ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
వానర కుంభకర్ణుల యుద్ధము
నంత వానరవీరు లంతలోఁదెలిసి
యంతకాకృతిగల యా కుంభకర్ణుఁ
గిట్టి పాదపముల గిరిశృంగములను
బట్టి బెట్టుగ నెదుర్ప1180డ వ్రేసి యార్చి
పొరిఁబొరిఁబోరుచోఁబోనీక పొదివి
తరుచరసేనపై దానవసేన
యురువడిఁ గదియ నిట్లుభయసైన్యములు
బరవసంబునఁదలపడియె నా వేళఁ
బ్రలయకాలమునాఁటిపటుసాగరములు
తలకొని యొండొంటిఁదార్కొన్నభంగి.
నొడళులు నెమ్ములు1181నూరులు బరులుఁ
బొడిపొడిగాఁజేసి పోనీక మఱియుఁ
దవిలి ప్రేవులు మెడల్‌ దలలు ఫాలములు
నవియంగ1182బెట్టు రథ్యములఁద్రొక్కించి
కడ1183లఁగీలించినకత్తులచేతఁ
గడికండలుగఁజేసి కట్టల్కతోడ
నంతఁబోవక భూనభోంతరంబెల్ల
నంతలోపల వాఁడియమ్ములఁగప్పి
వడిఁబేర్చి రథములవార లిబ్భంగిఁ
గడిమిఁజంపిరి మహోగ్రముగ వానరుల.
వానరులును రథా1184వళులపై కుఱికి
పూనిచి వెనుకకుఁబోవఁ దన్నియును
గడునొగ లలమి బ్రగ్గన నేలతోడ
నడిచియు విఱిచి యల్లంతవైచియును
భయదంబుగా వచ్చి పాదయుగ్మముల
రయమునఁజదియ సారథులఁద్రొక్కియును
బెళపెళ1185నరములు పెనఁచి రాఁదిగిచి
తల లురువడిఁద్రెంచి ధాత్రి వైచియును
రథికులై పేర్చినరాక్షసా1186ధిపులఁ
బృథుగతిఁజంపిరి పెక్కుచందముల.
నది గని రాక్షసు లధికరోషమున
వదలక వానరావలిఁజుట్టుముట్టి
మదముపెంపునఁబలుమఱుఁగరిఘటలఁ
బదముల సన్నలఁ బైఁ గదియించి
కడకాళు లొడియించి కరములవలన
నెడపక నేలతో నెత్తి వ్రేయించి
మెదడునుఁబునుకలు మేదినిఁగలయఁ
బదములఁద్రొక్కించి భయదంబుగాఁగ
నోలిఁజూర్ణంబులై యుర్వి1187నొండొండ
రాల నుగ్రప్రదరముల నేసియును
గరులపై నున్న రాక్షసు లేపు మీఱి
యురువడిఁగెడపి రత్యుగ్రతఁగపులఁ.
గపులు నుగ్రంబుగాఁగవిసి యెంతయును
గుపితులై గజములకొమ్ములు వట్టి
కుదిచి రూపణఁచియుఁ గుంభస్థలములు
పదములఁబఱియలుపాఱఁదన్నియును
బలలంబు రక్తంబు బహుళాస్థిచయముఁ
గలయఁగాళ్లొగిఁబట్టి గడఁక వ్రేసియును
నా యేనుఁగులమీఁద నలవుఁజలంబు
వేయుభంగులఁజూపి వేగ1188ంబు మెఱసి
పట్టినవిండ్లును బాహు1189వుల్‌ తలలు
నట్టలు మఱువులు నవనిఁగూల్చియును
నసమునఁగపులు గజారూఢులైన
యసురులఁజంపి రత్యంతరౌద్రమునఁ.
గూడి దట్టము చేసికొనియు బీరంబు
లాడుచు హరులఁగ్రొవ్వడరంగఁదఱిమి
పలుదెఱంగుల బాణపంక్తులేసియును
నలి సెలకట్టియల్‌ నాట నేసియును
సునిశితఖడ్గవిస్ఫురణ శోభిల్ల
మొన సొచ్చి 1190కడికండములుగ వ్రేసియును
నుక్కలులైన రాహుతు లేపు మీఱి
తక్కక చంపి రెంతయు గిరిచరుల.
గిరిచరవరులును గిట్టి యశ్వములఁ
గరములఁదోఁకలుఁగాళులుఁబట్టి
దెసలకు వైచియు దివికి వైచియును
వసుమతి వైచియు వ్రచ్చివైచియును
బదఘట్టనంబులఁబగులఁ1191దాఁ1192చియును
వదలక యామీఁద వ్రాలెడునట్టి
రాహుతులైన యా రాక్షసాధిపుల
సాహసంబున నేలఁజమరిరి కడిమి.
నమ్ముల నేసియు నడరి కుంతములఁ
గ్రుమ్మియు సురియలఁగ్రుచ్చి త్రోచియును
శితఖడ్గసమితి వ్రేసియు ముద్గరముల
వితతచూర్ణములు గావించియు మఱియుఁ
గల యాయుధముల నుగ్రతలు సూపియును
శిలలఁబాదపములఁజెదరఁబాపియును
గడిమి1193పెంపున నిట్లు కాల్వురు గిట్టి
బెడిదంబుగాఁగఁజంపిరి తరుచరులఁ
దరుచరులును నా పదాతిపైఁగవిసి
1194పొరిఁబొరి నాయుధంబులు విఱిచియును
నెట్టన పదకరనికరంబు లలమి
చట్టలు 1195వాపియుఁజమరివైచియును
నిరుచేతులందును నిరువురఁబట్టి
1196పొరిఁబొరిఁదాటించి 1197పొళ్లు సేసియును
నట్టలు శిరములు నమరంగఁబట్టి
దిట్టతనంబునఁద్రెంచివైచియును
నుడుగక చంపి రత్యుగ్ర వేగమునఁ
గడిమి దీపింపఁబెక్కండ్రు రాక్షసుల.
నివ్విధంబునఁబేర్చి యిరువాగుఁబోర
నవ్వనచరులందు నసురులయందు
నిండిననెత్తురు నీళ్లభంగియును,
గండలు విరియు చెంగలువలమాడ్కి
మానితాస్యములు దామరల చందమున
నా నేత్రములు గుముదావళి పగిదిఁ.
దోరంపుఁబ్రేవులు తూఁడుల తెఱఁగుఁ
బేరిన మెదడును ఫేనంబురీతి
మెండువెండ్రుకలు తుమ్మెదపిండు పోల్కి
దండిశస్త్రంబులు తరఁగలవడువుఁ
జామరావళులు హంసంబుల ఠేవ
భూమిపరాగంబు పుప్పొడియొప్పుఁ
గైకొని యపుడు సంగరమహీస్థలము
భీకరంబయ్యును బెద్దయు నొప్పె
ననిమిషారులపాలి యా మృత్యుదేవి
గొనకొని వర్తించు కొలని చందమునఁ.
1198గాన కదా యిది కాకుత్స్థరాము
నూనెడు జయలక్ష్మి కునికి పట్టయ్యె.
సురఖేచరులు మెచ్చి సొంపారి రపుడు
దురమున నిరువాగుఁదొడరి పోరాడఁ
గపికోటి నొచ్చినఁగడఁగి 1199యందంద
కపినాయకులు సూచి కపటరాక్షసులఁ
గెరలి క్రోధంబున గిరి 1200మహీజములఁ
దరమిడి నొప్పింప దానవుల్‌ బెదరి
కడు వేగమునఁగుంభకర్ణుని వెనుక
కడరి పాఱిరి“శర”ణను పల్కులొప్ప.
నా కుంభకర్ణుండు నా దైత్యవరులఁ
జేకొని దిక్కులు సెదర నార్చుచును
“ఓడ; కోడకుఁ.”డని 1201యూఱడించుచును
గూడి పైపై వచ్చు క్రోఁతులనెల్లఁ
జూపులచేతనే చుఱువుత్తుననుచుఁ
గోపించి శూలంబుఁగొని యార్చి పేర్చి
బలితంపుఁగపికోటిపాలిటి విధియొ,
కలుషత నేతెంచుకాలుఁడో; యనఁగ
రావణుతమ్ముఁడు రాక్షసాధీశుఁ
డా వనచరకోటి నడఁగింపఁజొచ్చెఁ.
గఱకైన యా కుంభకర్ణుని1202యెదుర
నెఱవైన కడిమిని నిలువలే కపుడు
వడి మూర్ఛ నొంది యుర్వరఁబడువారుఁ
గడువడి నెత్తురుల్‌ గ్రక్కెడువారు,
సేతువుత్రోవకై చెడి పాఱువారు,
వాతూలగతి దివి వడిఁబ్రాఁకువారు,
నగు వానరులఁజూచి1203యడరి యంగదుఁడు
తగ నప్పు డతిబలోదగ్రుఁడై పలికె:
“నేల వానరులార! యిటు సెడి పార
నేలినపతి డించి యేపు వోకార్చి?
1204వరకపీంద్రులు మహావంశ1205సంభవులు
కెరలి పాఱుదురె ప్రాకృతులచందమున?
రామునిముందర రణములోఁబడిన
రామణీయక సురరాజ్యంబు గలుగు;
నటుగాక బ్రతికిన1206నతికీర్తి గలుగు;
నిటు మగుడుఁడు; పాఱ1207నేల మీ?”కనుచు
బుద్దులు సెప్పుచుఁబురికొల్పి యొక్క
గ్రద్దన మగుడించెఁగపికోటినెల్ల.
నా కపు లంగదు నతులవాక్యములు
గైకొని యొప్ప నా కర్ణించి మించి
ప్రాణంబు లిత్తుము రామున; కతని
ప్రాణంబుకంటె మా ప్రాణ1208మే?”మనుచుఁ[వా.రా. సర్గ 67]
గొండలుగొని వచ్చి కో యని యార్చి
కొండఁబోలినదైత్యు గుండెపై వైవ
శూలంబు గొని వడిఁజూర్ణంబుసేసె
నా లోన రాక్షసుఁ డా పర్వతముల;
వదలక యంతఁబోవక రౌద్రమెసగ
గద చేతఁగొని త్రిప్పి కడువడి నేసి
పదియేడుకోటు లేఁబదియేడులక్ష
లదన ముప్పదివేలు నార్నూఱుకపుల
హుంకారరవమున నుగ్రత మెఱయఁ
గింకతో నా రణక్షితిమీఁదఁ గూల్చెఁ;
జెలఁగి యంతటఁబోక చేతులఁగపుల
బలువిడిఁగబళించెఁబటురౌద్ర మెసగ
గరుడండు వెస నురగంబుల మ్రింగు
కరణి నెంతయు భయంకరవృత్తి1209తోడ.
నా క్షణంబున నొక్క యార్నూఱుకపుల
వీక్షించి యిరువది వేవురు కపుల
లక్షించి యెనుబదిలక్షల కపుల
రాక్షసాధీశుండు రయమున మ్రింగె;
మ్రింగి 1210యంతటఁబోక మిక్కుటంబగుచు
సంగరాంగణమునఁజరియించు1211చుండ
నరభోజనుండు వానరభోజనుండు
ధరణిపైఁ దానయై దర్పించె. నపుడు,
ఘూర్ణిల్లుచును ముకుగోళులయందుఁ
గర్ణరంధ్రములందుఁగపిసేన వెడలె.
వెడలినఁగబళించి వెండియు మ్రింగుఁ
దడయక; మఱియు ముందటితెఱంగునను
జెలఁగుచు వెడలినఁజెదరి పోనీక
సొలవక పట్టి నజ్జుగ1212ఁజేసి నమలు;
సడలి కోఱలసంధి జాఱి భూస్థలిని
బడినఁజూర్ణంబుగాఁబదహతిఁబ్రాము.
నంత నాతనిగదాహతిఁబడ్డక్రోఁతు
లెంతయుఁ దమ మూర్ఛలెల్లను దెలిసి
యార్పులతోఁదరు లద్రులుఁ1213దెచ్చి
దర్పించి నిలిచి రా దానవునెదురఁ.
గనలుచు ద్వివిదుండు గండశైలంబుఁ
గొని యప్పు డసురవక్షోవీథి పగుల
నడరింప నది దాఁకి యల్లంత మిట్టి
పడియె రాత్రించరబలములు సదియ.

  1. డి యార్చి పేర్చి
  2. నుర్విపై రాలఁ-గడునొగల్‌ రథములు గాఁడంగఁబఱపి
  3. ఁబెక్కు
  4. ల(లు) గలించిన
  5. వళిఁగిట్టిమించి
  6. నుర, రథ
  7. వలుల, ధముల
  8. నందంద
  9. దానవులు
  10. దండములు
  11. నవఖండ
  12. ద్రొక్కియును
  13. కి
  14. సొం
  15. మురియలుగా శస్త్రములు
  16. చీఱియుఁ
  17. యురువడి దాటించి యురుల వైచియును
  18. పుడమివైచి
  19. మానిత రఘురాము మంగళమూర్తి
  20. యొండొండ
  21. తరుప్రతతిఁ
  22. యూఱడఁబల్కి
  23. యందు… కడిమికి…
  24. యంగదుఁడేచి
  25. వాలినమగలు సద్వంశ… కేలి పాఱు…
  26. వర్ధనులు
  27. నప
  28. కెలమి మీ రనుచు
  29. మేల, మెంత
  30. దోప, మెఱసి-యా
  31. యంతటికంటె మిక్కిలి యగుచు
  32. చుండె
  33. వడి
  34. బట్టి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )