| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా విభీషణుఁడు రామాధిపుఁజూచి: “దేవ! యీ దైత్యుని తెఱఁగెల్ల వినుము: వరనందనుఁడు విశ్రవసునకు నితఁడు; కరముఁగ్రూరుఁడు; కుంభకర్ణుఁడన్ వాఁడు; రావణుతమ్ముఁడు; రణవీథిఁగిట్టి దేవసంఘంబుల దిక్పాలకులను బలుమాఱుఁదోలిన బాహుబలాఢ్యుఁ; డలఘుశూలాయుధోద్ధతసత్త్వధనుఁడు; బ్రహ్మాండమైననుఁబగులింప నోపు; బ్రహ్మాదులకు1089వట్రపడఁడు సత్త్వమున; వీఁడుపుట్టినయప్డె వికృతం1090పునోరఁ బోఁడిమి చెడ జీవముల మ్రింగఁజొచ్చె. మునుమిడి యటుజీవముల మ్రింగమ్రింగ విని వజ్రి కోపించి విపులవజ్రంబు వీనిపై వైచిన వీఁడు1091గోపించి యా నాకగజదంత మ1092గలించి పెఱికి సురపతి నేసిన సురసుర స్రుక్కి సురపతి యప్పుడు సురలతో వచ్చి యంభోజభవుఁగాంచి హస్తముల్ మొగిచి: “కుంభకర్ణుండను ఘోరరాక్షసుఁడు పొలుపారఁబ్రజలఁజంపుచునున్నవాఁడు; సొలవక సురల నేఁచుచునున్నవాఁడు; కడఁగి పరస్త్రీలఁగవయుచున్నాఁడు; తొడరి లోకములెల్లఁ ద్రుంచుచున్నాఁడు; ఈ నీచుఁ డీ క్రియ నిటమీఁద నున్న వీని నిగ్రహమున విశ్వంబు వొలియు.” ననవుడు 1093విని యప్పుడంబుజాసనుఁడు తన మనంబున నల్క దద్దయు మిగుల రాక్షసావలినెల్ల రప్పించి యందు వీక్షించెఁ దప్పక వీని రూపంబు; వీక్షించి యెంతయు వెఱఁగంది:“వీఁడు భక్షించుఁబో వెస బ్రహ్మాండమైన వీని చందముఁజూడ వెఱపు నాయందు నూనెడు; వీఁడింతయుగ్రుఁడైయున్న వీఁడాజిలోపల విదళింపకున్నె? మూఁడు1094గన్నుల వేల్పు ముట్టిననైన!” నని వీనితో నప్పుడనియె నా బ్రహ్మ “చన”దని మిగుల నాజ్ఞాపింపఁదలఁచి: “యా పులస్త్యునియుత్తమాన్వయంబునను నీ పుట్టు1095టెల్లను నిఖిలభూతములఁ బొలియించుకొఱకు 1096నా! భువనంబులెల్ల నలుకంగ నిట్టిశౌర్యముఁజూపె!”దనుచుఁ జావుతో సరియైనశాపంబు నిచ్చె: “నీవు1097డుగనియట్టి నిద్రఁబొ.”మ్మనుచుఁ. జలిపిడుగునుబోలె శాపంబు దాఁకి 1098నిలువలే కెంతయు నిద్రితుండయ్యె. రావణుఁడప్పు డా బ్రహ్మకు మ్రొక్కి: “దేవ! చూడుము కృపాదృష్టితో వీనిఁ. దారు పెట్టినచెట్టుఁదారె త్రుంపుదురె? యే రూపమున నితఁడెంత కీడైనఁ దగుబుద్ధి సెప్పుట దగవగుఁగాని తగ దిటువలె శాప1099దగ్ధునిఁజేయ. వీని నిద్రకుఁడుది వివరింపు.”మనుడు దానవుతోడ నుత్తరమిచ్చె నజుఁడు: “నక్కజంబుగ నిద్ర యాఱేసినెలలు; నొక్కనాఁడెఱు1100కచే నుండుఁబొ1101మ్మనియె.” నంతనుండియును వీఁడవ్విధంబునను జింత సేయక నిద్రఁజెంది మేల్కాంచు. దేవ! యిప్పుడు నీదు దివ్యబాణోగ్ర పావకశిఖలఁబాల్ప1102డ నిల్వ లేక 1103యనవసరంబున నా రావణుండు తను మేలుకొలుపంగ దైత్యులఁబనుపఁ దానునుఁబేర్చి యుద్ధప్రసన్నద్ధుఁ డై నేఁడు నగరికి నరుగుచున్నాఁడు. వెస వీఁడు రావణు వీడ్కొనివచ్చు నసమున మనమీఁద; నంతకుమున్న వీని యాకృతిఁజూచి1104వెసఁబాఱకుండ వానరసేనలో వడిఁజాటఁబనుపు: “దనుజుండు గాఁడిటు దారుయంత్రమున నొనరంగఁజేసిన యుగ్రరూ.”పనుచు. నిటు చాటఁగాఁబంచి యెల్ల వానరులఁ బటుభీతియును బాపి భండనంబునకు సన్నద్ధులుగఁజేయ సకలాధినాథ! మున్నె యానతి యిమ్ము! మోహరింపంగ.” ననవుడు నీలున కానతి యిచ్చి జననాథుఁడబ్భంగిఁజాటంగఁబనిచె. నా కుంభకర్ణుండు నట పురాంగనలు చేకొని పూవులసేసలు చల్లఁ[వా.రా. సర్గ 62] జని నిండువెన్నెలసదనమో యనఁగఁ దనరారుచున్న యాస్థానంబు సొచ్చెఁ బరగిన ధవళాభ్రపటలంబు సొచ్చు సురుచిరకరుఁడైన సూర్యునిభంగిఁ. జొచ్చి యన్నకు మ్రొక్కి సొంపార నతఁడు గ్రుచ్చి కౌఁగిటఁజేర్చి కూర్మి దీపింపఁ గనకాసనంబిడఁగాఁబనుచుటయు దనుజాధినాథుని తమ్ముఁడం దుండి యన్న నాలోకించి:“యసురాధినాథ! నన్నుఁదెల్పినకారణంబేమి నేఁడు? ఎవ్వఁడు నీ1105దెస నెగ్గొనరించె? నెవ్వనిఁజంపుదు? నే తెఱం?”గనుడు నా కుంభకర్ణున కనియె రావణుఁడు: “నీకుఁబెల్లగుచున్న నిద్రపెంపునను నే కార్యగతియును నెఱుఁగవుగాన చేకొని యంతయుఁజెప్పెద వినుము: రాముఁడిప్పుడు దశరథనందనుండు సోమించి నామీఁద సుగ్రీవుఁ గూడి వననిధి బంధించి వచ్చి యీ కోట 1106వెనుకొని బలువిడి విడిసియున్నాఁడు. అనికిఁజొచ్చుటయుఁబ్రహస్తాదివీర దనుజులనందఱ ధరమీఁదఁగూల్చె. వానరవీరు లెవ్వరుఁజావ రందుఁ; గాన యా రామలక్ష్మణుల జయించి యా వాలిసుత రవిజాదులఁజంపి లావును జెడకుండ లంక రక్షింపు.” |