| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
‘యింకఁబోరా’దని యింద్రారి1148యెదుట నంకకాఁడునుబోలె నతఁడిచ్చె బాస: “కిట్టి భంజించెదఁ గీనాశునైనఁ; బట్టి1149మర్దించెదఁబద్మజునైన; జిఱజిఱఁద్రిప్పెద శేషునినైన; 1150వెఱఁగందఁజేసెద విహగేంద్రునైన; బలువిడి మ్రింగెద1151ఁబ్రళయాగ్నినైనఁ; జలమునఁగ్రోలెద జలనిధినైన; 1152వే పాఱఁద్రోలెద విష్ణువునైన; రూపఱఁ జేసెద రుద్రునినైనఁ గడఁగి1153 ఖండించెదఁగ్రవ్యాదునైన; మెడ నుల్చివైచెద మృత్యువునైన; వడి చెడఁజేసెద వరుణునినైనఁ; గడుపు సించెద నలకాపతినైనఁ; బిడికిలించెద రవిబింబంబునైనఁ; బడఁద్రోచిపుచ్చెద బ్రహ్మాండమైనఁ; గ్రోఁతులఁబట్టి మ్రింగుదు నను టెంత లేఁత నా సమరకేళీసముద్ధతికి! నా మర్కటులనెల్ల నద్రుల కనిచి యా మనుజులఁద్రుంతు నసురాధినాథ! నీ మనంబలరంగ నెమ్మది నుండు; రాముఁడు నా చేత రణములోఁబడిన సీత యనాథయై చిక్కు;1154నంతటను; నీ తలంచినకోర్కి నీకు సిద్ధించు.” ననిన మహోదరుం డా వాక్యములకు ఘనభుజుండగు కుంభకర్ణుతో ననియె:[వా.రా. సర్గ 64] “సత్కులంబున నీవు జనియించినాఁడ; వుత్కటంబగు గర్వముచితమే నీకుఁ! 1155దగు నయానయములు దలపోయ కిట్లు పగతుఁజంపుదు నని పలుకు నే ఘనుఁడు? కోపంబు దీపింప ఘోరసింహంబు నేపున నున్నవాఁడెసగు తేజమునఁ; గేవల మానవాకృతి గాదు రాముఁ; డా విష్ణుఁడీ రూపమై వచ్చినాఁడు; ఆ వాలి నొక కోల నణఁచినశూరుఁ; డా వీరవరు గెల్వ నలవియే నీకుఁ? బ్రకటవిక్రములైన పగవారిమీఁద నొకఁడ పోవుట మాకు నొడఁబాటుగాదు; బలముతోఁజని మహాబలుఁడైన రాము 1156గెలువు మీ.”వని దశగ్రీవుతో ననియె: “నేము గల్గఁగ నీకు నేల చింతింప? నీ మనోరథసిద్ధి నెఱపంగలేమె? జానకికొఱకు విచార మేమిటికి? నేను1157సంపాతియు నీ1158ద్విజిహ్వుండు గంభీరవిక్రమకలితబాహుండు కుంభకర్ణుండుఁగూడికొనిపోయి రాము నెలమి గెల్చితిమేని యే యుపాయము1159ల వలనొప్ప సిద్ధించు వైదేహి నీకు. నటుకాక రామనామాంకితబాణ చటులోగ్రపాతంబు సైరింపలేక వడి భిన్నతనులమై వచ్చితిమేని నడరంగ మేము నీ యడుగుల1160కెఱఁగి ప్రణుతోగ్రవానరబలముతోఁగూడ రణభూమిలోపల రామలక్ష్మణుల వధియించి భక్షించి వచ్చితి.”మనుచు నధిప! చెప్పిన మమ్ము నధిక మోదమున నాలింగనము సేసి యర్థి మన్నించి పోలంగ నీ వార్త పురమున నెల్ల నీవు సాటించిన నిజముగా సీత భావించి యటమీఁదఁబతియాస విడిచి మతిఁబూని నీ మాట మఱిచేయు.”ననిన నతనిఁగోపించి యయ్యసురారిఁజూచి: “యీ బొంకులగు మాటలెల్ల నేమిటికి? నా బాహు1161బల మేచి ననుఁజూతుగాక! నిశ్చయంబుగ రాము నిర్జింతు నేను 1162నిశ్చింతముగ నుండు నీ విటుమీఁద.” నని కుంభకర్ణుఁడుదగ్రుఁడై పలుక విని రావణుఁడుఁగడువేడ్క దీపింపఁ దనకుఁబునర్జన్మతాసిద్ధి గలిగె నని చాల మోదించి యనుజన్ముఁజూచి: “చని యాజి రామలక్ష్మణుల నిర్జింతు వని నమ్మినాఁడ నీ యతులసత్త్వంబు. శౌర్యంబునందు నీ సరియైనవీర వర్యులు లేరు; ధ్రువంబివ్విధంబు. మునుకొని శూలంబు మొదలుగాఁగల్గు ఘనతరాయుధములఁగయ్యంబు సేయు.’ మని ప్రీతి రెట్టింప నతనికి నిచ్చె ననుపమ రత్నమయాభరణములు. |