదాని
నమరంగ విహగేంద్రులనఁగపు లెగసి
తక్కక ద్రుంచునంతకుఁగ్రాలుచున్న
చక్కనియురగ ధ్వజస్ఫూర్తిదాని
మణిగణ కింకిణీ మహనీయభూరి
రణన941ంబు గల్గిన రథ మప్పుడెక్కి
పెక్కుతూర్యముల గంభీరరావముల
దిక్కులు ఘూర్ణిల్ల, దివి యొడ్డగిల్లఁ,
జుక్కలు డుల్ల, వసుంధర యెల్ల
వ్రక్కలు వాఱఁ బూర్వద్వారమునను
గాలాంతకుఁడుఁబోలెఁ గడఁగి యిబ్భంగి
నాలంబు సేయఁబ్రహస్తుండు వెడలె.
నప్పు డా దైత్యుల యార్పులు, నతని
యొప్పారఁబేర్చిన యుగ్రమూర్తియును[వా.రా. సర్గ 58]
నక్కజంబగుటయు నా విభీషణుని
కక్కడఁజూపి రామావనీశ్వరుఁడు:
“తేజంబు బలమును 942దీప్తి శౌర్యంబు
రాజిల్లుచున్న యా రాక్షసేశ్వరుని
పేరేమి? సాహసస్ఫీతుఁడై కపుల
పై రాక చెప్పఁజూపఁగఁ జోద్యమయ్యె.”
ననుడు విభీషణుండర్కవంశునకు
ననియె:“దేవా! యితఁ డా రావణునకుఁ
గలిగిన సైన్య సంఘంబులకెల్ల
దలవాయి; యీతని దళమందులోన
మూఁడవపా లగు; మూఁడులోకముల
వాఁడి 943మగంటిమి వాలినవాఁడు;
వరబలాఢ్యుండు; రావణుమాతులుండు;
హరవిక్రముండు; ప్రహస్తుఁడన్వాఁడు.
ఖండేందుధరు చెలికాని సామంతు
భండనంబున మాణిభద్రుని నోర్చెఁ.
దపనకులేశ యీ దైత్యునితోడఁ
గపినాథులకు 944లెస్స కయ్యంబు గలుగు.”
నని చెప్పుచుండంగ నగచరులెల్ల
దనుజు945లకెదురుగాఁదరు గిరులెత్తి
యార్చుచు వచ్చిన నసుర 946సైన్యములు
నార్చుచు మార్కొని యని సేయునపుడు
ప్రళయకాలాగ్నికి బాడబాగ్నికిని
గలుషతఁదలపాటు గలుగదు గాని,
పొడిపొడిగా మిన్ను భువియు నొండొంటి
గడుబెట్టు దాఁకుట గలుగదు గాని,
మొనసి యా బ్రహ్మాండములు దమలోన
ఘనముగాఁదాఁకుట గలుగదు గాని,
కలిగిన నిబ్భంగిఁగపిదైత్యనాథు
లులుకక పోరాడు టుపమింపవచ్చుఁ.
బావకనిభ బాణపంక్తులు దైత్యు
లా వనచరులపై నార్చుచు నేయ
నందు వెండియుఁగొంద ఱసిగదా ప్రాస
సందీప్త ముసలోగ్రచక్రముల్‌ వైవఁ
దరుచరబలములు దరులును గిరులు
నురల దైత్యులమీఁద నురువడి వైవ
ధరమీఁద డుల్లెడు తలలును వ్రయ్యు
నురములు నుఱుమైన యురుకంధరములుఁ
దొరిగెడు ప్రేవులుఁ దునియు ఫాలములు
మురిసిన యెమ్ములు ముంచురక్తములు
జెదరిన మెదడు విచ్ఛిన్నంబులైన
పదములు మిట్టెడు బాహుదండములు
ముడిఁగి ముద్దలభంగి మురియుపీనుగులు
నడిమికిఁదెగిన యున్నత దేహములును
ద్రెళ్లెడు మేనులుఁదిరిగెడు గ్రుడ్లుఁ
బెల్లుగా నెంతయు భీకరంబయ్యెఁ.
దలఁకక సంగరస్థలమునఁబోరి
కలఁగొనఁబడిన రాక్షసులును గపులుఁ
గలఁగి యంతటఁబోక కలుషించి మించి
చల మగ్గలించి యుత్సాహంబు మెఱసి
బెడిదంబుగా దైత్యబృందంబు మీఁద
నడచి రప్పుడుఁగపినాయకోత్తములు:
ద్వివిదుండు వైచెఁబృథ్వీధరశిఖర
మవిరళశక్తి నరాంతకుమీఁద;
నకలంకుఁడై కుంభహనుఁ బడవైచె
నొక వటంబునఁ దారుఁడుగ్రవేగమున;
వడిఁబెద్దగిరి జాంబవంతుఁ డుద్ధతిని
నడరించి మించె మహానదు మీఁద;
భూరిభూజంబునఁబొరిఁ గూల నేసె
ఘోరంబుగా దుర్ముఖుఁడు సమున్నతుని
వానరనాథుల వాటులచేత
దానవుల్‌ నలువురు ధరఁద్రెళ్లుటయును
దన ప్రధానులచావుఁ947దప్పక చూచి
యనయంబు నలిగి ప్రహస్తుండు గపుల
నొకటఁబదుండ్రను నొకట948నిర్వదుర
నొకట949 ముప్పదురను నొకట 950నల్వదుర
రథచిత్రగతు లొప్ప రయమునఁబేర్చి
పృథివిపైఁ గూల్చినఁ బేర్చి వానరులు
ద్రుమశైలములఁబ్రహస్తుని సేనలెల్లఁ
జమరినగతి నుండఁజంపిరి కడఁగి.
యప్పుడు వెల్లువలై పాఱఁజొచ్చెఁ
జొప్పడ మిన్నంది శోణితనదులు.
నందులోపలనుండి యసురులుఁగపులు
నందంద యనిసేసి రార్చుచుఁబేర్చి.
యా యగ్గలిక చూచి యఖిలదేవతలు
వేయువిధంబుల వినుతించి రప్పు.
డా ప్రహస్తుండు కాలాంతకాకారుఁ
డై ప్రతిలేక సొంపారి యా వేళఁ
గరములుఁబదములు ఖండించివైచి
యురములు నిటలంబు లుచ్చిపో నేసి
తలలును బాహులు ధరమీఁదఁ గూల్చి
తలఁగక యెమ్ములు దంతముల్‌ రాల్చి
మురియలుగాఁజక్రములఁద్రుంచి త్రుంచి
పొరిఁబొరి నంకుశంబులఁజించి చించి
కడు నుగ్రముగఁబరిఘలఁగొట్టి కొట్టి
ముడివడ ఘనపాశములఁగట్టి కట్టి
లలిమీఱఁ బరశువులను వ్రచ్చి వ్రచ్చి
పొలుపార బలుశూలములఁగ్రుచ్చి క్రుచ్చి
మునుమిడి పట్టిసంబులఁ జిమ్మి చిమ్మి
గొనకొని కడిమి శక్తులఁగ్రుమ్మి క్రుమ్మి
పలలంబు మెదడుఁ గుప్పలు సేసి చేసి
సొలవక యంపరాసులు వోసి పోసి
పటు భూతకోటికి బలి యిచ్చి యిచ్చి
పటపట దిక్కులు పగుల నార్చుచును
సమదవిక్రమకళా951 సంపదఁబేర్చి
యమితుఁడై మెఱసి ప్రహస్తుఁడే పొందె

  1. లువేగ, తోడ
  2. దనరఁగూర్చుక
  3. రారు
  4. జలధి
  5. మేపారెడు రథ మొప్పనె
  6. దీప్త
  7. వీరుండు రావణుమాతులుండు- ఖండేందు
  8. బలు
  9. ని
  10. వర్గ
  11. ఁదద్దయుఁజూ
  12. నేఁబండ్ర, నూర్వురను
  13. ఁబదార్వుర
  14. నూర్వురను
  15. సంరంభ మెసగ- న
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )