| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
రాజమార్గంబుల రా మేడలందు రాజిల్లు నా గోపురంబులయందు నొప్పెడి పురకాంత లొగిఁబుష్పవృష్టి యప్పుడు గురియంగ నర్కనందనుఁడు తెలిసి యా పురవీథిఁ1237దెఱఁగొప్పఁజూచి వెలవెలనై కడు వెఱుఁగునఁగుంది: 1238“యిటు పట్టువడితి నే నీ దైత్యుచేతఁ బటుతరమూర్ఛచేఁబడి యింత తడవు.” నని యటుకరముల నా దైత్యుచెవులు పెనఁచి తమ్మెలతోడఁబెఱికి రాఁదిగిచి 1239పుటములతో ముక్కు బోసివోఁగఱచి పటుగతి మింటికి భానుజుం డెగయ నిమ్ములఁబోనీక యేచి రాక్షసుఁడు క్రమ్మఱ నాతని కాళ్లొగిఁబట్టి నేలతో వ్రేసిన నెగసి సుగ్రీవుఁ డేలిన పతికడ కేఁగె వేగమున సుర లాకసంబునఁజోద్యంబు నొందఁ దరుచరవరులెల్లఁదనుఁజేరి మ్రొక్క. వారును దానును వచ్చి సుగ్రీవుఁ డా రామచంద్రుని యడుగుల కెఱఁగ నాలింగనము సేసె నంత రాఘవుఁడు నా లోనఁ గపులెల్ల నానందమంద. నా యసురేశుండు నట ముక్కు సెవులు పోయిన నెంతయు బుద్ధిలో రోసి |