ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుశక్తిచే లక్ష్మణుఁడు మూర్ఛిల్లుట
నిడుకొంటి లక్ష్మణ! యీ శక్తిహతికిఁ
గడిమిమై నీ వోర్తుగా.”కంచుఁబలికి
ప్రళయకాలాదిత్యపరివేష ఘోర
వలయమై దీపింప వడిఁద్రిప్పి వైచె.
నది కింకిణీఘంటికానేక రవము
లొదవంగ మ్రోయుచు నుదధులు గలఁగ
వడిఁగులాచలములు వడఁకాడ దిశలు
1955బెడఁక దివాకరబింబంబు1956 గదలఁ
బిడుగులు దొరుగంగఁబృథివి గంపింప
నుడుపథం బవియంగ నుడుపంక్తి చెదర
మిడుఁగురు లెగయంగ మింటఁబెన్మంట
లడరంగ శేషజిహ్వా1957కార మగుచు
రయమునఁబఱతెంచి రాముఁ“డా లోక
భయదసాధనముచేఁబ్రాణభయంబు
సమకొనకుండెడు సౌమిత్రి.”కనఁగ,
నమరులు మింట హాహా కృతుల్‌ సేయ
నెడనెడ వడి నేయు నిషుపంక్తిఁజదిపి
వడి వచ్చి లక్ష్మణువక్షస్థ్సలంబు
భీకరతరశక్తిఁ బెల్లుగాఁ గాఁడ
రాకుమారుఁడు దూలి రణభూమి వ్రాలెఁ
గాలావసానంబు గదియఁబెంపేది
కూలు మహామేరుకుధరంబుపగిది.
ధరణిపైఁ బడియున్న తమ్మునిఁ జూచి
దరికొన్న శోకాగ్నిఁదన చిత్త మెరియఁ
గనుఁగవ బాష్పముల్‌ గ్రమ్మఁ బై నిగుడు
దనుజేశుపటుబాణతతులు గైకొనక
పృథుతరవక్షంబు పెల్లుగా నాటి
పృథివిఁగాఁడినయట్టి భీకరశక్తిఁ
బఱతెంచి వనచరపతులెల్లఁగూడి
పెఱుకఁజాలకయున్నఁబెఱికి పోవైచి
యర్కజానిలసుతులాదిగాఁగలుగు
మర్కటేశులఁజూచి మనుజేశుఁడనియె:
“శౌర్యంబుసలిపెడి సమయంబుగాని
కార్యంబు1958విడుచుశోకమువేళ గాదు;
ఘనులార! మీరు లక్ష్మణుఁగాచికొనుఁడు;
వినుఁడు నా పలికెడు వీరప్రతిజ్ఞ:
వెనుకకు రాజ్యంబు విడుచుట, బంధు
జనులఁబాయుట, వనస్థలులఁగ్రుమ్మరుట,
బాణబాణాసన పాణినై యుండి
ప్రాణంబు దానైన పత్నిఁగోల్పడుట,
కడిఁది మాయావిరాక్షసులతో ననికిఁ
దొడరుట మొదలైన దుఃఖంబులెల్ల
ఘోరాజిలోఁబాపుకొనువాఁడ1959నేఁడు
దారుణకర్ము నీ దశకంఠుఁదునిమి.
సమరోర్వి నీతనిఁజంపెడికొఱకు
నమితవిక్రముఁడైన యా వాలిఁజంపి
కపిసేనకై దినకరతనూభవునిఁ
గపిరాజ్యపట్టంబు గట్టితి1960ఁ బ్రీతిఁ;
జండతరగ్రాహసంకులంబగుచు
నొండొండ మిన్నందునూర్ములు గలిగి
కడలేని వారిధిఁగట్ట1961గావించి
కడచి వచ్చితి మహాకపిసేనతోడ;
వచ్చి లంకాపురవరము వే1962ష్టించి,
యిచ్చట సౌమిత్రి నిటు గోలుపడితి.
నా దశాననుఁడేచి యాలంబులోన
నా దృష్టిమార్గంబు1963నకు వచ్చెనేని
దృష్టివిషంబునఁదీవ్రసర్పంబు
దుష్టజంతువుఁగాల్చు తెఱఁగుఁజూపెదను;
1964బ్రదికిపోనీ నింకఁబంక్తికంధరునిఁ;
బ్రదరపరంపరపాలు సేసెదను;
గిరులెక్కి నేఁ1965డింక గిరిచరవరులు
సొరిది మారణకేళిఁ జూతురుగాక!
లోకపాలురు నెల్లలోకముల్‌ నేఁడు
నా కార్ముకప్రౌఢి నలువారఁజూచి
రణములోపల నేను రఘురాముఁడగుట
ప్రణుతవిక్రమలీలఁబరికింప నిండు.
సురకంటకుఁడు డాఁగి సురలోకమునకు
నరిగిన నబ్ధిమధ్యమునఁగ్రుంకినను
ధరణిఁదూరిన రసాతలముఁజొచ్చినను
బొరివుత్తుఁగాకేల పోనిత్తు1966నింక.
భువి నర్కకులమునఁబుట్టితినేని
రవితేజుఁడగు దశరథుతనూజుండ
నై1967తినే రాముఁడ నైతినే 1968నింక
దైతేయపతి రణస్థలి నిల్చెనేని
నే విధంబుననైన నిపుడ నిర్జింతు
రావణుఁ డయ్యెడి, రాముఁ డయ్యెడిని
యిల రామరావణులిరువురయునికి
కలుగంగనేరదు కదనరంగమున.”
ననుచు నారాచంబు లందంద తిగిచి
దనుజేశుపై నేయ దశకంధరుండుఁ
బ్రతిశిలీముఖపరంపరలు పైఁబఱప
నితరేతరాశుగానేక సంఘముల
మండుమంటలు నభోమండలి నిండ
నొండొంటితోఁదాఁకునుగ్రరావంబు
గురుతరకోదండగుణనినాదములు
1969బెరసె నొక్కట లోకభీకరగతుల.

  1. బెడయ
  2. వగుల, గలఁగ
  3. భీల
  4. లడఁచు
  5. నేను
  6. నెలమిఁ
  7. గట్టించి
  8. ఁడించి
  9. నను నిల్చె
  10. బదరి
  11. డెల్ల
  12. నేను, ఁదన్ను
  13. తేని
  14. నియును
  15. బెరసియు… కరంబయ్యె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )